హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Holidays : హాలిడేస్ ఎందుకు ఇంపార్టెంట్..దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Holidays : హాలిడేస్ ఎందుకు ఇంపార్టెంట్..దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Benefits of Holidays : కనీసం సంవత్సరానికి ఒకసారి సెలవులు(Holidays) అవసరం. తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సుదీర్ఘ సెలవులు గడపడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. అందరూ హాలిడేస్‌కి వెళ్లాలని ఉత్సాహంగా ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Health Benefits of Holidays : కనీసం సంవత్సరానికి ఒకసారి సెలవులు(Holidays) అవసరం. తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సుదీర్ఘ సెలవులు గడపడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. అందరూ హాలిడేస్‌కి వెళ్లాలని ఉత్సాహంగా ఉంటారు. సెలవులు సరదాగా గడపడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను(Health Benefits) కలిగి ఉంటాయని మీకు తెలుసా? అవును, అనేక సర్వేలు, నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉండటానికి సెలవులు కూడా అవసరం. పని నుండి కొంత సమయం దూరంగా ఉండటం, సెలవుల్లో రోజువారీ ఒత్తిడికి దూరంగా ఉండటం వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తెలుసుకుందాం..

ఆరోగ్యంగా ఉండటానికి సెలవులు చాలా ముఖ్యం 

ఒత్తిడిని తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది

CuddleNest.com ప్రకారం... సెలవులు మీ నిద్ర నాణ్యతను దాదాపు 17 శాతం పెంచుతాయి. సెలవులకు బయటకు వెళ్లడం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మీ మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచుతుంది, ఇది మంచి నిద్రకు దారి తీస్తుంది, మీలో మానసికంగా బలంగా మరియు తాజాగా అనిపిస్తుంది. మంచి నిద్రను పొందడం ద్వారా, మీరు శక్తిని పొందుతారు, మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది.

Sikkim Tourist Places : సిక్కిం టూర్ కి ఫ్లాన్ చేస్తున్నారా? ఇవి చూడటం మిస్ కావొద్దు

అధిక రక్తపోటు నుండి బయటపడండి

నిపుణులు చేసిన పరిశోధనల ప్రకారం, రెగ్యులర్ హాలిడే ట్రిప్స్ కు వెళ్లేవారికి అధిక రక్తపోటు సమస్య తక్కువగా ఉంటుంది. అందుకే మీరు రిలాక్స్‌గా ఉండేందుకు, రక్తపోటు సమస్యను నివారించేందుకు కొంత సమయం మాత్రమే పనిలో ఉండాలి.

సెలవులు మీ ప్రొడక్టివిటీని పెంచుతాయి

అప్పుడప్పుడు సెలవులకు వెళ్లడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఇది మిమ్మల్ని మంచి మూడ్‌లో ఉంచుతుంది, బాగా నిద్రపడుతుంది. శారీరకంగా దృఢంగా ఉండటంతోపాటు మానసికంగా దృఢంగా ఉంటరు. దీని కారణంగా మీ మొత్తం పని ఉత్పాదకత లేదా ప్రొడక్టివిటీ పెరుగుతుంది

Published by:Venkaiah Naidu
First published:

Tags: Health, Health benefits, Holidays, Life Style

ఉత్తమ కథలు