WHY IS IT NOT GOOD TO RE HEAT TEA AND DRINK IT AND WHAT PROBLEMS WILL COMES UP PRV
Tea: చాయ్‌ని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే ఎందుకు మంచిది కాదు? వచ్చే సమస్యలేంటి?
ప్రతీకాత్మక చిత్రం
రెగ్యులర్‌గా టీలు తాగే వారు ఓ విషయం గుర్తుంచుకోవాలటండి. అదే తయారు చేసిన టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ మళ్లీ వేడి చేసిన టీలో పోషకాలు ఉండవు. ఇంతకీ అలా టీ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం..
చాయ్ (tea). చల్లటి వాతావరణంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చేది. అసలే వర్షాకాలం వానలు (rains) బాగా కురుస్తున్నాయి. వాతావరణం చల్లగా అయిపోయింది. మన శరీరం కూడా కూల్‌కూల్‌గా ఉంది. వేడివేడిగా ఏదైనా తాగాలనీ అనిపిస్తుంటుంది. అది సహజం. దానికోసం చాలా మంది చాయ్ (chai)ల వెంట పడుతారు. ఇక ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అక్కడ టీ (Tea)లు లేవాల్సిందే. అయితే రెగ్యులర్‌గా టీలు తాగే వారు ఓ విషయం గుర్తుంచుకోవాలటండి. అదే తయారు చేసిన టీని మళ్లీ మళ్లీ వేడి (Re heated) చేసుకుని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ మళ్లీ వేడి చేసిన టీలో పోషకాలు ఉండవు. ఇంతకీ అలా టీ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం..
కడుపు నొప్పి..
ఎప్పుడో తయారు చేసిన చాయ్ (tea)ని మళ్లీ మళ్లీ వేడి (Re heated) చేసి తాగడం వల్ల అల్సర్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు (health problems) వచ్చే అవకాశాలు ఉంటాయట. కడుపునొప్పి (stomach pain) సమస్యతో పాటు మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. చల్లారిన టీని తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చల్లారిన టీలో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ఏర్పడతాయి. ఆయుర్వేద టీ తాగేవాళ్లు కూడా వేడిగా (hot) ఉన్న సమయంలోనే తాగాలి.
వాసన కూడా..
పదేపదే టీని వేడి చేయడం వల్ల టీ రుచి (taste) మారిపోవడంతో పాటు టీ చెడు వాసన వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రోజులో ఎక్కువసార్లు టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులో ఎక్కువసార్లు టీ తాగేవాళ్లను ఇతర దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్లాస్టిక్ కవర్లు, కప్పుల్లో కూడా టీ తాగవద్దట.
ప్లాస్టిక్ లో ఉండే కెమికల్స్ వల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు (precautions) తీసుకోవాలి. టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది. పళ్లు తోముకోకుండా మీరు టీ తాగితే మీ నోటిలోని చెడు బ్యాక్టీరియాను పేగుల్లోకి వెళుతుంది. అది మీ గట్ లో ఇది మంచి బ్యాక్టీరియాతో కలసి మీ జీవక్రియకు భంగం కలిగిస్తుంది , కడుపు నొప్పి కలిగిస్తుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.