Health Tips : నిలబడి నీరు తాగితే కిడ్నీ సమస్యలు వస్తాయట..

Health Tips | నీరు ఆరోగ్యానికి చాలామంచిది. రెగ్యులర్‌గా నీటిని తాగాలని చెబుతారు. అయితే తాగేవిధానంలోనూ జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఆరోగ్యానికి మంచి చేసే నీటి వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు.

Amala Ravula | news18-telugu
Updated: June 19, 2019, 11:19 AM IST
Health Tips : నిలబడి నీరు తాగితే కిడ్నీ సమస్యలు వస్తాయట..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 19, 2019, 11:19 AM IST
పరుగెత్తి పాలు తాగే బదులు.. నిల్చుని నీరు తాగడం మంచిది అంటారు. కానీ, ఇప్పుడు నిలబడి నీరు తాగడం మంచిది కాదు అని పరిశోధనలు చెబుతున్నాయి. నీటిని ఖచ్చితంగా కూర్చుని తాగాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకుంటే నిలబడి తాగిన నీరు ఒక్కసారిగా ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. దీంతో.. అజీర్తి, అసిడిటీ ఇతర సమస్యలు వస్తాయి. అదేవిధంగా.. కిడ్నీలకు నీరు అందదు కూడా. ఇది మూత్రాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీస్తాయి.

ముఖ్యంగా నిలబడి నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ద్రవాల సమతుల్యత దెబ్బతిని, కీళ్ళల్లో ఎక్కువ ద్రవాలు చేరి ఆర్థరైటీస్, కీళ్ళవాతం వంటి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా నీటిని నిలబడి తాగొద్దని సూచిస్తున్నారు నిపుణులు. ప్రశాంతంగా కూర్చుని తాగాలని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

తాగుడు మానేయాలంటే.. ఈ వీడియో చూడండి..



First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...