ఆధునిక యుగంలో కల్తీ రాజ్యం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారం(food)లోనూ ఇది మామూలైపోయింది. అయితే కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు(problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి(stomach pain) కారణం అవ్వవచ్చు. అయితే చాలామంది కడుపు నొప్పిగా ఉన్నపుడు అరటి పండు(banana) తినకూడదంటారు.. ఇది ఎంత వరకు నిజం.. అలాగే కడుపు నొప్పిగా ఉంటే ఏం తింటే బాగుంటుందో తెలుసుకుందాం..
ఇంతకీ నొప్పికి కారణం..
కడుపు నొప్పి ఎలా వస్తుందంటే.. ఆహారంలో డయటరీ ఫైబర్ లేకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, డీహైడ్రేషన్, పాలు ఇంకా పాల పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం, మెడిసిన్స్ వాడడం, అసలు ఎలాంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, మల విసర్జన చేయవలసి వచ్చినప్పుడు ఆపుకోవడం, ఒత్తిడి వంటి కారణాల ద్వారా మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్యని ట్రీట్ చేయకపోతే అది క్రానిక్ కాన్స్టిపేషన్ గా మారుతుంది. అందు వల్ల గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడం, స్టమక్ బ్లోట్ అవ్వడం, కడుపు నొప్పి వస్తాయి. చాలా మంది కడుపులో నొప్పి ఉన్నప్పుడు అరటి పండ్లు(banana) తినడం మంచిది కాదు అని భావిస్తారు. నిజానికి అది అపోహ మాత్రమేనట. అరటిపండు తినడం(eat) వల్ల కడుపునొప్పి(stomach pain) నుంచి ఉపశమనం కలుగుతుందట. ఇందులో ఉండే యాంటాసిడ్ వల్ల అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.
ఆహారం కంటే ముందే..
లెమోనేడ్ లేదా నిమ్మరసం(lemon juice) తీసుకోవడం మన ఇంట్లో సాధారణంగా జరిగే విషయం. కడపు నొప్పి ఉన్నా.. లేదా చాలా గ్యాప్ తరువాత ఆహారం(food) తీసుకుంటున్నా దాని కన్నా ముందు నిమ్మరసం తాగడం చేస్తుంటారు. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. అల్లం, బెల్లం కలిపి తీసుకుని కొడుపులో నొప్పి(pain) తగ్గించుకునే వారిని మనం చూసుంటాం. ఇలా చేయడానికి కారణం.. అల్లంలో ఉండే యాంటీ ఇంఫ్లామేటరీ తత్వాల వల్ల ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
కడుపు నొప్పి సమస్యలు ఎక్కువగా రాకూడదంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. దాలియా, రెడ్ రైస్ పోహా, రాజ్‌గిరా, పప్పులు వంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం, ఆకుకూరలు, బొప్పాయి పండు, పియర్ వంటి పీచు పదార్ధం ఎక్కువ ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఉదర సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు కేవలం కొన్ని మాత్రలు మాత్రమే తీసుకుంటే సరిపోదు. కొన్ని సార్లు అసలు టాబ్లెట్స్ అందుబాటులో ఉండవు. ఇలాంటి సమయంలో మీరు కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banana, Health Tips, Stomach Pain