Home /News /life-style /

వ్యాక్సినేషన్ కార్డ్ నిబద్ధతగా పాటించడానికి గల కారణాలు

వ్యాక్సినేషన్ కార్డ్ నిబద్ధతగా పాటించడానికి గల కారణాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వ్యాక్సిన్‌లు వేయించకపోతే, దాని వల్ల మీ చిన్నారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం పడవచ్చు. అందుకే చిన్నపిల్లల వైద్యులు, చిన్నారి ఆరోగ్యానికి పాస్‌పోర్ట్‌ వంటి వ్యాక్సినేషన్ కార్డ్ ఇస్తారు. వ్యాక్సినేషన్ కార్డ్ అంటే కేవలం అవి ఎప్పుడు వేయించాలి అనే క్రమం మాత్రమే కాకుండా, ఆ వ్యాక్సిన్లు ఇవ్వడం వెనుక ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్తాయి.

ఇంకా చదవండి ...
  వ్యాక్సినేషన్ కార్డ్, తమ పిల్లల వ్యాక్సినేషన్ సమయాలను చూసుకుంటూ, వాళ్ళకి కొన్ని సంవత్సరాల వరకు రోగ నిరోధక శక్తి అందేలా చూసుకోవడంలో తల్లిదండ్రులకు సహాయపడుతుంది.  ప్రస్తుత మహమ్మారి కారణంగా క్రమ పద్ధతిలో జరిగే ఆరోగ్య సంరక్షణ ప్రక్రియలు చాలా వరకు గతి తప్పాయి, ప్రత్యేకించి చిన్న పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో. ప్రతి శిశువుకు జననం నుండి అయిదు సంవత్సరాలు వచ్చేంత వరకు వారికి కోరింత దగ్గు, హెపాటైటిస్ ఎ, మెనిన్‌జైటిస్ మరియు పోలియో వంటి వ్యాధుల నుండి కాపాడే రోగ నిరోధక శక్తిని దశల వారీగా అందించే వివిధ వ్యాక్సిన్లు ఉంటాయి. శిశువుకు 1-2 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు తల్లిదండ్రలు వ్యాక్సిన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ, వారి వయస్సు పెరిగే కొద్దీ ఈ విషయంలో అలసత్వం పెరుగుతుంది. పిల్లలు పెరిగి పెద్ద వారు అవుతుంటే వారికి వ్యాధుల ప్రమాదం తప్పిపోయినట్లు కాదు అని తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాలి. 1 నుండి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు సూచించిన ముఖ్యమైన వ్యాక్సినేషన్‌లలో హెపటైటిస్-ఎ, పొంగు, ఎంఎంఆర్, మెనిన్‌జైటిస్ ACWY వ్యాక్సిన్, DTP-HIB-Hep B బూస్టర్, PCV బూస్టర్, యాన్యువల్ ఇన్‌ప్లూయెన్జా వ్యాక్సిన్ మొదలయినవి ఉంటాయి.

  వీటిలో ఏవైనా వ్యాక్సిన్‌లు వేయించకపోతే, దాని వల్ల మీ చిన్నారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం పడవచ్చు. అందుకే చిన్నపిల్లల వైద్యులు, చిన్నారి ఆరోగ్యానికి పాస్‌పోర్ట్‌ వంటి వ్యాక్సినేషన్ కార్డ్ ఇస్తారు. వ్యాక్సినేషన్ కార్డ్ అంటే కేవలం అవి ఎప్పుడు వేయించాలి అనే క్రమం మాత్రమే కాకుండా, ఆ వ్యాక్సిన్లు ఇవ్వడం వెనుక ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్తాయి. తల్లిదండ్రులు ఏవైనా వ్యాక్సినేషన్లు వేయించడం మరచిపోతే వాటిని చూసుకుని భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవడానకి ఇది ఒక గణన సూచనలా కూడా పనిచేస్తుంది.

