Home /News /life-style /

WHY COLD DRINK BOTTLES ARE NOT FILLED UP TO BRIM SPACE LEFT IN SOFT DRINK BOTTLES PVN

Cold Drink Bottle : కూల్ డ్రింక్ బాటిల్ లో కొంత ఖాళీ ఎందుకు ఉంటుందో తెలుసా..పెద్ద సైంటిఫిక్ రీజనే ఉందిగా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో కూల్ డ్రింక్స్(Cold Drinks) తాగని వాళ్లు చాలా అరుదుగానే ఉంటారని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ల వరకు దాదాపు అందరూ కూల్ డ్రింక్స్ తాగేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఎండకాలంలో అయితే కూల్ డ్రింక్ సేల్స్ భారీగా పెరిగిపోతుంటాయి.

ఇంకా చదవండి ...
ఈ రోజుల్లో కూల్ డ్రింక్స్(Cold Drinks) తాగని వాళ్లు చాలా అరుదుగానే ఉంటారని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ల వరకు దాదాపు అందరూ కూల్ డ్రింక్స్ తాగేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఎండకాలంలో అయితే కూల్ డ్రింక్ సేల్స్ భారీగా పెరిగిపోతుంటాయి. కూల్ డ్రింక్స్ ని సాధారణంగా ప్లాస్టిక్ బాటిల్స్(Plastic Bottles) లో ప్యాక్ చేసి అమ్ముతారనేది తెలిసిందే. అయితే కూల్ డ్రింక్ బాటిల్ ని ఎప్పుడైనా తీక్షణంగా గమనించారా?అందులో ఓ విచిత్రం దాగి ఉంటంది. కూల్ డ్రింక్ బాటిల్స్ లో కూల్ డ్రింక్ ని ఎప్పుడూ కూడా మూత(Cap) దాకా నింపరు. కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో కొంచెం ఖాళీ ఉంటుంది. దీనికి కారణం ఏంటో తెలుసా?బాటిల్ అంచు వరకు కూల్ డ్రింక్ ఎందుకు నింపబడదు అనే దాని వెనుక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. బ్రెయిన్లీ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం...బాటిల్ మూత,కూల్ డ్రింక్ మధ్య ఖాళీ స్థలం లేకపోతే బాటిల్ పగిలిపోయే ప్రమాదం ఉంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

శీతల పానీయాలను(Cold Drinks) ప్యాకింగ్ చేసేటప్పుడు..గది ఉష్ణోగ్రత కంటే తక్కువ వద్ద చల్లబడి ప్యాక్ చేయబడతాయి. దీని తర్వాత చాలా సార్లు బాటిల్స్ కూడా ఎండలో లేదా కొన్ని ఇతర రకాల వేడి ఉష్ణోగ్రతలలో వదిలివేయబడతాయి. దీని కారణంగా, బాటిల్స్ లోపల ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండవచ్చు. ఇప్పుడు కూల్ డ్రింక్ లోపల కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువు కనిపిస్తుంది కాబట్టి, బాటిల్ యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, ఈ వాయువు వేడి కారణంగా ద్రవం నుండి బయటకు వచ్చి విస్తరిస్తుంది. దీనివల్ల బాటిల్ లోపల ఒత్తిడి పెరుగుతుంది. పెరిగిన ఒత్తిడి కారణంగా, ఆ వాయువు బయటకు రావడానికి గట్టిగా తోస్తుంది. ఇది బాటిల్ పగిలిపోయేలా చేస్తుంది. ఇది మాత్రమే కాదు, నీటిని 4 డిగ్రీల సెల్సియస్ చల్లబరిచినప్పుడు, అది విస్తరించడం ప్రారంభమవుతుంది. కానీ గాజు సీసా చల్లబడినప్పుడు, అది తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో, గాలి గ్యాప్ లేకపోతే, అప్పుడు శీతల పానీయం యొక్క పరిమాణం సీసా పరిమాణం కంటే ఎక్కువగా ఉండి బయట పడిపోతుంది.



Hair Fall : హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా..ఇలా చేస్తే వెంట్రుకలు ఊడిపోయే సమస్యకు చెక్

మరోవైపు,శరీరానికి పోషకాలను సహజ మార్గాల ద్వారానే అందించాలని నిపుణులు చెబుతుంటారు. వివిధ రకాల విటమిన్లను సప్లిమెంట్లుగా తీసుకుంటే మంచిది కాదని అనేక అధ్యయనాలు నిరూపించాయి. తాజాగా విటమిన్‌ సప్లిమెంట్‌లను అధికంగా తీసుకునే వారు షాక్‌కు గురయ్యే వివరాలను వెల్లడించింది తాజా రీసెర్చ్. విటమిన్‌ Bని ఎక్కువ మోతాదులో తీసుకునే పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. స్మోకింగ్ చేసే వారిలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉందని తెలిపింది. సరైన అవగాహన లేకుండా సప్లిమెంట్లను తీసుకునే వారందరికీ ఈ అధ్యయనం ఒక హెచ్చరిక అని పరిశోధకులు చెబుతున్నారు. 70,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులపై జరిపిన ఒక పరిశోధనలో.. విటమిన్ B ఎక్కువగా తీసుకునే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని తెలిసింది. ఈ వివరాలు జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురితమయ్యాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Drinks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు