#HealthTips: నిద్రలేకపోతే ఎంత నష్టమో తెలుసా?

సరైన నిద్రలేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయని తెలిసిందే.. తాజాగా కోపం కూడా పెరుగుతుందని తేలింది.

Amala Ravula | news18-telugu
Updated: February 8, 2019, 8:50 PM IST
#HealthTips: నిద్రలేకపోతే ఎంత నష్టమో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 8, 2019, 8:50 PM IST
నిద్ర అనేది ప్రతి ప్రాణికి ఎంతో ముఖ్యం. గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం. ఎన్నో పనులతో అలసిన శరీరానికి నిద్ర తిరిగి నూతనోత్సాహం ఇస్తుంది.
అయితే, నేడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల కారణంగా మనిషి నిద్రకు దూరమవుతున్నాడు. ఈ కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అలసట, ఏకగ్రత లేకపోవడం, మతిమరుపు, ఊబకాయం ఎదురవుతున్నాయి. అంతేకాదు, ఎదుటివారిపై విపరీతమైన కోపం వస్తుందట.
సాధారణంగా నిద్రలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. సాధ్యమైనంతవరకూ సరిపడా నిద్రపోవాలని.. అయితే అది కూడా సహజసిద్ధంగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి.. ఏవేవో కారణాలు చెప్పి నిద్రని అలసత్వం చేయకండి..

First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు