HOME »NEWS »LIFESTYLE »will bird flu effect us if we eat chicken who clarifies about common man doubts ba gh

Bird Flu: చికెన్ తింటే బర్డ్ ఫ్లూ సోకుతుందా?... మీ మైండ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో

Bird Flu: చికెన్ తింటే బర్డ్ ఫ్లూ సోకుతుందా?... మీ మైండ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో
ప్రతీకాత్మక చిత్రం

చికెన్ వండే క్రమంలో దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం , వెల్లుల్లి వంటి అనేక సుగంధ ద్రవ్యాలను వాడుతుంటారు భారతీయులు. వీటి ద్వారా చికెన్లోని వైరస్ నశిస్తుంది. ఎందుకంటే, అల్లం యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

  • Share this:
ఒకవైపు కరోనా (corona) మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంటే.. మరోవైపు బర్డ్‌ఫ్లూ కొత్తగా విజృంభిస్తోంది. బర్డ్‌ఫ్లూ విజృంభన గురించి తెలిసినప్పటి నుంచి ప్రజలు గుడ్లు, చికెన్ (Chicken) తినాలంటేనే బయపడుతున్నారు. అయితే, నిజంగానే చికెన్, గుడ్లు (Eggs) తింటే బర్డ్ ఫ్లూ (Bird Flu) వస్తుందా? అనే విషయంపై ముంబైలోని యానిమల్ అండ్ బర్డ్ హాస్పిటల్, ముంబై సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (BSPCA) ఇన్ఛార్జి డాక్టర్ మయూర్ దంగర్మాట్లాడుతూ.. “చికెన్ తింటే బర్డ్‌ఫ్లూ వస్తుందన్న వార్తల్లో నిజం లేదు. అధిక వేడి మీద చికెన్ను ఉడికించడం ద్వారా అందులోని వైరస్‌ నశిస్తుంది. బర్డ్ ఫ్లూకు కారణమయ్యే ఏవియన్ ఇన్ఫ్లూఎంజా వైరస్ (H5N1)ను చంపడానికి 70 డిగ్రీల సెల్సియస్ వేడి వద్ద మాంసాన్ని వండటం మంచిది.’’ అని డాక్టర్ దంగర్ అభిప్రాయపడ్డారు. అయితే, పౌల్ట్రీ (Poultry) నిర్వాహకులు మాత్రం కోళ్ల పెంపకంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.

బర్డ్‌ఫ్లూ నియంత్రణపైపై డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలు..


బర్డ్‌ఫ్లూ H5N1 అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది కోళ్లు, బాతులు (Ducks) వంటి పక్షి జాతుల్లో ఒక దాని నుంచి మరోదానికి వేగంగా విస్తరిస్తుంది. అయితే, పక్షి నుంచి అంత త్వరగా మనుషులకు చేరే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. బర్డ్ఫ్లూ వ్యాధి నియంత్రణపై డబ్ల్యూహెచ్‌ఓ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. బాగా వండిన చికెన్, గుడ్లు ద్వారా బర్డ్‌ఫ్లూ సోకదని, ఇది కేవలం సగం వండిన గుడ్ల ద్వారానే బర్డ్‌ఫ్లూ సోకే ప్రమాదం ఉందని పేర్కొంది. చికెన్, బాతులు, పెద్దబాతులను 70 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ వేడి వద్ద ఉడికించాలని, పౌల్ట్రీలో వ్యాప్తి చెందుతున్న బర్డ్‌ఫ్లూ వైరస్‌ను చంపడానికి ఇది సురక్షితమైన చర్య అని స్పష్టం చేసింది. అంతేకాక, ఇది ప్రధానంగా H5N1 వైరస్ సోకిన పక్షులకు సమీపంలో ఎక్కువ సేపు గడిపిన మనుషులకు సోకుతుందని పేర్కొంది. ముఖ్యంగా పౌల్ట్రీలో పనిచేసే వారికి ఈ వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని, ఈ వైరస్ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.

70 డిగ్రీల వద్ద ఉడికించి తింటే ప్రమాదం లేదు..
చికెన్ వండే క్రమంలో దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం , వెల్లుల్లి వంటి అనేక సుగంధ ద్రవ్యాలను వాడుతుంటారు భారతీయులు. వీటి ద్వారా చికెన్లోని వైరస్ నశిస్తుంది. ఎందుకంటే, అల్లం యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ దినుసులు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా , ఆర్‌ఎస్‌వి, ఫెలైన్ కాలిసివైరస్ లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. వీటితో పాటు భారతీయ వంటకాల్లో విరివిగా వాడే కొత్తిమీర, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగం వంటి సుగంధ ద్రవ్యాలు కూడా అనేక రోగాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. రోజువారీ భారతీయ ఆహారంలో భాగమయ్యే ఈ సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో గొప్పగా పనిచేస్తాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 15, 2021, 18:24 IST