  ప్రమాదకరంగా సంక్రమించే వ్యాధులతో ప్రపంచం అంతా వణికిపోతున్న సమయంలో వ్యాక్సినేషన్ కార్డ్‌లు మరింత ముఖ్యంగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో మీ చిన్నారి ఆరోగ్యం అలాగే వ్యాధినిరోధక శక్తి చరిత్రను తెలిపే అధికారిక రికార్డ్‌లా వ్యాక్సినేషన్ కార్డ్ ప్రాముఖ్యత రెట్టింపు అయ్యింది. మీరు స్కూల్‌లో చేర్పించేటప్పుడు, ప్రయాణ వీసాలు తీసుకునేటప్పుడు అది ఉపయోగకరమైన పత్రం అవుతుంది. దీని ద్వారా వైద్యులు చిన్నారి వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి ముఖ్యమైన విషయాలు అలాగే ఇంకా ఏ వ్యాక్సిన్లు వేయించాల్సి ఉంది అనేది తెలుసుకోగలుగుతారు.

  అన్నింటి కంటే ముఖ్యంగా, ప్రస్తుతం అత్యంత త్వరగా సోకే వ్యాధుల నుండి రక్షించడానికి ఒక చిన్నారికి అవసరమైన వ్యాక్సినేషన్ల గురించి అవగాహన పెంపొందించడంలో వ్యాక్సినేషన్ కార్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాక్సినేషన్ల విషయంలో చేసే ఏ చిన్న అలసత్వమైనా రోగ నిరోధక శక్తిని తగ్గించి భారీ ప్రమాదంగా పరిణమించగలదని తెలుసుకుని, తమ చిన్నారికి కీలకమైన వయస్సులో క్రమ తప్పకుండా వ్యాక్సిన్లు వేయించడంలో తల్లిదండ్రులకు ప్రోత్సాహంగా పని చేస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు వ్యాక్సినేషన్ కార్డ్ వంటి ప్రామాణిక మార్గదర్శకాలను ఉపయోగిస్తున్నప్పటికీ, తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ రిమైండర్లుగా పని చేసే డిజిటల్ అప్లికేషన్లు కూడా ఉన్నాయి. అలాంటి యాప్‌లలో ఒకటి Indian Academy of Paediatrics అందిస్తున్న Immunize India యాప్. తల్లిదండ్రులు తమ చిన్నారి వ్యాక్సినేషన్ కార్డ్ అలాగే రికార్డ్‌లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకునే అవకాశం ఇచ్చే ఇతర ప్లాట్‌ఫామ్‌లు అనేకం ఉన్నాయి.

  పైన చెప్పిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, వ్యాక్సినేషన్ కార్డ్‌ను అనుసరించడం, చిన్న పిల్లల వైద్యులు సూచించిన క్రమాన్ని పాటించడం అనేది తల్లిదండ్రుల తప్పకుండా చేయాలి. మీ చిన్నారికి ఏ వ్యాక్సినేషన్ వేయించాలి ఎప్పుడు అనే విషయంలో సంపూర్ణమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ వ్యాక్సినేషన్ క్రమాన్ని మీ చిన్నారి వైద్యునితో సంప్రదించి మరింత శక్తివంతమైన విధంగా మలచుకోవచ్చు. ఆ విధంగా వ్యాక్సినేషన్ కార్డ్ క్రమం తప్పకుండా పాటించడం వలన మీ చిన్నారి కీలకమైన వయస్సులో రోగ నిరోధక శక్తికి అలాగే మీ చిన్నారి రక్షణకు సరైన పునాదిని వేస్తుంది.

  భాద్యత పరిమితుల ప్రకటన: సామాజిక స్పృహ కోసం GlaxoSmithKline Pharmaceuticals Limited, యానీ బెసెంట్ రోడ్, వొర్లీ, ముంబై, 400 030, ఇండియా ప్రారంభించిన కార్యక్రమం. ఈ మెటిరీయల్‌లో ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే, వీటిలో ఏదీ వైద్య సలహా కాదు. మీ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం కోసం, ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే మీ చిన్నారుల వైద్యులను సంప్రదించండి. వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల జాబితా అలాగే ప్రతీ వ్యాధికి సంబంధించిన పూర్తి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కోసం మీ చిన్నారుల వైద్యులను సంప్రదించండి. GSK ఉత్పత్తుల వల్ల ఏదైనా తీవ్రమైన ప్రభావం ఏర్పడితే దయచేసి వాటిని india.pharmacovigilance@gsk.com ద్వారా కంపెనీకి తెలియచేయండి.

  NP-IN-MLV-OGM-200040, DOP Dec 2020
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Children, Corona Vaccine, Health care, Parenting

  తదుపరి వార్తలు