హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Winter Food: ఒంట్లో వేడిని పుట్టించే ఫుడ్.. చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే

Winter Food: ఒంట్లో వేడిని పుట్టించే ఫుడ్.. చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Winter Health Tips: శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి, అలాగే ఫిట్‌గా, వెచ్చగా ఉండడానికి డైట్‌లో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Nutritious Foods: దేశంలో చలికాలం ప్రారంభమైంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ఉదయం పూట జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ సీజన్‌లో చలి నుంచి ఉపశమనం పొందడానికి జనాలు టీ, కాఫీ, పాస్ట్‌ఫుడ్ వంటి వేడివేడి ఐటెమ్స్‌ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అయితే శీతాకాలం(Winter)లో రోగనిరోధక శక్తి (Immunity) పెంపొందించుకోవడానికి, అలాగే ఫిట్‌గా, వెచ్చగా ఉండడానికి డైట్‌లో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

సజ్జలు

సజ్జలు చిరుధాన్యాల కుటుంబానికి చెందినవి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సజ్జ పిండితో రొట్టెలు చేసుకొని ఆహారంగా తీసుకుంటారు. ఇందులో ఐరన్, కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో సజ్జ రొట్టె లేదా గంజిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలతో పాటు వెచ్చదనం కూడా అందుతుంది. రక్తహీనతతో బాధపడేవారు సజ్జలతో చేసిన ఆహారం తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ కూడా పెరుగుతాయి.

Jaggery: బెల్లం ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా..? తప్పక తెలుసుకోండి

తాజా కూరగాయలు

చలికాలంలో చాలామందికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి తాజా కూరగాయలతో సూప్ చేసుకోవచ్చు. దీంతో శరీరానికి కావాల్సిన వెచ్చదనం లభిస్తుంది. అలాగే ఆహారంలో చిలగడదుంపలు, ముల్లంగి వంటి దుంపలు ఉండేలా చూసుకోండి. స్వీట్ పొటాటోలో ఫైబర్, విటమిన్ ఏ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం నివారణలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ముల్లంగిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి. అంతేకాకుండా బ్రోకలీ, పుట్టగొడుగులు, బీన్స్, క్యారెట్‌లను కూడా డైట్‌లో చేర్చుకోండి.

ఖర్జూరం

ఖర్జూరంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటున్న వారు వీటిని తరచూ తీసుకోవాలి. ఖర్జూరాల్లో విటమిన్, మినరల్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలకు పవర్‌హౌస్‌గా ఉన్న ఖర్జారాలను శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

Heart Attack : చలికాలంలో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం.. వీరు ఎక్కువ జాగ్రత్త పడాలి

సుగంధ ద్రవ్యాలు

శీతాకాలంలో వెచ్చదనం, రోగనిరోధక శక్తి కోసం ఫుడ్ ప్రిపేర్ సమయంలో ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు వంటి సుగంధ దినుసులు చేర్చండి. దీంతో శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది. అలాగే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఆహార పదార్థాల తయారీలో అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు జీరా వంటివి కూడా జోడించండి. ఈ మసాలా దినుసులు ఆహారానికి సువాసనను అందించడంతో పాటు డిష్‌లోని పోషకాలను కూడా పెంచుతాయి.

మెంతి కూర తింటున్నారా.. ఐతే.. ఈ 10 ప్రయోజనాలు మీ సొంతం

చీజ్, గుడ్లు, చేపలు

చలికాలంలో జనాలు తరచూ వైరల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు. దీంతో వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. దీన్ని రీస్టోర్ చేయడానికి శరీరానికి విటమిన్ కంటెంట్ అవసరం. ఇందుకోసం చీజ్, గుడ్లు, చేపలను డైలీ డైట్‌లో చేర్చుకోవాలి. వీటిల్లో ప్రోటీన్స్, విటమిన్ బీ-12 పుష్కలంగా ఉంటాయి. కూరలను చీజ్‌తో చేసుకోవడం ద్వారా రుచితో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్లు అందుతాయి. అలాగే ఉదయంపూట టోస్ట్‌తో ఉడికించిన గుడ్డను జత చేసి తీసుకోండి. లంచ్, డిన్నర్‌లో చేపలతో చేసిన కర్రీ, రైస్ ఉండేలా చూసుకోండి. దీంతో శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

First published:

Tags: Health, Health Tips, Life Style, Lifestyle

ఉత్తమ కథలు