హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Men’s Health: పురుషుల్లో ఇది గమనించారా..? ఆ సమస్యలున్నా నలుగురిలో మాట్లాడరు.. కారణం ఇదే..!

Men’s Health: పురుషుల్లో ఇది గమనించారా..? ఆ సమస్యలున్నా నలుగురిలో మాట్లాడరు.. కారణం ఇదే..!

పురుషుల మానసిక ఒత్తిళ్లను అందరితో పంచుకోలేరు.

పురుషుల మానసిక ఒత్తిళ్లను అందరితో పంచుకోలేరు.

సాధారణంగా మగవాళ్లు ఫైనాన్షియల్, వర్క్‌ రిలేటెడ్‌ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎదుర్కొంటారు. కుటుంబ అవసరాలను తీర్చాలని, ఆర్థిక పరంగా అన్ని అంశాలను నెరవేర్చాలనే భావన వారికి ఉంటుంది. అనుకున్న విధంగా పనులు జరిగే సూచనలు కనిపించని సమయంలో ఒత్తిడికి గురవుతారు. తమ మానసిక సమస్యలను ఇతరులతో చర్చించడానికి కూడా ఇష్టపడరు.

ఇంకా చదవండి ...

సమస్యలకు లింగభేదం ఉండదు. అయితే సమస్యలను ఎదుర్కొనే ధోరణి మాత్రం అందరిలో ఒకేలా ఉండదు. మన సమాజంలో ఆడవాళ్లు, మగవాళ్లకు వేర్వేరు రకాల సమస్యలు ఎదురవుతాయనే మైండ్ సెట్‌ ముందు నుంచి ఉంది. కారణాలు ఏవైనా సరే.. వివిధ రకాల సమస్యలు తమను ఇబ్బంది పెట్టలేవని చాలామంది మగవాళ్లు భావిస్తారు. ఈ క్రమంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. మొత్తానికి పురుషులు తమ మానసిక ఆరోగ్య సమస్యల గురించి తక్కువగా మాట్లాడతారు. సమాజంలో అవమానం, బలంగా ఉండాలనే ఇమేజ్‌ సహా అనేక కారణాల వల్ల ఇలా వ్యవహరిస్తుంటారు.

మగవాళ్లకు ఎదురయ్యే సాధారణ సమస్యలు

సాధారణంగా మగవాళ్లు ఫైనాన్షియల్, వర్క్‌ రిలేటెడ్‌ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎదుర్కొంటారు. కుటుంబ అవసరాలను తీర్చాలని, ఆర్థిక పరంగా అన్ని అంశాలను నెరవేర్చాలనే భావన వారికి ఉంటుంది. అనుకున్న విధంగా పనులు జరిగే సూచనలు కనిపించని సమయంలో ఒత్తిడికి గురవుతారు. తమ మానసిక సమస్యలను ఇతరులతో చర్చించడానికి కూడా ఇష్టపడరు. ఇలా తమలోనే ఆలోచనలు దాచుకోవడం సమస్య తీవ్రతను పెంచుతుంది. స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబంలో ఇష్టమైన వారితో ఆందోళనను పంచుకోవడానికి, మానసికంగా కుదుటపడటానికి పురుషులు ప్రయత్నించాలి. పురుషులు తమ మానసిక పరిస్థితి గురించి మాట్లాడటానికి ఎందుకు దూరంగా ఉంటారో కొన్ని కారణాలు తెలుసుకుందాం.

వర్క్‌ రిలేటెడ్‌ ప్రాబ్లమ్స్‌

మెన్స్ హెల్త్ ఫోరమ్ ప్రకారం.. ప్రతి సంవత్సరం 1,91,000 మంది పురుషులు వర్క్‌ కల్చర్‌ కారణంగా ఒత్తిడి, డిప్రెషన్ లేదా ఆందోళనకు గురవుతున్నారు. వారి వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేని పురుషులు మానసిక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు.

ఆర్థిక ఒత్తిడి

పురుషులలో మానసిక ఆరోగ్య సమస్యలకు అతిపెద్ద కారణాలలో ఒకటి ఆర్థిక ఒత్తిడి. ఒత్తిడి జీతానికి సంబంధించినది కావచ్చు, బిల్లులు చెల్లించడం, కుటుంబానికి వస్తువులను కొనడం, పిల్లలను విహారయాత్రకు తీసుకెళ్లడం లేదా ప్రాథమిక అవసరాలకు సరిపడా డబ్బు లేకపోవడం వంటివి కావచ్చు. పురుషులు సాధారణంగా తమ ఆర్థిక సమస్యల గురించి మాట్లాడరు, ఎందుకంటే వారు తమ కుటుంబాలకు బాధ్యత వహిస్తారు.

సమస్యలను పరిష్కరించుకోగలమని భావించడం

ఏదైనా సమస్యను ఒంటరిగానే ఎదుర్కోగలమని మగవాళ్లు భావిస్తారు. ఈ క్రమంలో స్వతంత్ర సలహా కోసం వెతకడం చాలా కీలకం. ఇది వారి సమస్యలను కొత్త కోణంలో చూడటానికి వారికి సహాయపడుతుంది. ఒక స్నేహితుడు, సహోద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు వంటి వారు విశ్వసించే వారితో మాట్లాడటం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మార్పుకు అవసరమైన సమయాన్ని తగ్గించవచ్చు.

First published:

Tags: Health, Health problem, Life Style, Mental Health

ఉత్తమ కథలు