హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Flight journey: ఫ్లైట్‌ జర్నీ చేసినప్పుడు.. ఫుడ్ ఎందుకు టేస్టీగా ఉండదో తెలుసా? ఇదే అసలు కారణం..

Flight journey: ఫ్లైట్‌ జర్నీ చేసినప్పుడు.. ఫుడ్ ఎందుకు టేస్టీగా ఉండదో తెలుసా? ఇదే అసలు కారణం..

Food taste in flight journey:  విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ టేస్ట్ భిన్నంగా ఉండటానికి హైట్ సాధారణ కారణం. దానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

Food taste in flight journey: విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ టేస్ట్ భిన్నంగా ఉండటానికి హైట్ సాధారణ కారణం. దానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

Food taste in flight journey: విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ టేస్ట్ భిన్నంగా ఉండటానికి హైట్ సాధారణ కారణం. దానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

    సాధారణంగా మీకు ఇష్టమైన వైట్ పాస్తా ఏదైనా రెస్టారెంట్ లో తిన్నది విమానంలో (Flight)  తిన్నప్పుడు రుచి వేరుగా ఉంటుంది. సూప్ విషయానికి వచ్చినా.. అంతే దీని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? విమానంలో మనం తినే ఆహారం చాలా అరుదైన రుచి (Food taste)  కలిగి ఉంటుంది. ఇవి చాలా చప్పగా ఉండటంలో కూడా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇలా జరగడానికి అసలు కారణం ఎత్తు. అవును ఇది ఆహార రుచిని ప్రభావితం చేస్తుంది. చాలా వరకు విమానాలు 33,000-42000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. అంత ఎత్తులో మన టేస్ట్ బడ్స్ విషయానికి వస్తే మన మెదడు కణాలు భిన్నంగా స్పందిస్తాయి. తద్వారా ఆహారం రుచిగా అనిపించదు. అయితే, విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ టేస్ట్ భిన్నంగా ఉండటానికి హైట్ సాధారణ కారణం. దానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

    ప్రెజర్..

    మీరు ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మీపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఇది రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే వాసన చూసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఫ్లైట్‌ గంటకు 800-900 కీమీ వేగంతో ప్రయాణిస్తాయి. మీరు కూడా అదే వేగంతో కదులుతారు. అది శరీరంపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఎక్కవు ప్రెజర్ మన ఇంద్రియాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో మన టేస్ట్ బడ్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఫ్లైట్‌లో ఆహారం రుచిగా ఉండకపోవడానికి మరో కారణం.

    ఇది కూడా చదవండి:  అలోవెరా, కొబ్బరి నూనె ఇలా వాడితే.. గార్జియస్ లుక్ మీ సొంతం..


    ఓవర్ సాల్ట్..

    ఇది ఆహారం రుచిగా ఉండకపోవడానికి పెద్ద కారణాల్లో ఒకటి. ఫ్లైట్‌లో ఫుడ్ తయారు చేసే చెఫ్ లు సాధారణంగానే ఫుడ్ లో ఉప్పును ఎక్కువ వేస్తారు. తద్వారా అది చక్కగా రుచిగా ఉంటుందని అలా చేస్తారు. అయితే, అది రివర్స్ ప్రభావం చూపుతుంది. అలాగే మీరు ఈ ఎక్కువ ఫుడ్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురవ్వచ్చు. ఇది మళ్లీ రుచిపై ప్రభావం చూపుతుంది.

    పెద్దమొత్తంలో..

    విమానంలో తయారు చేసే వంటలు పెద్ద మొత్తంలో వండుతారు. అంటే, ఒకేసారి వేల మందికి వండుతారు. అలా వండినప్పుడు రుచి విషయంలో రాజీ పడాల్సి ఉంటుందని మనందరికీ తెలుసు

    రీహీట్..

    ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం ఎక్కువ హైట్ లో ఉన్నప్పుడు ఫుడ్ వంటకూడదు. కాకపోతే, విమానంలోకి వచ్చే ముందే ఈ ఫుడ్ వండి, ప్యాక్ చేసి రీప్రిజిరేట్ చేస్తారు. మళ్లీ దీన్ని ఫ్లైట్‌లో ఓవెన్ లో రీహీట్ చేయాల్సి వస్తుంది. దానికి వేరే ఆప్షన్ లేదు. ఇలా చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు కోల్పోతుంది. కాబట్టి ఇది కూడా రుచిని ప్రభావితం చేస్తుంది. అందుకే విభిన్న రుచిని కలిగి ఉంటుంది.

    ఇది కూడా చదవండి: మీ హెయిర్ ఎక్స్‌టెన్షన్ ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే.. ఈ అద్భుతమైన టిప్స్ మీకోసమే..


    ఆకాశంలో ఉన్నప్పుడు క్యాబిన్లో పొడిగాలి ఉంటుంది. అంటే విమానంలో తేమ 12 శాతం కంటే తక్కువగా ఉంటుంది. ఇది కచ్ఛితంగా మన ముక్కును కూడా ప్రభావితం చేస్తుంది. మీరు వంట రుచి చూసే సమయానికి చప్పగా కనిపించవచ్చు.కార్నెల్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం తీపి పదార్థాలు విమానం వంటి ధ్వనించే వాతావరణంలో ప్రభావితమవుతాయి. స్ట్రాబెర్రీ, చీజ్ కేక్ కంటే కూరలు కాస్త బెటర్ రుచిని కలిగి ఉంటాయి.

    First published:

    Tags: Flight, Food