Home /News /life-style /

Pregnancy pains: గర్భం దాల్చిన తర్వాత మహిళలకు నొప్పులు ఎందుకు వస్తాయి? కారణాలేంటి

Pregnancy pains: గర్భం దాల్చిన తర్వాత మహిళలకు నొప్పులు ఎందుకు వస్తాయి? కారణాలేంటి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ప్రపంచంలో అన్ని నొప్పుల(pains) కంటే బిడ్డకు జన్మను ఇచ్చే సమయంలో తల్లి పడే ప్రసవ నొప్పులు (pregnancy pains) తట్టుకోవడం ఒక్క మహిళకే సాధ్యం.  అయితే.. ప్రసవ సమయంలో నొప్పులు(pains) ఎక్కువగా ఎందుకు వస్తాయి? అస‌లు అంత ఎక్కువ‌గా నొప్పులు రావ‌డానికి కారణాలు (reasons) చాలా మందికి తెలియదు. ఆ విషయాలు ఇపుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
    చాలా మందిలో గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరైన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి అనిపించవచ్చ. దీనిని తేదీ తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రంలో చివరి రోజుకు రెండు వారాలు కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ (pregnancy) సమయం లెక్కించవచ్చ. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. వివాహమైన ప్రతి మహిళ (women) మాతృత్వం పొందాలని.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది. మహిళ గర్భం దాల్చిందనే వార్త తెలియగానే ఇళ్లల్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అయితే స్త్రీలు గర్భం దాల్చిన నాటి నుంచి మళ్లీ డెలివరీ (delivery) అయ్యేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అంటే మహిళలకు పునర్జన్మ లాంటిది. అలాగే ఈ ప్రపంచంలో అన్ని నొప్పుల(pains) కంటే బిడ్డకు జన్మను ఇచ్చే సమయంలో తల్లి పడే ప్రసవ నొప్పులు (pregnancy pains) తట్టుకోవడం ఒక్క మహిళకే సాధ్యం.  అయితే.. ప్రసవ సమయంలో నొప్పులు(pains) ఎక్కువగా ఎందుకు వస్తాయి? అస‌లు అంత ఎక్కువ‌గా నొప్పులు రావ‌డానికి కారణాలు (reasons) చాలా మందికి తెలియదు. ఆ విషయాలు ఇపుడు తెలుసుకుందాం..

    నిద్రించే సమయం..

    ఇక బిడ్డ అధిక బరువు(heavy weight)తో గానీ లావుగా ఉన్నప్పుడు ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా వ‌స్తుంటాయి. గర్భవతి అయిన సమయంలో మీరు పడుకునే విధానం, నిద్రించే సమయం (sleeping time) కూడా ప్రసవ సమయంలో నొప్పులపై ప్రభావం ఉంటుంద‌ట‌. అందుకే స‌రైన పోజీష‌న్‌లో ప‌డుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు మంచి నిద్ర, ఎక్కువ నిద్ర కూడా అవసరం.

    గర్భాశయ ద్వారం బలహీనం..

    బిడ్డకు జన్మను ఇచ్చే పవిత్రమైన గర్భాశయ ద్వారం బలహీనంగా (Weak) ఉండటం వలన ప్రసవ సమయంలో నొప్పులు(pains) ఎక్కువగా రావడానికి ఒక కారణం. బిడ్డ ప్రసవించే సమయానికి తల ముందుకు వస్తూ బయటకు రావడం జరుగుతుంది. ఐతే కొన్నిసార్లు తలపై భాగంలో ఉండి కాళ్ళు (legs) ముందుకు వస్తుంటాయి. అటువంటప్పుడు నొప్పులు(pains) ఎక్కువగా రావడం జరుగుతుంది.   అలాగే తీసుకునే ఆహారంలో పోషకాలు, పౌష్టిక ఆహారం సరిగ్గా లేకపోవడం, రక్త వృద్ధిని పెంచే ఆహారాలు లేకపోతే ప్రసవ సమయంలో నొప్పులు, రక్తహీనత రావడానికి కారణమవుతుంది.

    ఆహారం అవసరం..

    గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు(weight) పై ప్రభావం చూపుతుంది. గర్భవతికి 300 cal (కాలరీల శక్తిఅదనంగా 15 గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వు పదార్ధాలు అయిదు లేదా ఆరు నెలల గర్భధారణ నుంచి తిసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది. గర్భవతులు, బాలింతలు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అవసరం. గర్భస్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పు సమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువుతో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Birthday, Life Style, Pregnancy, Sleep, Weight gain

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు