Marriage Age of Women: మహిళల వివాహ వయస్సు పెంచడం ఇందుకోసమే.. మోదీ ప్రతిపాదన వెనుక లాభాలివే..

మహిళల వివాహ వయస్సును చట్టబద్ధంగా పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదన అపారమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను కలిగిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది.

news18-telugu
Updated: October 27, 2020, 10:50 AM IST
Marriage Age of Women: మహిళల వివాహ వయస్సు పెంచడం ఇందుకోసమే.. మోదీ ప్రతిపాదన వెనుక లాభాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహిళల వివాహ వయస్సును చట్టబద్ధంగా పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదన అపారమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను కలిగిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. ఆడవారి వివాహ వయస్సు కనిష్ఠ పరిమితి పెంచడం వల్ల సామాజిక, ఆర్థిక లాభాలను కలిగిస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ గురువారం ఖాతాదారులకు ఓ రిపోర్ట్ లో పేర్కొన్నారు. "మహిళల వివాహం వయస్సు చట్టబద్ధంగా పెండమనేది ఆర్థిక, సామాజికంగా వారిని శక్తిమంతం చేసే ఓ ప్రధాన వ్యూహం. ప్రసూతి మరణాలను తగ్గించడం, పోషకాహార స్థాయిలను సమీప కాలంలో మెరుగుపరచడం లాంటి ప్రయోజనాలు లెక్కిస్తుంది. దీర్ఘకాలికంగా వారిలో మరింత ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు కృషిచేస్తుంది" అని నివేదిక చెబుతోంది. మహిళలకు ఉన్నత విద్య, వృత్తి విద్యను అభ్యసించడానికి, ఆర్థిక సాధికారత కోసం సమాజంలో సమతుల్యతను నివేదిస్తుంది.

ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘేష్ నివేదిక ప్రకారం రాష్ట్రాలవారీగా పనిచేసే వారి సంఖ్యం పెరగడం వల్ల వివాహ వయస్సు కూడా పెరిగింది.  ఈ ఏడాది జూన్ లో రాజకీయ నాయకులు జయ జైట్లీ ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సు 18 ఏళ్ల నుంచి మార్చవచ్చు అని సిఫార్సు చేసింది.  ఘోష్ ప్రకారం గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన మహిళల సంఖ్య ప్రస్తుతం 9.8 శాతం నుంచి 7 శాతం పాయింట్లు ఉంది. "భారత్ లో 35 శాతం మంది స్త్రీలు 21 ఏళ్లకు ముందే వివాహం చేసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. పశ్చిమ బెంగాల్ పరిస్థితి అన్ని రాష్ట్రాల కంటే దారుణంగా ఉంది.

సగటున వివాహ వయస్సు అక్కడ 20.9 సంవత్సరాలు ఉండగా.. 47 శాతం ఆడవారు 21 ఏళ్లకు ముందే వివాహం చేసుకుంటున్నారు. బిహార్, రాజస్థాన్ కంటే బంగాల్ వెనుకంజలో ఉండటం గమనార్హం" అని నివేదిక పేర్కొంది. "ఈ చర్య ఇతర చట్టపరమైన, మానసిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది" అని ఘోష్ అన్నారు. ప్రజల మనస్తత్వం మారినప్పుడు మాత్రమే క్షేత్రస్థాయిలో ఏదైనా మార్పు జరుగుతుందని, వివాహం కోసం చట్టబద్దమైన వయస్సును పెంచడం చట్టబద్ధంగా కూడా తప్పనిసరి అని ఘోష్ చెబుతున్నారు. అదే వయస్సు గల పురుషుల కంటే మహిళలు ఎక్కువ పరిణతి చెందినవారని, అందువల్ల త్వరగా వివాహం చేసుకోవడానికి అనుమతించవచ్చని మూస మనస్తత్వం నుండి బయటపడాలని అన్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 27, 2020, 10:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading