Health : పర్పుల్ ఆలూ... తింటే మేలు

Health Benefits of Purple Potato : మనలో చాలా మందికి తెలుపురంగు బంగాళా దుంపలే తెలుసు. ఫ్రైలు, స్నాక్స్‌లో కూడా వాటినే వాడుతున్నా్రు. మరి పర్పుల్ కలర్ దుంపల సంగతేంటి? వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 27, 2020, 4:34 AM IST
Health : పర్పుల్ ఆలూ... తింటే మేలు
Health : పర్పుల్ ఆలూ... తింటే మేలు
  • Share this:
Health Benefits of Purple Potato : మనం కూరగాయల మార్కెట్‌కి వెళ్తే... తప్పనిసరిగా కొనుక్కునేవాటిలో బంగాళాదుంపలు దాదాపు ఉంటాయి. నాల్రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి... చాలా మంది వీటిని కొనుక్కుంటారు. ఐతే... దాదాపు 90 శాతం మందికి పర్పుల్ కలర్ ఆలూ గురించి తెలియదు. ఎందుకంటే మన రెగ్యులర్ మార్కెట్లలో ఈ కలర్ బంగాళాదుంపలు కనిపించవు. ఇవి సొలానమ్ ట్యూబెరోసమ్ (Solanum tuberosum) జాతికి చెందిన దుంపలు. ఎక్కువగా దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో కనిపిస్తాయి. ఇవి మామూలు దుంపల కంటే ఎక్కువ ఆరోగ్యకరమైనవి. ఎక్కువ పోషకాలు వీటిలో ఉంటాయి. తెల్ల దుంపల్లో పిండి పదార్థం ఎక్కువ. పర్పుల్ ఆలూలో అది తక్కువ. తెల్ల దుంపలు ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. పర్పుల్ దుంపలతో ఆ సమస్య ఉండదు. వీటిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫ్యాట్, మాంగనీస్, కాపర్, ఐరన్, పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C ఉంటాయి. లక్కేంటంటే... అరటిపండ్లలో కంటే... దుంపల్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. అలాగే సోడియం తక్కువగానే ఉంటుంది. పర్పుల్ ఆలూ దుంప మొక్కల్ని గార్డెన్‌లో మనమూ పెంచుకోవచ్చు. ఈ విత్తనాలు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. అంతేకాదు... పర్పుల్ ఆలూతో చేసిన చిప్స్ కూడా ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. మరి పర్బుల్ ఆలూతో ఆరోగ్య ప్రయోజనాలేంటో చకచకా తెలుసుకుందాం.

BP and blood sugar control : హైబీపీ ఉండేవారికి ఈ దుంపలు మేలు చేస్తాయి. ఇవి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. వీటిలో విటమిన్స్ కూడా ప్రయోజనం కలిగిస్తాయి.

High antioxidants : పర్పుల్ ఆలూ తింటే... మన శరీరంలోకి వచ్చే విష వ్యర్థాలను, వైరస్‌లను రాకుండా అడ్డుకుంటాయి. వీటిలోని యాంథోసియానిన్ అనే యాంటీఆక్సిడెంట్... మన కళ్లు, గుండెకు మేలు చేస్తుంది. రకరకాల రోగాలు రాకుండా ఈ దుంపలు కాపాడతాయి.

Good for digestion : వీటిలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. పొట్ట, పేగుల్లో ఉండే ఇన్ఫెక్షన్లకు ఈ దుంపలు చెక్ పెడతాయి. చర్మానికి కూడా ఇవి మేలు చేస్తాయి.

Stops the growth of cancer cells : ప్రపంచంలో భయంకర వ్యాధిగా ఉన్న కాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో పర్పుల్ దుంపలు బాగా ఉపయోగపడతాయి. వీటిలోని కొన్ని కాంపౌండ్లు... కాన్సర్ పెరిగే పరిస్థితులు నెమ్మదించేలా చేస్తాయి. కాన్సర్ ఉన్నవారు ఈ దుంపలు రెగ్యులర్‌గా తింటే... కాన్సర్ కణాల్లో చురుకుదనం తగ్గిపోతుంది.
First published: June 27, 2020, 4:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading