Home /News /life-style /

WILL THE UNBORN BABY BE HEALTHY IF PREGNANT WOMEN TAKE MILK EVERY DAY PRV

Pregnant: గర్భిణులు ప్రతిరోజూ పాలు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి మొదటిసారి గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలియదు. అంతకుముందలా ఏది పడితే అదే తింటారు(ate). వైద్యులు సూచించినా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చాలామంది పౌష్టికాహారం తీసుకోరు. అయితే చేయవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా వుంటారు.

ఇంకా చదవండి ...
    గర్భిణుల (pregnant)ను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. అయితే చాలామందికి మొదటిసారి గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలియదు. అంతకుముందలా ఏది పడితే అదే తింటారు(ate). వైద్యులు సూచించినా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చాలామంది పౌష్టికాహారం తీసుకోరు. అయితే చేయవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలు ఆరోగ్యం(healthy)గా ఉంటేనే పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా వుంటారు. ఇక గర్భిణులు ఖచ్చితంగా ఈ ఆహార పదార్థాలు(food items) తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల వారికి పుట్టే పిల్లలు చాలా పుష్టిగా ఆరోగ్యంగా వుంటారు. గర్భిణీలు ఖచ్చితంగా రోజుకి ఐదారు మీల్స్(meals) తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్, లంచ్, ఈవెనింగ్ స్నాక్, డిన్నర్ ఇలా రాత్రి నిద్రకి ముందు ఇలా తీసుకోవాలి. ప్రతి ఆహారం బ్యాలెన్స్డ్‌గా(balanced food) ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు గర్భిణులు పాలు తీసుకుంటే బెటర్​ అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గర్భిణులకు ఎలాంటి ఆహారం బాగుంటుందనేది ఒకసారి చూద్దాం..

    రక్త ప్రసరణకు..

    పాలు(milk) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్స్ ఉంటాయి. పాలు తాగడం వల్ల ఫీటస్ కి బ్లడ్ సప్లై (రక్త ప్రసరణ) పెరుగుతుంది. కాబట్టి గర్భిణీలు పాలు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో సోయా మిల్క్(milk) తాగడం కూడా చక్కటి ప్రయోజనాలను(benefits) ఇస్తుంది. ఎనీమియా సమస్య రాకుండా ఇది చూసుకుంటుంది. మూడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. షుగర్ లెవల్స్(sugar levels) ని కంట్రోల్ చేస్తుంది.

    ఆవుపాలు, గేదె పాలు నచ్చని వాళ్ళు సోయా మిల్క్ తీసుకుంటే మంచిది. ఇలా గర్భిణీలు వీటిని తీసుకుంటే ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. పైగా ఆరోగ్యం కూడా మరింత బాగుంటుంది. పుట్టబోయే బిడ్డకూ ఆరోగ్యం. బట్టర్ మిల్క్ లో విటమిన్ b12, ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. మీల్ కి మీల్ కి మధ్యలో బట్టర్ మిల్క్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

    నిమ్మతో వాంతులు రావు..

    నిమ్మ(lemon)లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఫీటల్ ఇమ్యూనిటీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్ అయ్యిపోకుండా చూసుకుంటుంది. అలానే వికారం, వాంతులు వంటివి రాకుండా చూసుకుంటుంది. కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్ కి గురై పోకుండా చూసుకుంటాయి. అదే విధంగా మెటబాలిజమ్ ఇంప్రూవ్ కి బాగా ఉపయోగపడతాయి. తక్షణ శక్తిని కూడా ఇవి ఇస్తాయి.

    ప్రోటీన్స్​ తప్పనిసరి..

    ధాన్యాలు, చపాతీ ఇంకా రైస్ తో పాటు పరాథా అలాగే మిల్లెట్ దోసె, బజ్రా దోసె ఇంకా దాలియా, పోహా, ఉప్మా తీసుకోవాలి.ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఖచ్చితంగా డైట్‌లో తీసుకుంటూ ఉండాలి. బోన్ డెన్సిటీ ఇంకా మజిల్స్‌కి ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. ఇంకా అదే విధంగా బీన్స్, గుడ్లు, పల్లీలు వంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకోని తినాలి. అలాగే వాటితో పాటుగా నట్స్ వంటివి కూడా తింటూ ఉండాలి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Health Tips, MILK, Pregnant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు