శీతాకాలంలో మీ పిల్లలను ఈ ఆహారాలకు దూరంగా ఉంచండి.. వీటితో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం

శీతాకాలంలో మీ పిల్లలను ఈ ఆహారాలకు దూరంగా ఉంచండి.. వీటితో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం

ప్రతీకాత్మక చిత్రం

శీతాకాలం వచ్చిందటే చాలు సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. పెద్దవారే కాదు పిల్లలు కూడా శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

  • Share this:
శీతాకాలం వచ్చిందటే చాలు సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. పెద్దవారే కాదు పిల్లలు కూడా శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ సీజన్లో గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ, న్యుమోనియా, కడుపు నొప్పి, తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్, చర్మ సమస్యలు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. అందువల్ల, మీ పిల్లలు సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉండాలంటే వారికి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం, ఒత్తిడిగి గురిచేయకుండా విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. అంతేకాక, మీ పిల్లలను అనారోగ్య పాలు చేసే ఈ 5 ఆహారాల నుండి సాధ్యమైనంత దూరంగా ఉంచండి.

ఉప్పు, జిడ్డుగల ఆహారాలు
జంతువుల నుండి ఉత్పత్తి చేసే వెన్న, ఒమేగా, కొవ్వు, నూనె శ్లేష్మం మొదలైనవి లాలాజలం గట్టిపడటానికి కారణమవుతాయి. అందువల్ల, శీతాకాలంలో జిడ్డుగల ఆహారాన్ని నివారించడం మంచిది. ఈ సీజన్‌లో చేసే వంటకాల్లో జంతు నూనెకు బదులుగా కూరగాయల నూనెను వాడటం ఉత్తమం.

చక్కెర ఉత్పత్తులు
శీతాకాలం లేదా వేసవి సీజన్లలో చక్కెరను ఎక్కువగా వాడటం మీ పిల్లలకు హానిచేస్తుంది. శరీరంలో ఎక్కువ చక్కెర ఉండటం వల్ల సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నుండి మనల్ని కాపాడే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. అందువల్ల, ఎక్కువ చక్కెర తీసుకోవడం మీ పిల్లలను వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. శీతాకాలంలో మీ పిల్లలకు సోడా, శీతల పానీయాలు, చక్కెర ఉత్పత్తులు, చాక్లెట్లు, బాగా శుద్ధి చేసిన అల్పాహారం, తృణధాన్యాలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వకండి.

హిస్టమిన్ అధికంగా ఉండే ఆహారాలు
హిస్టామిన్లో అధికంగా ఉండే మయోన్నైస్ రసాయనం, శరీరానికి అలెర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. కానీ, శీతాకాలంలో హిస్టామిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం అనేది శ్లేష్మం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది క్రమంగా గొంతు సమస్యలకు దారితీస్తుంది. హిస్టామిన్ ఎక్కువగా టమోటాలు, వంకాయ, పుట్టగొడుగుల వినెగార్, మజ్జిగ, పచ్చళ్లు, పులియబెట్టిన ఆహారాలు, కృత్రిమ ఆహారాల్లో లభిస్తుంది.

పాల ఉత్పత్తులు
అన్ని జంతు ప్రోటీన్లు లాలాజలం, శ్లేష్మం గట్టిపడటానికి కారణమవుతాయి. దీని వల్ల పిల్లల్లో ఆహారం మింగడం కష్టతరం అవుతుంది. అందువల్ల, మీ పిల్లలకు జున్ను, క్రీమ్, క్రీమ్ ఆధారిత సూప్‌లు వంటివి ఇవ్వడం మానుకోండి,

మాంసం ఉత్పత్తులు
మాంసంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇది శ్లేష్మం ఉత్పత్తిని ప్రోత్సహించి, గొంతులో చికాకు కలిగిస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసాలు, గుడ్డు తీసుకోవడం ద్వారా గొంతు సమస్యలు వస్తాయి. మీరు మీ పిల్లలకు మాంసం తినిపించాలనుకుంటే చేపలు, సేంద్రీయ మాంసం వైపు వెళ్ళండి.
Published by:Sumanth Kanukula
First published: