పీరియడ్స్ (periods). ఇవి వచ్చినపుడు మహిళల్లో మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు ఉంటాయి. కొంతమందికి శరీరం అలసిపోయినట్లుగా ఉండే.. మరికొంతమందికి పొట్ట ఉబ్బరం, క్రాంప్స్, బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు, వికారం వంటివన్నీ ఉంటాయి. అమ్మాయిలకు (girls) ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అమ్మాయి పిరియడ్స్‌ని ఎంతగా ఇష్టపడదో.. అవి ఆలస్యమైతే వాటికోసం అంతే వేచి చూస్తుంది. కొన్నిసార్లు పీరియడ్స్ మిస్ (miss) అవ్వడం లేదా ఆలస్యమవ్వడం (late) ఆడవారికి ఎంతో బాధను కలిగిస్తుంది. పీరియడ్స్ రావడం కంటే అవి ఎప్పుడొస్తాయో అని వేచి చూడడం చాలామంది అమ్మాయిలకు నచ్చని విషయం.
పీరియడ్స్ (periods) కోసం వేచి చూస్తున్న సమయంలో ఒత్తిడి (stress), మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అందుకే పీరియడ్స్ కోసం వేచిచూడకుండా అవి వచ్చేలా కొన్ని చిట్కాలు (tips) పాటిస్తే సరి.. పీరియడ్స్ వచ్చేలా (regularize) చేయడానికి చిట్కాలు పాటించే ముందు.. అసలు పీరియడ్స్ ఎందుకు ఆలస్యమవుతాయో తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఐస్ క్రీం తినండి..
సాధారణంగా ఒక దగ్గర ఉన్న అమ్మాయిల పీరియడ్స్ ఒకేసారి అవుతుంటాయి. దీనికి పీరియడ్ సింకింగ్ అని పేరు. ఒకే దగ్గర ఉన్న అమ్మాయిల హార్మోన్లు (Harmons) ఒకే రకంగా స్పందించడం వల్ల ఇది జరుగుతుందట. ఒకవేళ పీరియడ్స్ ఆలస్యమైతే ఇప్పటికే రుతుస్రావం అవుతున్న .. మీ స్నేహితుల తో కలిసి ఎక్కువ సమయం గడిపేందుకు (spend time with friends) ప్రయత్నించండి. దీనివల్ల మీక్కూడా పీరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రయత్నిస్తే ఇదే మీ ఫేవరెట్ చిట్కా అనక మానరేమో.. ఎందుకంటే పీరియడ్స్‌ని సరైన సమయానికి తీసుకొచ్చేందుకు ఒక రోజంతా మిగిలిన పనులన్నింటినీ రద్దు చేసుకొని.. ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా ఐస్ క్రీం (eat ice creams) తినేయండి.
కొత్తిమీరతో..
మన రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిడి వల్ల పీరియడ్స్ ఆలస్యమవుతుంటాయి. అదే మీరు పూర్తిగా రిలాక్స్ (relax) అయితే అవి వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తిమీర (Coriander)లోని ఎమ్మనగాగ్స్ మన శరీరంలోని రక్త ప్రసరణను కంట్రోల్ చేస్తాయి. ఇవి కటి వలయ భాగానికి రక్త సరఫరా పెంచడం వల్ల.. పీరియడ్స్ అనుకున్న సమయానికి వచ్చే వీలుంటుంది. దీనికోసం కొత్తిమీరను కూరల్లో వేసుకోవడంతో పాటు.. దానిని ముక్కలుగా కట్ చేసి వేడినీటిలో వేసి.. ఈ నీటిని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?
ఎందుకు ఆలస్యం అవుతుంది?
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి (why late) ఒత్తిడి, తక్కువ బరువు ఉండటం, అధిక బరువు, బర్త్ కంట్రోల్ పిల్స్ వంటివి కారణమవుతాయి. ఇందులో మీకు ఏ సమస్య ఉందో తెలుసుకుంటే చాలు.. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇందులో మీకు ఏదైనా సమస్య ఉందని తెలిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. అయితే ఈలోపు మీ పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచింది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
ఇది కూడా చదవండి:
గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health problem, Health Tips, Minor girl, Women