భారతీయ డాక్టర్లు కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఎందుకు తీసుకుంటున్నారు?

భారతీయ డాక్టర్లు కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఎందుకు తీసుకుంటున్నారు?

భారతీయ డాక్టర్లు కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఎందుకు తీసుకుంటున్నారు?

  • Share this:


    మహమ్మారి వచ్చిన నాటి నుండి, డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ముందు వరుసలో ఉండి మన వరకు ఇన్ఫెక్షన్ దరిచేరకుండా కాపాడారు. వారు చేసిన సేవల గురించి ప్రపంచానికి తెలిసి, ప్రశంసలు కూడా పొందారు. అందులో భాగంగా వారికి సరైన పని ప్రదేశాన్ని కల్పించడం, ఈ ధైర్యవంతులకు సురక్షిత పరికరాలను అందించడం లాంటి మార్పులు కూడా వచ్చాయి. భారతదేశంలో మొదటిసారిగా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు విడుదలైనప్పుడు కూడా డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంధి ప్రాముఖ్యత గుర్తించబడింది, అందుకే మొట్టమొదటి కొవిడ్ -19 వ్యాక్సినేషన్లు అందుకోవడంలో అందరికంటే ఎక్కువగా వారికే ప్రాధాన్యతనిచ్చారు.

    ఇదిలా ఉండగా, మొదటి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించిన తర్వాత, ఇప్పుడు కొత్తగా డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందికి ఒక కొత్త ఆరోగ్య సమస్య వచ్చింది. వారు వ్యాక్సినేషన్లు తీసుకున్న కొన్ని నెలల తర్వాత, చాలా మందిలో యాంటీబాడీస్ లేకుండా ఉండటం చూస్తున్నారు. యాంటీబాడీ పరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమైంది, అలాగే ఇది ఆందోళన చెందాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది కొవిడ్-19 చికిత్స చేయడంలో నిమగ్నమై ఉన్నారు. పరిణాత్మకంగా, వారు ఇప్పుడు కొవిడ్-19 వ్యాక్సినేషన్ బూస్టర్ షాట్లు తీసుకుంటున్నారు. ఈ ‘బూస్టర్’ డోస్ షాట్స్ అన్నీ మిగిలిపోయిన వ్యాక్సిన్ డోసులే, కాబట్టి వాటికి ఎలాంటి లెక్క లేదు.

    యునైటెడ్ స్టేట్స్ లాంటి కొన్ని దేశాలు, ఎక్కువ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉన్న ప్రజలకు బూస్టర్ షాట్లు తీసుకోవడాన్ని తప్పనిసరి చేశాయి. కానీ భారతదేశంలో, అక్టోబర్ 3 నాటికి అర్హత గల వయోజనులలో కేవలం 26.3% మంది మాత్రమే పూర్తిగా వ్యాక్సినేట్ చేయబడ్డారు. సమానంగా వ్యాక్సిన్ పంపిణీ, అందుబాటు లేకపోవడం ఇందుకు కారణం. అయితే రెండో వ్యాక్సినేషన్ డోసు తర్వాత చాలా మందిలో యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతున్నట్లు వస్తున్న రిపోర్టులను బట్టి, భారతదేశంలో సగం జనాభాకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అందకముందే, అందరికీ బూస్టర్ షాట్ల అవసరం రావచ్చు. ఇక డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది విషయంలో, ఇది చాలా అత్యవసర పరిణామం, అందుకే పరిస్థితిని వారి చేతుల్లోకి తీసుకుంటున్నారు.

    ఇలా ఆథరైజ్ చేయని బూస్టర్ షాట్లను డాక్టర్లు తీసుకోవడం ప్రోటోకాల్ ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే వారి విధి నిర్వహణలో భాగంగా తాము ఎదుర్కోబోయే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇలా చేయడాన్ని డాక్టర్లే స్వయంగా తిరస్కరిస్తున్నారు. దీనికి తోడుగా వ్యక్తిగత సమస్య కూడా తోడైంది. వారి నుండి వారి కుటుంబ సభ్యులకు ఇన్ఫెక్షన్ సోకుతుందేమోనని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. చాలా కుటుంబాల్లో, ఇద్దరు తల్లిదండ్రులు డాక్టర్లే అయినప్పుడు, వారితో పాటు ఉండే పిల్లలు, పెద్దవాళ్లకు ఇన్ఫెక్షన్ సోకే రిస్క్ అధికంగా ఉంటుంది.

    డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది వైపు నుండి చూస్తే, ఎక్కువ-రిస్క్ ఉన్న వారికి ప్రత్యేకంగా మూడో బూస్టర్ షాట్ వ్యాక్సిన్ వేసుకునే విధానాన్ని అమలు చేయడమే దీనికి ఏకైక పరిష్కారం. వనరులను మళ్లించడం, వ్యాక్సినేషన్ ప్రయత్నాలను పెంచడం కంటే బూస్టర్ డోసుల కారణంగా భారతీయ జనాభా మరింత రోగనిరోధకంగా మారి, సురక్షితంగా తయారయ్యే పరిస్థితి ఉంది.

    ప్రతి భారతీయుడికి వ్యాక్సిన్ అందేలా చేసే ప్రయత్నంలో మీరు కూడా చేయి కలపండి. భారతదేశపు అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ అవగాహన డ్రైవ్ అయిన Network18 సంజీవని – ఎ షాట్ ఆఫ్ లైఫ్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్. CSR కార్యక్రమంలో భాగమవ్వండి. భారతదేశ ఆరోగ్యం, వ్యాధినిరోధకతకు తోడుగా నిలబడటానికి ఇదే మంచి తరుణం.
    Published by:Rekulapally Saichand
    First published: