Korean women slim secrets: కొరియన్‌ మహిళలు ఈ ఫుడ్‌ వల్లే.. స్లిమ్‌గా ఉంటారు!

ప్రతీకాత్మక చిత్రం

Korean women diet secret: ఈ కొరియన్‌ మహిళల ఫిట్నెస్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉత్సుకత, ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఈ అందం కోసం వారు ఏ ఆహారం తీసుకుంటారు. బరువు పెరగకుండా వారు ఏం చెస్తారు అనే సమాచారం మనం తెలుసుకుందాం.

  • Share this:
కొరియన్‌లో ఫిట్‌గా లేని వ్యక్తులు కనిపించడం చాలా అరుదు. టీనెజర్స్ (Teenagers) , మధ్య వయస్కులు లేదా 60–70 ఏళ్ల వృద్ధులు ప్రతి ఒక్కరూ అందమైన శరీరాకృతిని కలిగి ఉన్నవారే. భారత్‌లో కొరియన్‌ సినిమాలు (Korean movies) మ్యూజిక్‌ వీడియోలు, టెలివిజన్‌ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందాయి. ఇక చాలా ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండే మహిళల విషయానికి వస్తే.. వారి అందం, ఆరోగ్యకరమైన శరీర రహస్యం ఏంటో అని మనం ఆశ్చర్యపడకుండా ఉండలేం.

సమతుల్య ఆహారం..
కొరియన్‌ ఫుడ్‌ (korean food)  ఇతర డైట్‌ మాదిరి ఉండదు. ఇందులో తగ్గించాల్సినవి ఏమి ఉండవు. ఎందుకంటే కొరియన్‌ డైట్‌ (korean diet)ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటుంది. కొరియన్‌ మహిళలు ప్రోటీన్‌ నుంచి పిండి పదార్థాలు, కొవ్వుల వరకు, ఆరోగ్యకరమైన కొరియన్‌ ఫుడ్‌ వరకు కానీ, సమతుల్య ఆహారానికి కట్టుబడి ఉంటారు. వారు తమ రోజువారీ జీవితంలో అతిగా తినడం, శారీరక శ్రమన వంటివి చేయరు.

ఇది కూడా చదవండి: కృత్రిమ ఐల్యాషస్‌ వాడితే.. కళ్లకు ఇంత డేంజరా..? 

కూరగాయలకు ప్రాధాన్యం..
మీకు ఎప్పుడైనా కొరియన్‌ ఫుడ్‌ తినే అవకాశం ఉంటే.. ముందుగా టేబుల్‌ మీద ఉన్న కూరగాయలను చూడండి. కొరియన్లు కూరగాయలను చాలా ఇష్టపడతారు. ఇదే వారి తీరైన ఆకృతి రహస్యం. కూరగాయల్లో ఫైబర్‌ ఎక్కువ, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడం సులభం. కూరగాయల్లో ఉండే ఫైబర్‌ సంతృప్తిని ఇస్తుంది. కేలరీలు అధికంగా ఉండే ఫుడ్‌కు దూరంగా ఉంటారు.

పులియబెట్టిన ఆహారం..
కొరియన్‌ మహిళలు (korean women) భోజనంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వంటకాలు తింటారు. ఇవి సాధారణంగా పులియబెట్టినవి. అలాంటి భోజనం పేగులకు మంచిది. జీర్ణక్రియకు సహాయపడతాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువును కూడా తగ్గిస్తాయి.

ఇది కూడా చదవండి:  పండగవేళ.. ఇంటిని తక్కువ టైంలోనే క్లీన్‌ చేసుకోవచ్చు!

ఇంటి ఫుడ్‌..
కొరియన్‌ మహిళలు ఫుడ్‌ ఎంచుకోవడం కూడా వారి ఫిట్‌ బాడీ వెనుక ఉన్న రహస్యాల్లో ఒకటి. మీకు బరువు తగ్గాలంటే.. ఇంట్లో తయారు చేసిన వంటకం కంటే మెరుగైన ఆహార మరోటి ఉండదని గుర్తుంచుకోవాలి. ప్రాసెస్‌ చేసిన ఆహారం, అనారోగ్యకరమైన ఆహారాలు, ఫాస్ట్‌ఫుడ్‌తో బరువు పెరగడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. వీళ్లు బయట తినడం కంటే.. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఇష్టపడతారు. తమ శరీరానికి ఏ ఫుడ్‌ ఉత్తమమో వారికి తెలుసు, తదనుగుణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకుంటారు.

సీఫుడ్‌ ఇష్టం..
కొరియాలో సీఫుడ్‌ చాలా ముఖ్యమైన ఆహారాల్లో ఒకటి. ఆరోగ్యానికి ఉత్తమమైన ఫ్యాట్‌ చేపలు తీసుకోవడం వల్ల మాత్రమే కాదు, వాటి సూప్‌ నుంచి సీవీడ్‌ ఉపయోగించే సాధారణ ఆహారాల్లో కూడా ఉంటుంది. సీవీడ్‌లో ఫైబర్‌ ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది.

యాక్టీవ్‌ లైఫ్‌స్టైల్‌..
చాలా మంది కొరియన్లకు నడక ఇష్టం. వారు నడవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. యాక్టీవ్‌ లైఫ్‌స్టైల్‌ చాలా మంది కొరియన్‌ మహిళల ఆరోగ్యకరమైన ఫిట్నెస్‌ రహస్యం. మనందరికి తెలిసినట్లుగా శారీరక శ్రమ శరీర బరువుతోపాటు ఆరోగ్యానికి ముఖ్యపాత్ర పోషిస్తుంది.
Published by:Renuka Godugu
First published: