Sleep tips: నిద్ర తొందరగా ఎందుకు రాదు? పడుకున్న వెంటనే నిద్ర రావాలంటే ఏం చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్ర పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు. అలా నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం..

 • Share this:
  బిజీలైఫ్​ కారణంగా ఒత్తిడి (stress) అధికంగా ఉంటోంది. అందుకే నిద్ర (Sleep) కూడా సరిగా పోవడం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర (peaceful sleep) చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్​ ఎక్కినా తొందరగా నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. మరోవైపు ఉదయం కావొస్తుంది. మళ్లీ ఆఫీసులకు, పాఠశాలలకు , కాలేజీలకు పరుగులు తీయాలి. ఇక గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్ర పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు. అలా నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం..

  గంట ముందు నుంచే..

  నిద్రలేమి ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్నసమస్యల్లో ఇది అతి ముఖ్యమైనది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఆరోగ్యం మరింతగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. నిద్ర సరిగా పట్టడానికి (good sleep) కొన్ని నియమాలు పాటించాలి. ఇక నిద్రపోదాం అనేసుకుంటే నిద్ర రాదు. మీరు నిద్రపోవాలనుకున్న సమయానికి గంట ముందు నుంచీ (before one hour) మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ గంట మొదలయ్యేప్పుడే మీరు మీ ఫోన్ పక్కన పెట్టేయాలి. ఆదివారం, సోమవారంతో సంబంధం లేకుండా రోజూ ఒకే సమయానికి (follow same time) లేచే అలవాటు ఎంతో మేలు చేస్తుంది. ఇది అలవాటు అయిపోతే అసలు అలారమే అక్కరలేదు.

  పొద్దున్న నిద్ర లేవగానే కర్టెన్స్ ఓపెన్ చేసేసి, ఇంట్లో నుంచి బయటకి వచ్చి వెలుతురుని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. వెలుతురు అంటే మెలకువ అన్న విషయం మీ మెదడుకి అర్ధమవుతుంది. అలాగే, రాత్రి నిద్రకి ముందు నెమ్మదిగా ఇంట్లో లైట్స్ అన్నీ డిమ్ చేసుకుంటూ రండి. చీకటి (dark room) గా ఉందంటే నిద్ర పోవాలి అన్న విషయం మీ మెదడు అర్థం చేసుకుంటుంది. చివరగా అన్ని లైట్స్ ఆఫ్ (lights off) చేసి నిద్రపోండి.

  ఇవి కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

  రాత్రి బాత్రూమ్ కి వెళ్ళడానికి మీకు లైట్ (no light) అవసరం అనుకుంటే ఒక చిన్న బ్యాటరీ లైట్ మీ దగ్గర పెట్టుకోండి. మీ బెడ్ (prepare bed) ని చక్కని నిద్రకి అనువుగా తయారు చేసుకోండి. చల్లగా ఉండే బెడ్రూమ్ లో మెత్తని బెడ్ షీట్స్, మీకు సౌకర్యంగా ఉండే దిండు, బెడ్రూమ్ గోడలకి తేలికపాటి రంగులు, కుదిరితే నైట్‌స్టాండ్ మీద తాజా పూలు.. వంటివి మీరు బెడ్రూమ్ లోకి అడుగు పెట్టగానే ఆవలింతలు వచ్చేలా చేస్తాయి. బెడ్రూమ్ లో టీవీ చూడడం, చదువుకోవడం వంటి పనులు చేయకండి.

  రాత్రి పూట అందరం కొద్దిగా ఎక్కువే తింటాం. కబుర్లు చెప్పుకుంటూ పొద్దున విశేషాలు పంచుకుంటూ డిన్నర్ చేస్తారు చాలా మంది. ఇలా చేసినప్పుడు ఒక ముద్ద ఎక్కువే తింటాం, తప్పు లేదు. కానీ ఆ తరువాత మాత్రం ఇంకేం తినకూడదు.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)  ఇవి కూడా చదవండి:

  గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

  శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి

  Published by:Prabhakar Vaddi
  First published: