Health : పసుపు రంగు నెయ్యినే ఎందుకు వాడాలి... ఇవీ కారణాలు

Health : మన ఇళ్లలో చాలా మందికి నెయ్యిని బాగా కాల్చి వంటలు, స్వీట్లూ చెయ్యడం అలవాటు. అలా చెయ్యడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందాం.

news18-telugu
Updated: March 16, 2020, 2:43 PM IST
Health : పసుపు రంగు నెయ్యినే ఎందుకు వాడాలి... ఇవీ కారణాలు
పసుపు రంగు నెయ్యినే ఎందుకు వాడాలి... ఇవీ కారణాలు
  • Share this:
Health : నెయ్యిని చూస్తే చాలు నోరూరడం ఖాయం. ఆ వాసన తెగ నచ్చేస్తుంది చాలా మందికి. ఇక ఇళ్లలో పసుపు రంగు నెయ్యిని... బాణలిలో వేసి... అది ఎర్రగా మాడిపోతుంటే... అప్పటివరకూ దాన్ని కాల్చి... అప్పుడు మాత్రమే వంట మొదలుపెడతారు. నెయ్యి మాడే కొద్దీ సువాసన పెరుగుతూ ఉంటుంది. కానీ అలా మాడ్చిన నెయ్యిని వాడటం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనలో కొంత మంది నెయ్యి రోజూ వాడితే లావైపోతామని అంటుంటారు. కానీ కొద్ది మొత్తంలో నెయ్యి రోజూ వాడితే... నష్టాల కంటే లాభాలే ఎక్కువ. నెయ్యిలో... ఫ్యాట్‌తోపాటూ... విటమిన్ A, D, E, K కూడా ఉంటాయి. పైగా నెయ్యిలో వేడిని తగ్గించే యాంటీఆక్సిడెట్ గుణాలున్నాయి. ఇది జుట్టు, చర్మాన్ని... మృదువుగా ఉంచుతుంది. చక్కటి నిద్ర పట్టాలంటే నెయ్యి వాడాలి.

రోజూ ఎంత నెయ్యి తినవచ్చు అన్న డౌట్ మీకు ఉండే ఉంటుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి... ఒక్కో టీస్పూన్ చొప్పున (రోజూ 3 టీస్పూన్లు) వాడొచ్చు. గుండె సమస్యలు, హైబీపీ, మలబద్ధకం, కీళ్లనొప్పులు వంటివి ఉండేవారు ఇంకాస్త ఎక్కువ నెయ్యి వాడినా మంచిదే. పసుపు రంగులో ఉండే నెయ్యిలో అన్ని ఆరోగ్య గుణాలూ ఉంటాయి. నెయ్యిని ఎక్కువ సేపు మాడ్చితే... అందులో గుణాలు పోయి... ఫ్రై నెయ్యిలా మారిపోతుంది. అందువల్ల నెయ్యిని ఎక్కువగా వండకుండా... కాస్త పసుపు రంగు నుంచీ ఎరుపు ఎక్కక ముందే వాడేయాలంటున్నారు.

జుట్టు పొడిబారిపోతున్నట్లు... జీవం లేనట్లు అయిపోతుంటే... ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని జుట్టుకి పట్టించి... బాగా మసాజ్ చేసి... పావు గంట తర్వాత షాంపూతో స్నానం చేస్తే జుట్టు చక్కగా ఉంటుంది. గాలికి జుట్టు అలా ఎగురుతూ ఉంటే... చుట్టుపక్కల అందరూ ఆ జుట్టువైపే చూస్తుంటారు. చర్మ కణాలు, జుట్టు కుదుళ్లు చక్కగా ఉండేందుకు మెరుగయ్యేందుకు నెయ్యి బాగా ఉపయోగపడుతుంది.

First published: March 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు