news18-telugu
Updated: June 22, 2020, 4:43 AM IST
ఫ్రతీకాత్మకచిత్రం
Health Tips of Sugar : గార్డెన్లో చక్కెర చల్లడమేంటి?... కామెడీయా అని అనుకోకండి. సీరియస్సే. షుగర్ అనేది స్వీట్నెస్ కోసమే కాదు. మన గార్డెన్ లను సేఫ్‌గా ఉంచుకోవడానికి కూడా చక్కెర ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలా ఫుడ్ ఐటెమ్స్‌లో షుగర్ వాడటం కామనైపోతోంది. స్వీట్లతో సంబంధం లేని ఆహారాలకు కూడా షుగర్ వాడుతున్నాం. చిత్రమేంటంటే... సూపర్ మార్కెట్లలో మనం కొనే చాలా వస్తువుల్లో షుగర్ ఉంటుంది. ఆ విషయం మనకు తెలియదు. ఎందుకంటే... ఆ వస్తువుల్లో ఏయే పదార్థాలు కలిపారో మనం లేబుల్‌పై చదివేందుకు ఆసక్తి చూపించం. చక్కెర ఎక్కువగా తింటే ప్రమాదమే. ఐతే, ఇదే చక్కెరతో చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
మీ గార్డెన్లో లేదా మీ ఇంటి చుట్టూ ఉన్న మట్టిలో చక్కెర కలిపి చూడండి. అది కచ్చితంగా మీకు మేలు జరిగేలా చేస్తుంది. ఎందుకంటే... షుగర్ అనేది ఎనర్జీ డ్రింక్ లాంటిది. దీన్ని గార్డెన్లో చల్లడం వల్ల మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. చక్కెర మట్టిలో కలిసి... బ్యాక్టీరియాకు చక్కటి పోషకాల్ని అందిస్తుంది. అలాగే... మట్టికి కూడా అది ప్రయోజనాలు కలిగిస్తుంది.
మన గార్డెన్లో చాలా మొక్కలు చనిపోతుంటాయి. వాటి వేర్లు అక్కడే ఉండి కుళ్లిపోతాయి. ఆ ప్రదేశంలో... నెమాటోడ్ (Nematode) అనే క్రిములు పెరుగుతాయి. వాటిని అరికట్టాలన్నా, పెరగకుండా చెయ్యాలన్నా షుగర్ మట్టిలో కలపాలి.
ఇంతకీ ఎంత మట్టిలో ఎంత చక్కెర కలపాలి (పొయ్యాలి) అన్నది తేలాల్సిన అంశం. ప్రతీ 250 చదరపు అడుగుల మట్టిలో... 2లీటర్ల 250 గ్రాముల చక్కెర పొయ్యాలి. తర్వాత ఆ చక్కెర మట్టిలో కలిసిపోయేందుకు... ప్రతీ అరకప్పు చక్కెరకూ... 3న్నర లీటర్ల నీటిని గార్డెన్‌పై చల్లాలి. లేదంటే... ఎంత చక్కెర పొయ్యాలో నిర్ణయించుకున్నాక... అందుకు కావాల్సినంత నీటిని రెడీ చేసి... ఆ నీటిలో చక్కెరను కలిపెయ్యాలి. ఇప్పుడా నీటిని గార్డెన్లో పిచికారీ చెయ్యాలి. గార్డెన్లో మొక్కలు ఉన్నా... ఇలా చెయ్యవచ్చు. మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులు ఆ నీటిని తాగి... మొక్కలకు కావాల్సినంత సేంద్రియ ఎరువును అందిస్తాయి. అదే సమయంలో... నెమాటోడ్లకు మాత్రం చక్కెర నీరు ఇబ్బందిగా మారుతుంది.
చెరకు నుంచీ చక్కెరను ఉత్పత్తి చేసేటప్పుడు మొలాసెస్ అనే బైప్రొడక్ట్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రొడక్ట్ మీ దగ్గర ఉంటే... కప్పు మొలాసెస్ని 2లీటర్ల 250 గ్రాముల నీటిలో కలపాలి. దీన్ని కుళ్లిపోయిన, చనిపోయిన మొక్కల దగ్గర పొయ్యాలి. ఇలా చేస్తే... 7 నుంచీ 14 రోజుల్లో అక్కడ కొత్త మొక్కలు వస్తాయి. తద్వారా గార్డెన్ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంటుంది.
Pics : అందాల బ్యూటీ అశ్రితా శెట్టి క్యూట్ పిక్స్
ఇవి కూడా చదవండి :
Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు
Health Tips : రాత్రి త్వరగా భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Health Tips : రేగుపండ్లు తింటున్నారా... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
Health Tips : ఎర్ర బియ్యంతో ప్రయోజనాలు... తెలిస్తే అవే తింటారు
Published by:
Krishna Kumar N
First published:
June 22, 2020, 4:39 AM IST