Beer Bottles: కంపెనీ వేరైనా కలర్లు అవే.. బీర్ సీసా కలర్ ఎందుకు ఆ రెండు రంగుల్లోనే ఉంటుందో మీకు తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

Beer Bottles Colours: బీర్ కు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. అందుకు మందుబాబులు చెప్పే రీజన్లు చాలానే ఉంటాయి. బీర్ తాగడం గుండెకు సహాయపడటమే కాకుండా డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతారు. ఇలాంటి కారణాలతో మందుబాబులు బీరు బాటిళ్లు లేపిస్తున్నారు. అయితే బీర్ బ్రాండ్ ఏదైనా కావచ్చు.. సీసా మాత్రం ఆకుపచ్చ, గోధుమ రంగుల్లోనే ఉంటాయి. ఎందుకు ఈ రంగుల్లో ఉంటాయో తెలుసా..?

 • Share this:
  Beer Bottles Color: బీర్ (Beer)పేరు వింటేనే చాలు.. కుర్రకారు గొంతులో దిగనిదే నిద్దర పట్టదంటారు. సీసాలు సీసాలు లేపేస్తారు. ఇక సమ్మర్‌ (Summer)లో అయితే సేల్స్ మాములగా ఉండవు.  ఇప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా బీరు బాటిల్స్ లేపేస్తున్నారు.   పండగలు..పబ్బాలు.. పుట్టిన రోజులు.. వేడుక ఏదైనా.. గెట్ టు గెదర్ అయినా.. వీకెండ్ వచ్చినా.. ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ కలిసినా.. బీర్ పొంగాల్సిందే.. కరోనా మహమ్మారి భయపెడుతున్న సమయంలోనూ బీర్ బాటిల్స్ అమ్మకం జోరుగానే సాగుతోంది. రోజు రోజుకూ మరింత డిమాండ్ పెరుగుతోంది. అయితే బీర్ అంటే యూత్ అంత ఇష్ట పడడానికి మరో కారణం కూడా ఉంది. బీర్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని తాగేవారు నమ్ముతుంటారు. కానీ ఈ రోజు మనం బీర్ ప్రయోజనాలు.. ఆ విషయం పక్కన పెడితే.. మరో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. బీర్ బ్రాండ్ ఏదైనా కావచ్చు.. సీసా మాత్రం ఆకుపచ్చ, గోధుమ రంగుల్లోనే ఉంటాయి. ఎందుకు ఈ రంగుల్లో ఉంటాయి..? కారణం ఏంటి..? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తుంటాయి. అసలు సంగతి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ప్రాచీన మెసొపొటేమియా సుమేరియన్ నాగరికత కాలం నుంచి బీరును తాగుతున్నారు.

  7 వేల ఏళ్ల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు కల్చర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. వేలాది సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్టులో మొట్టమొదటి బీర్ కంపెనీ ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. అప్పుడు బీర్ ప్యాకింగ్ ఒక పారదర్శక సీసాలో ప్యాక్ చేశారు. అయితే బీర్‌లో ఉండే ఆమ్లంతో సూర్య కిరణాల నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్య జరగడంతో ఆ బీర్ చెడిపోతుందని గుర్తించారు. దీంతో బీర్ దుర్వాసన వస్తుంది. తాగడానికి ఉపయోగ పడకుండా పోతుందని తెలుసుకున్నారు.

  ఇదీ చదవండి: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలి అంటే రోజూ ఇలా చేయండి.. ఐదు రకాల పండ్లు.. కూరగాయలు తింటే చాలు

  ఈ సమస్యను పరిష్కరించడానికి బీర్ తయారీదారులు ఒక ప్రణాళికను రూపొందించారు. దీని కింద గోధుమ రంగు పూసిన సీసాలు బీర్ కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ ట్రిక్ చాలా అద్భుతంగా పని చేసింది. ఇలా రంగు సీసాలో పోసిన బీరు చెడిపోకుండా సురక్షితంగా ఉంది. అంతే కాదు చెడిపోకుండా వాసన, రుచి మారిపోలేదు.

  ఇదీ చదవండి: మీలో ఫిట్ నెస్ తగ్గిందని ఇలా తెలుసుకోండి.. శరీరాకృతి మారిందని తెలిపే సంకేతాలు ఇవే!

  రెండవ ప్రపంచ యుద్ధంలో బీరు సీసాలు ఆకుపచ్చగా పెయింట్ మొదలు పెట్టారు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమ సీసాల కరువు ఏర్పడింది. ఈ రంగు సీసాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితిలో బీర్ తయారీదారులు మరో రంగును ఎంచుకోవల్సి వచ్చింది. ఆ సమయంలో గోదుమ రంగు సీసాల స్థానంలో గ్రీన్ కలర్ సీసాలను ఉపయోగించారు. అప్పటి నుంచి ఈ రెండు రంగులను బీర్ సీసాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇదిండీ..
  Published by:Nagesh Paina
  First published: