హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dual Flush: టాయిలెట్ల‌లో డ‌బుల్ ఫ్ల‌ష్ ఎందుకో తెలుసా.. వాటి ఉపయోగాలు తెలుసుకోండి..

Dual Flush: టాయిలెట్ల‌లో డ‌బుల్ ఫ్ల‌ష్ ఎందుకో తెలుసా.. వాటి ఉపయోగాలు తెలుసుకోండి..

ప్రతాకాత్మక చిత్రం

ప్రతాకాత్మక చిత్రం

Dual Flush: ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా.. ఎక్కడ చూసినా.. మోడ్రన్ టాయిలెట్స్ కనిపిస్తున్నాయి. అయితే అందులోకి మనం వెళ్లినప్పడు చాలామందికొన్ని విషయాలను గమనిస్తూ ఉంటారు. టాయిలెట్లలోని కొన్ని ఫ్లష్‌లకు రెండు బటన్లు ఉంటాయి. వాటిలో ఒకటి చిన్నదిగా, మరొకటి పెద్దదిగా ఉంటుంది. అవి ఎందుకు అలా ఉంటాయి.. వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా.. ఎక్కడ చూసినా.. మోడ్రన్ టాయిలెట్స్(Toilets) కనిపిస్తున్నాయి. అయితే అందులోకి మనం వెళ్లినప్పడు చాలామందికొన్ని విషయాలను గమనిస్తూ ఉంటారు. టాయిలెట్లలోని కొన్ని ఫ్లష్‌(Flush)లకు రెండు బటన్లు(Buttons) ఉంటాయి. వాటిలో ఒకటి చిన్నదిగా, మరొకటి పెద్దదిగా ఉంటుంది. దాన్ని అలా డిజైన్(Design) చేసి ఉంటారని మీరు భావిస్తే పొరపాటే. వాటిని స్టైల్(Style) కోసం మాత్రం డిజైన్ చేయలేదు. ఎందుకంటే.. ఆ రెండు ఫ్లష్ బటన్ల ఏర్పాటు వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.. సాధారణ టాయిలెట్లలో లివర్ ఫ్లష్ లేదా బటన్ ఫ్లష్‌లు ఉంటున్నాయి. తాజాగా వస్తున్న టాయిలెట్లలో డబుల్ ఫ్లష్‌లు ఉంటున్నాయి.

Weight loss Tip: లావు తగ్గాలని అనుకుంటున్నారా.. ఈ ఒక్క చిట్కా పాటించండి.. మూడు నెలల పాటు ఈ టీని తాగితే..


వీటిలో ఒకే బటన్‌కు రెండు ఫ్లష్‌లు కలిసి ఉంటాయి. లివర్ టైప్‌లో హాప్ ఫ్లష్, ఫుల్ ఫ్లష్‌లు ఉంటాయి. ఇవన్నీ ఎగ్జిట్ వాల్వ్‌కు కనెక్ట్ చేసి ఉంటాయి. అయితే, వీటి పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. నీటిని పొదుపు చేసే ఉద్దేశ్యంతో ఈ రెండు బ‌టన్ల విధానాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా పాత కాలం టాయిలెట్లలో ఒక బటన్ మాత్రమే ఉంటుంది. ప్రస్తుత కాలంలో వస్తున్న టాయిలెట్లలో మాత్రమే డబుల్ ఫ్లష్ బటన్ ఆప్షన్ ఉంటుంది. వీటిలో రెండు బటన్ ల ఉపయోగం కూడా వేరుగా ఉంటుంది. వీటి పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. జీలకర్రను ఇలా ఉపయోగించండి..


ఈ డ్యుయ‌ల్ ఫ్ల‌ష్ కాన్సెప్ట్‌ను 1976లో డిజైన్ ది రియ‌ల్ వ‌రల్డ్ అనే పుస్త‌కంలో అమెరిక‌న్ ఇండస్ట్రియ‌ల్ డిజైన‌ర్ విక్ట‌ర్ పాప‌నెక్‌ ప్ర‌తిపాదించాడు. కానీ ఈ విధానాన్ని 1980లో ఆస్ట్రేలియాలో అమ‌లు చేశారు. డ‌బుల్ ఫ్ల‌ష్‌లో ఉండే పెద్ద బ‌ట‌న్ నొక్కితే ఆరు నుంచి తొమ్మ‌ది లీట‌ర్ల వ‌రకు నీళ్లు టాయిలెట్‌లోకి వెళ్తాయి. అదే చిన్న బ‌ట‌న్ నొక్కితే మూడు నుంచి 4.5 లీట‌ర్ల నీళ్లు విడుద‌ల అవుతాయి.

అయితే ఈ రెండూ ఎప్పుడూ ఉపయోగించాలి అంటే మూత్ర విసర్జన చేసినప్పుడు చిన్న బటన్.. మలవిసర్జన చేసినప్పుడు పెద్ద బటన్ ఉపయోగిస్తే నీరు ఎక్కువగా వృధా కాకుండా ఉంటుందనె కారణంతోనే డిజైన్ తెరమీదికి తెచ్చారు. సింగిల్ ఫ్ల‌ష్ బ‌దులు టాయిలెట్ల‌లో డ‌బుల్ ఫ్ల‌ష్ ట్యాంక్‌ల‌ను వాడ‌టం వ‌ల్ల ఏటా 20 వేల లీట‌ర్ల ఆదా అవుతుంద‌ని అంచ‌నా.

Saffron Flower Benefits: గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ తెల్లగా పుడతాడా..! ఉపయోగాలేంటి..


అందుకే ఖ‌ర్చు కాస్త ఎక్కువైనా స‌రే టాయిలెట్ల‌లో డ‌బుల్ ఫ్ల‌ష్ వాడ‌టం మంచిద‌ని ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు సూచిస్తున్నారు. అయితే ఇలా సింగిల్ ఫ్లష్ కంటే డ్యూయల్ ఫ్లష్ కాస్త ధర ఎక్కువే. అయితే, డ్యూయల్ ఫ్లష్ వల్ల మీ వాటర్ బిల్లు ఆదా అవుతుంది. కాబట్టి.. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫ్లష్ వాడండి.

ఇకపై టాయిలెట్‌కు వెళ్లేప్పుడు తగిన ఫ్లష్ ప్రెస్ చేయండి. ఫ్లష్ లు ఉన్నాయి కదా అని రెండు మాత్రం నొక్కేయకండి.. నీటిని పొదుపుగా వాడి పర్యావరణ పరిరక్షణలో మనం కూడా భాస్వాములం అవుదాం. వాటిని డిజైన్ చేయడంలో కూడా ఉన్నా రహస్యం కూడా అదే. చాలామందికి ఇది తెలియక రెండు బటన్లు నొక్కుతారు. ఇక నుంచి అలా చేయకండి.

First published:

Tags: DOUBLE MASK, Health, Health benefits

ఉత్తమ కథలు