Home /News /life-style /

WHY WE CELEBRATE SHAHEED DIVAS ON JANUARY 30 EVERY YEAR RNK

Martyrs' Day 2022: ఈరోజు షహీద్ దివాస్‌ను ఎందుకు పాటిస్తారో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mahatma Gandhi Death Anniversary: 1948లో ఈ రోజున ఢిల్లీలోని బిర్లా హౌస్ ప్రాంగణంలో గాంధీజీని నాథూరామ్ గాడ్సే హత్య చేశాడు.

Mahatma Gandhi Death Anniversary: అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివస్ (Shaheed divas)  జనవరి 30న నిర్వహిస్తారు. ఈ రోజు మహాత్మా గాంధీ (Mahatma gandhi) వర్ధంతిని సూచిస్తుంది. 1948లో ఈ రోజున, బిర్లా హౌస్ కాంపౌండ్‌లో గాంధీ ప్రార్థన సమావేశాలలో ఉన్నప్పుడు.. నాథూరామ్ గాడ్సే (Nathuram godse) అతడిని హత్య చేశాడు. హిందూ మహాసభ సభ్యుడు గాడ్సే, 1947లో భారతదేశ విభజన సమయంలో ముస్లిం సమాజానికి అనుకూలంగా వ్యవహరించినందుకు గాంధీని నిందించాడు. అతను గాంధీ ఛాతీ ,పొత్తికడుపుపై ​​మూడుసార్లు గన్ తో కాల్చాడు. గాంధీ చివరిగా పలికిన మాటలు “హే రామ్” అని చెబుతారు. అప్పటి నుంచి గాంధీ వర్ధంతి రోజుకు గుర్తుగా షహీద్ దివాస్ను నిర్వహిస్తారు.

“నాలో ధైర్యవంతుల అహింస ఉందా? నా మరణమే అది చూపిస్తుంది. ఎవరైనా నన్ను చంపితే నేను దేవుడిని ప్రార్థిస్తూ మరణించినట్లయితే, నా హృదయ గర్భగుడిలో దేవుని స్మరణ ,అతని సజీవ సన్నిధి గురించి స్పృహ కలిగి ఉంటే, అప్పుడు మాత్రమే నేను ధైర్యవంతమైన అహింసను కలిగి ఉన్నానని అంటాను. ఈ మాటలు గాంధీ హత్యకు కొన్ని రోజుల ముందు చెప్పారు.

 ఇది కూడా చదవండి: 2022 ఏడాదికి ప్రకాశవంతమైన కలర్ 'వెరీ పెర్రీ బ్లూ'.. అదేంటో తెలుసా?


(“Have I that non-violence of the brave in me? My death alone will show that. If someone killed me and I died with prayer for the assassin on my lips, and God’s remembrance and consciousness of His living presence in the sanctuary of my heart, then alone would I be said to have had the non-violence of the brave,” )

 ఇది కూడా చదవండి:  మీలో ఈ లక్షణాలు ఉంటే.. మీరే ది బెస్ట్ భాగస్వామి..!


గాంధీజీ న్యాయవాది, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త ,జాతీయవాది, గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరు. సత్యం , అహింస అతని రెండు ముఖ్యమైన మార్గదర్శక సూత్రాలు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం అతను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధాలు. అతను మైనారిటీ హక్కుల కోసం కూడా పోరాడాడు. మత సామరస్యాన్ని నిర్మించడానికి ,బలోపేతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు, ముఖ్యంగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య. అతని అసమానమైన సహకారం కోసం, అతను జాతిపితగా పరిగణించారు. ఆయనను బాపు అని కూడా ముద్దుగా స్మరించుకుంటారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Mahatma Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు