WHY HUMANS DONT HAVE HAIR ON PALM AND SOLE OF FEET PVN
Hair on palm : మన అరచేతిలో,అరికాలుపై వెంట్రుకలు ఎందుకు రావో తెలుసా
ప్రతీకాత్మక చిత్రం
అరచేతిలో, అరికాళ్లపై వెంట్రుకలు ఎందుకు ఉండవు అనేది శాస్త్రవేత్తలకు చాలా కాలంగా రహస్యంగా ఉంది. అయితే ఇది ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకు 2018లో జరిగిన పరిశోధనలో సమాధానం దొరికింది.
ధృవపు ఎలుగుబంటి లేదా కుందేలు వంటి అనేక జీవులు అరచేతిపై లేదా పాదాల దిగువ భాగంలో వెంట్రుకలు కలిగి ఉంటాయి. కానీ మనుషుల విషయంలో మాత్రం అలా ఉండదు. మనుషులకు అరచేయి(Palm), అరికాళ్ళపై వెంట్రుకలు(Hair) ఉండవు. మనుషులకు(Humans) ఈ రెండు ప్రదేశాలలో ఎందుకు వెంట్రుకలు పెరగవు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.
సైన్స్ అలర్ట్ వెబ్సైట్ రిపోర్ట్ ప్రకారం... అరచేతిలో, అరికాళ్లపై వెంట్రుకలు ఎందుకు ఉండవు అనేది శాస్త్రవేత్తలకు చాలా కాలంగా రహస్యంగా ఉంది. అయితే ఇది ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకు 2018లో జరిగిన పరిశోధనలో సమాధానం దొరికింది. ఎందుకు మానవులకు కొన్ని శరీర భాగాలపై వెంట్రుకలు ఉండవు అనే దానిపై పరిశోధనలో సమాధానం దొరికింది.
ప్రత్యేక ప్రోటీన్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది
మన శరీరంలో Wnt అని పిలువబడే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్(Protin) ఉంటుంది. ఇది వెంట్రుకల పెరుగుదల, ఖాళీ- కణాల మధ్య పెరుగుదల గురించి సమాచారాన్ని అందించే మాలిక్యులర్ మెసెంజర్‌గా పనిచేస్తుంది. ఈ ప్రొటీన్ ద్వారా వచ్చే సంకేతాలు జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. శరీరంలోని అరికాళ్లు, అరచేతులు వంటి వెంట్రుకలు పెరగని శరీర భాగాల్లో సహజంగానే ఇన్హిబిటర్లు ఉంటాయని, ఈ ప్రొటీన్ తన పనిని చేయకుండా అడ్డుకుంటుందని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా డెర్మటాలజిస్ట్ సారా మిల్లర్ తెలిపారు. ఈ నిరోధకాలు డిక్కోఫ్ 2(DKK2) అని పిలువబడే ఒక రకమైన ప్రోటీన్.
దీని వల్ల జుట్టు పెరగదు
ఎలుకలపై ఈ ప్రొటీన్ గురించి పరిశోధన చేసినప్పుడు షాకింగ్ ఫలితాలు వచ్చాయని సారా మిల్లర్ చెప్పారు. ఎలుకల నుండి DKK2 ప్రోటీన్ తొలగించబడినప్పుడు, జుట్టు రాని అరచేతిలో కూడా జుట్టు పెరగడం ప్రారంభమైంది. దీని తర్వాత కుందేళ్ళపై పరిశోధన చేసినప్పుడు, వాటిలో ఈ ప్రోటీన్ చాలా తక్కువగా ఉందని తేలింది. దాని కారణంగా వాటి చేతులు మరియు కాళ్ళపై ఎక్కువ వెంట్రుకలు పెరుగుతాయని తెలిపారు. ఈ ప్రోటీన్ల ఉనికి లేదా లేకపోవడం వెనుక కారణం ఏమిటో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. కాలక్రమేణా జీవుల పరిణామం కారణంగా.. ఈ ప్రోటీన్లు వాటిలో ఉన్నాయో లేదో శాస్త్రవేత్తలు చెప్పారు. ఉదాహరణకు ఒక ఎలుగుబంటి లేదా కుందేలు మంచు లేదా రాతి మార్గాల్లో నడవవలసి ఉంటుంది. దీనివల్ల వాటి చేతుల్లో, కాళ్లలో వెంట్రుకలు ఉన్నా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ మనుషుల్లో మాత్రం అలాంటిదేమీ ఉండదు. మనుషులకు చేతులు, కాళ్లపై వెంట్రుకలు ఉంటే వారు జీవించడం మరింత కష్టమవుతంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.