హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Tea side Effects: చాయ్ తాగడం వల్ల బరువు పెరుగుతారా ? ఈ వాదనలో నిజం ఉందా ?

Tea side Effects: చాయ్ తాగడం వల్ల బరువు పెరుగుతారా ? ఈ వాదనలో నిజం ఉందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Drinking Tea: టీ తాగడం మానేయాలా..? దీని వల్ల సమస్యలు వస్తాయా..? అలాంటప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో టెన్షన్లలకు కొదవేలేదు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, చదువుల భారం ఇలా ఏదో ఒక విధంగా మనుషులపై ఒత్తిడి అధికమే. ఈ ఒత్తిడిని తగ్గించుకునే దిశలో చాలామంది వేడివేడిగా ఏదో ఒకటి తాగుతారు. కాఫీ, టీ(Tea).. తినాలనుకుంటే ఏదో ఒకటి తింటారా.. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే.. చాయ్ కాస్త తలనొప్పిన తగ్గిస్తుందని.. ఇక్కడివరకు ఒకే.. సరదాగా అలా స్నేహితులతో కలిసి వెళ్లినా ఓ చాయ్ లాగించే జనాలు కోకొల్లలు. ఇపుడు టీ గురించి అంతలా చెప్పడం ఎందుకంటారా, ఈ చాయ్ల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్స్ట్(Side Effects) కూడా ఉన్నాయంట. చాయ్‌ తయారీ కోసం ఉపయోగించే టీ పౌడర్‌లో నికోటిన్‌, కెఫిన్‌(Caffine) వంటి పదార్థాలు ఉంటాయి. ఇవే ఇపుడు ప్రమాదానికి కారణాలు అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం..

నిజానికి టీలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల లావైపోతారు కూడా. అయితే టీ తాగకపోతే రిలాక్స్‌గా ఉండలేరు. అలానే ఒకసారి టీ కి బాగా అలవాటు అయిపోతే సమయానుసారం టీ పడకపోతే ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరిగి పోవడం లాంటి సమస్యలు వస్తాయి

టీ తాగడం మానేయాలా..? దీని వల్ల సమస్యలు వస్తాయా..? అలాంటప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఈరోజు టీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. దానితో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే బరువు కూడా పెరిగిపోకుండా ఉంటారు.

క్యాలరీలను తగ్గించుకోవడానికి ఫ్యాట్ మిల్క్ కాకుండా చూసుకోండి. ఎక్కువ కొవ్వు ఉండే పాలని ఉపయోగించడం వల్ల లావై పోతారు. మీరు కావాలంటే ఓట్స్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ లేదా సోయా మిల్క్ వాడొచ్చు. అదే విధంగా క్రీమ్ ఉండే పాలకు దూరంగా ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గుతాయి. పైగా బరువు పెరిగి పోకుండా ఉండటానికి కూడా అవుతుంది.

BeetRoot: రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా ?.. జాగ్రత్త.. ఈ రకమైన అనారోగ్యం రావొచ్చు..

Vegetables: కూరగాయలు పండ్లు తక్కువగా తింటున్నారా ? స్ట్రోక్ వచ్చే ప్రమాదం.. కారణం ఇదే

టీ ని మానలేక పోతున్నారా... అయితే దానిలో ఉండే చక్కెర శాతాన్ని తగ్గించండి. వీలైతే పూర్తిగా చక్కెరను తగ్గించడం కూడా మంచిదే కొద్దిగా చక్కెరను తగ్గిస్తే కేలరీలు కూడా తగ్గుతాయి. అదే విధంగా లావై పోకుండా ఉండటానికి అవుతుంది. కావాలి అనుకుంటే మీరు చక్కెరని తగ్గించి అందులో బెల్లం కాని తేనె కానీ వేసుకోండి. ఇలా చేయడం వల్ల తియ్యదనం వస్తుంది. అలాగే చక్కెర వల్ల కలిగే నష్టాల నుండి కూడా మీరు దూరంగా ఉండొచ్చు.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

First published:

Tags: Tea

ఉత్తమ కథలు