‘మొహరం’ పండగ కాదు... అమరవీరుల త్యాగాలను స్మరించడం

ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ దాన్ని ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడవలసి వచ్చింది.

news18-telugu
Updated: September 10, 2019, 9:06 AM IST
‘మొహరం’ పండగ కాదు... అమరవీరుల త్యాగాలను స్మరించడం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముస్లింలు పాల్గొని అమరవీరులకు హల్బిదా, హల్బిదా అంటూ గుండెలు బాదుకొని రక్తం చిందించే రోజు 'మొహరం' రానే వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో హైద్రాబాద్, మచిలీపట్నంలో రెండు ప్రాంతాల్లో మాత్రమే మోహరం సందర్బంగా చెస్ట్ బీటింగ్ నిర్వహించేవారు. బ్రిటిష్ కాలంకంటే ముందు నుంచి హైదరాబాద్, మచిలీపట్నంకు వాణిజ్య పరమైన సత్సంబంధాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది. మోహరం..పండుగ దినాలు కాదు. అమరవీరుల త్యాగాన్ని స్మరించడమే అంటూ మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఇనుగుదురుపేటలో మోహరం 9 వ రోజు పీర్లను ఉరేగిస్తూ "చెస్ట్ బీటింగ్" నిర్వహించారు.10 వరోజు మోహరం సందర్బంగా రక్తం చిందిస్తూ చెస్ట్ బీటింగ్ నిర్వహిస్తారు.

మొహరం ఎందుకు చేస్తారు ?

1400 ఏళ్ల క్రితం హిజ్రీశకం 60 లో జరిగిన యదార్ధ ఘటనకు ప్రతి రూపం. మహనీయులు మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ నుండి దైవవాణి గ్రహించి దానిని దివ్యఖురానుగా గ్రంథస్తం చేశారు. ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అడుగు జాడల్లో విస్తరించింది. ఈ నేపధ్యంలో అప్పటి ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ దాన్ని ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడవలసి వచ్చింది. ఇహ లోకం కంటే పరలోకమే మేలని ప్రాణత్యాగానికైనా సిద్ధమని నిలబడ్డారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఇస్లాం సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని అని యాజిద్ బలవంతం చేసాడు.

జాలీ, కరుణ, కనికరం లేకుండా అత్యంత హేయంగా ఇమామ్ హుస్సేన్ కుటుంబసభ్యులను శత్రు సైన్యం ఇరాక్ లోని అప్పటి కార్బాల యుద్ధ మైదానంలో హతమార్చారు. 2 ఏళ్ల చిన్నారిని సైతం వదలకుండా క్రూరంగా అంతమొందించారు.మొహారం నెల 10 వరోజు హాజరత్ ఇమాం హుసైన్ సైతం వీర మరణం పొందారు. ఈ త్యాగనిరతికి ప్రపంచం ఆశ్చర్య పోయింది. ఇస్లాం అంటే ప్రాణాలు, కుటుంబం బలిదానం అని, మహత్తరమైనదని తేలిపోయింది.దింతో ఇస్లాం అంటే శాంతి అని ఆ మత ఆచారాలను, వాస్తవాలను తెలుసుకోవాలని ప్రపంచమంతా జిజ్ఞాశా కలిగింది. ఇస్లాం వేగంగా విస్తరించింది.ఇస్లాం పునర్జీవానికి ప్రాణం పోసిన ఆ అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహారం. అందుకే 'మోహరం' పండుగ కాదు... మహ్మద్ ప్రవక్త కుటుంబం చేసిన త్యాగాల్ని స్మరించడం.
Published by: Sulthana Begum Shaik
First published: September 10, 2019, 8:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading