Home /News /life-style /

Sleep tips: దిండు కింద ఇనుప వస్తువులు పెట్టుకుని పడుకుంటే నిద్ర ప్రశాంతంగా పడుతుందంటారు.. నిజమేనా?

Sleep tips: దిండు కింద ఇనుప వస్తువులు పెట్టుకుని పడుకుంటే నిద్ర ప్రశాంతంగా పడుతుందంటారు.. నిజమేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను (Things) తల కింద పెట్టుకోవడం వల్ల అంతగా నిద్ర వస్తుందని చెబుతుంటారు. అంతేకాకుండా సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు అధిగమించడానికి కూడా సహాయపడుతుందట.

కరోనా (Corona) ప్రతి ఒక్కరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. శారీరక శ్రమ లేక నిద్ర (sleep) పట్టక ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి ఉద్యోగాలు ఉంటాయో ఉండవో.. భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న అనుమానం మానసిక సమస్యలను తెచ్చి పెడుతుంది. చాలా మంది జీవన విధానం (life style) వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. అనేక అనారోగ్యాల వల్ల నిద్ర సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల సమస్యలు వస్తుంటాయి. మానసిక  ప్రశాంతత కూడా లభించదు. దీనివల్ల ఉదయం లేవగానే ఏ పని చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతుంటారు. ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే దిండు కింద ఇనుప వస్తువులు పెడితే చాలామంది నిద్ర పడుతుందంటారు.. దాని గురించి తెలుసుకుందాం..

శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..

రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి జ్యోతిష శాస్త్రం తో పాటు.. వాస్తు శాస్త్రం కూడా దానికి కొన్ని సూచనలు ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తున్నారు. నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను (Things) తల కింద పెట్టుకోవడం వల్ల అంతగా నిద్ర వస్తుందని చెబుతుంటారు. అంతేకాకుండా సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు అధిగమించడానికి కూడా సహాయపడుతుందట.

భయం పోతుందని..

పిల్లలు నిద్ర పోయేటప్పుడు కొంతమంది భయపడుతూ (fear) ఉంటారు. నిద్రలేచి ఏడుస్తూ కూర్చుంటారు. అలాంటి సమయంలో పిల్లల దిండు (pillow) కింద కత్తెర లేదా ఏదైనా ఇనుప వస్తువును పెట్టాలట. ఇలా చేయడం వల్ల మూల ప్రతికూల శక్తి (opposite energy) పిల్లల వద్దకు రాకుండా ఉంటుందట. ఫలితంగా హాయిగా నిద్ర (happy sleep) పోతారట. పిల్లలు మాత్రమే కాదు పెద్దవారు కూడా నిద్ర పోయేటప్పుడు చెడు ఆలోచనలు వచ్చినా, చెడు కలలు వచ్చినా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దిండు కింద ఇనుప వస్తువులు (iron things) పెట్టడం వల్ల నిద్ర ప్రశాంతంగా వస్తుందట.

ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?



రాహు దోషాన్ని అధిగమించవచ్చు..

లేదా నిద్రపోయేటప్పుడు కొన్ని సోంపు గింజలను తీసుకొని దిండు (pillow) కింద పెట్టుకోవడం వల్ల రాహు దోషాన్ని అధిగమించవచ్చు. పీడకలలు, మానసిక సమస్యలు రాకుండా సోంపు గింజలు కాపాడుతాయట. అలాగే యాలకులను పెట్టుకోవడం వల్ల కూడా నిద్ర పడుతుందని పెద్ద వాళ్లు చెబుతారు.

ఇంట్లో తలగడ (pillow) కవర్లు మార్చితే సరిపోదని, తలగడలను కూడా మార్చాలి. మీ ఇంట్లో తలగడల(దిండు)ను కనీసం రెండేళ్లకు ఒకసారైన మార్చాలి. ఎందుకంటే అందులో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. దుమ్ము-దూళి, చివరికి మన చెమట వల్ల పురుగులు కూడా పెరుగుతాయి. అది మన ఆరోగ్యాన్ని (Health) దెబ్బతీస్తుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..




ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Happy days, Health benefits, Life Style, Sleep tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు