పవిత్రమైన శృంగారానికి మన పురాణాలు కూడా పెద్ద పీట వేశాయి. మన పెద్దలు పెళ్లి అయిన తర్వాత ముహూర్తం చూసి మరీ శోభనం జరిపించడం ఆనవాయితీ, అయితే సినిమాల్లో, తొలి రాత్రి వధువు పాల గ్లాసు పట్టుకొని గదిలోకి వెళుతుంది. అయితే ఆ పాలు వరుడి కోసం ఇచ్చిపంపుతారు. అయితే ఈ పాల గ్లాసు వెనక చాలా కారణాలు ఉన్నాయి. అసలు శోభనం రాత్రి పెళ్ళి కూతురు పాలగ్లాస్ తో పడక గదిలోకి ఎందుకు వెళుతుంది.? శోభనానికి పాల గ్లాస్ కు సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుందాం. అయితే ఈ ఆనవాయితీ ఒక్కోప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో తొలి రాత్రి పాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందులో కుంకుమ పువ్వు, పసుపు, చక్కెర, నల్ల మిరియాల పొడి, బాదం మరియు సోంపును కలుపుతారు. తరువాత పాలు బాగా మరగబెట్టి, తరువాత గోరువెచ్చగా, వరుడికి తాగడానికి ఇస్తారు. తీపి కోసం ఈ పాలలో చక్కెర, బదులుగా, ఇది సహజ స్వీటెనర్ను ఉపయోగిస్తారు సాధారణంగా. తొలిరాత్రి పాలలో తేనె, చక్కెర లేదా పొడి ద్రాక్ష కలుపుతారు. ఇది తీపి మరియు పోషకాలను కూడా పెంచుతుంది.
అయితే పాలలో సిరోటోనిన్ అనే మూలకం ఉంటుంది, ఇది మనస్సును శాంతపరుస్తుంది. వివాహంలో చాలా ఆచారాలు ముఖ్యంగా కొత్త సంబంధంలోకి ప్రవేశించే ముందు ఒత్తిడి ఉంటుంది. దీంతో వధూవరులు ఇద్దరూ పాలు తాగడం వారి మనసును శాంతపరుస్తుంది. పాలు తాగిన వారి శరీరం స్టిమ్యులేట్ అవుతుంది. అంటే వధువరులకు పాలు సత్వర శక్తిని ఇస్తాయ్. దీని కారణంగా వారి మొదటి రాత్రి శృంగారం సజావుగా, ఆనందంగా, సంతృప్తిగా సాగుతుందని సైన్స్ చెబుతుంది.
అలాగే పాలు ఎసిడిటీ ని తగ్గిస్తాయ్. ఇది కూడా ఒక కారణం. పాలలో కండరాలు బలపడటానికి సహాయపడే ప్రోటీన్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ పాలు తాగడం ద్వారా ఇద్దరి అలసట ముగుస్తుంది. అలాగే సాధారణంగా సెక్స్ చేసే సమయంలో ఆడ,మగ శరీరాలు కలిసినప్పుడు అధిక స్థాయిలో వేడి పుడుతుంది. శోభనం రాత్రి వధూవరుల కలయిక వల్ల వారి శరీరాల ఉష్టోగ్రతలు అమాంతం పెరిగిపోతోంది. పాలు ఆ వేడిని తగ్గిస్తాయి. పాలను తాగితే రక్తప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతనోత్తేజం వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sexual Wellness