Beauty tips: ఎవరు ఎలాంటి డ్రెస్​ వేసుకోవాలి... ఎలా వేసుకుంటే అందంగా కనిపిస్తారు?

(ప్రతీకాత్మక చిత్రం)

అమ్మాయిలకు అందంపై సహజం గానే కాస్త ఆసక్తి (interest) ఎక్కువగా ఉంటుంది. అయితే వారికి తగ్గట్లు ఎలాంటి డ్రెస్ (dress)​లు వేసుకోవాలో చాలామందికి తెలియదు. మంచి మంచి డ్రెస్​లు కొనుక్కుంటారు. చాలా ధర (heavy money) వెచ్చిస్తారు. అయినా ఆ డ్రెస్​ వేసుకుంటే వారికి సెట్​ అవ్వవు.

 • Share this:
  ఈ ప్రపంచంలో అమ్మాయిలు (Girls) అనగానే అందం (beauty) గుర్తొస్తుంది. అమ్మాయిలకు అందంపై సహజం గానే కాస్త ఆసక్తి (interest) ఎక్కువగా ఉంటుంది. అయితే వారికి తగ్గట్లు ఎలాంటి డ్రెస్ (dress)​లు వేసుకోవాలో చాలామందికి తెలియదు. మంచి మంచి డ్రెస్​లు కొనుక్కుంటారు. చాలా ధర (heavy money) వెచ్చిస్తారు. అయినా ఆ డ్రెస్​ వేసుకుంటే వారికి సెట్​ అవ్వవు. అదే వేరే వారికి బాగా కనిపిస్తాయి. ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనిపించాలని, నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని ఎంతగానో ఆశపడుతుంటారు చాలా మంది. ముఖ్యంగా మహిళలైతే ప్రత్యేక కార్యక్రమాల సమయంలో అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటుంటారు. అయితే మనం అనుకున్న విధంగా అందరిలోనూ ప్రత్యేకంగా (special) కనిపించాలి అంటే కొన్నిటిప్స్​ పాటిస్తే మంచింది. ఒక్కసారి ఫాలో అవండి.

  ఫెయిర్​గా ఉంటే ముదురు రంగు..

  ఫెయిర్ (fair) గా ఉన్న వారైతే ముదురు రంగు (dark color) డ్రెస్​లను ఎంచుకోవాలి. అదే విధంగా, రంగు కాస్త తక్కువగా ఉన్న వారైతే లైట్ కలర్ (light color) డ్రెస్సులను ఎంచుకోవాలి. అలాగే డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్, గాజులు (bangles), హ్యాండ్ బ్యాగ్ (hand bag) ఉండేలా చూసుకోవాలి. మీరు చీర (saree) కట్టుకున్నట్లయితే ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ (ear rings) పెట్టుకోవటం, జీన్స్ అండ్ మోడ్రన్ డ్రెస్సులు మీదకి అయితే మోడల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం, అలాగే బ్యాంగిల్స్ కాకుండా ఏమైనా హ్యాండ్ బ్యాండ్స్ (hand bands) ను ఎంపిక చేసుకోవాలి. ఇవన్నీ చాలా మంది పెద్దగా పట్టించుకోరు (doesn’t care). అయితే అందరి దృష్టిని ఆకర్షించేంత అందంగా కనిపించాలంటే ఇవన్నీ తప్పక పాటించాల్సిందే మరి.

  హెయిర్​ స్టైల్​ కూడా..

  అలాగే మీరు ధరించే చెప్పులు (walk mates) కూడా కరెక్ట్ మ్యాచ్ అయ్యేలా ఉంటే మంచిది. అలాగే చక్కటి హెయిర్​స్టైల్​ కూడా మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. అప్పుడప్పుడూ హెయిర్​ స్టైల్స్​ మారుస్తూ ఉంటే మంచిది. ఎప్పుడూ ఒకేలా ఉంటే కూడా మీపై ఎక్కువ మంది దృష్టి పడకపోవచ్చు. అందుకే ఆయా ఈవెంట్​లకు తగ్గట్లు హెయిర్​ స్టైల్స్​ తీర్చిదిద్దుకోవాలి. పండుగల వేళ జడ, పార్టీలకు మరో రకమైన స్టైల్​లో వెళితే బాగుంటుంది. ట్రెండిల్​ బన్​, హై చిగ్నాన్ బన్,  బ్రెయిడ్ & బన్ లాంటి హెయిర్​ స్టైల్స్​ ప్రయత్నించొచ్చు.

  ఎత్తు తక్కువ ఉన్నవారైతే..

  ఎత్తు కాస్త తక్కువ (short people) ఉన్న వారైతే కాస్త ఇబ్బందిగా ఉన్నా అలవాటు చేసుకుని మరీ హై హీల్స్ ను ధరిస్తే బాగుంటుంది. ఇక కాస్త లావుగా (heavy weight) ఉన్నవారు లాంగ్ స్కర్ట్స్ (long skirts) ను ఎంచుకోవడం మంచిది. ఇలా ప్రతి ఒక్కరు చక్కగా మ్యాచ్ (matching) అయ్యేలా చూసుకుని, అవి తమకు మ్యాచ్ అవుతాయా లేదా అన్న ట్రైల్ ఒకసారి చూసుకుని రెడీ (ready) అయితే అందరిలోను ప్రత్యేకంగా కనిపిస్తారు. మీకు ఫాలోయింగ్ (following) కూడా పెరుగుతుంది. మరి ఈ రోజు నుంచి మీరు కూడా అందంగా (beauty) అందరినీ ఆకర్షించడానికి పైన మనం చెప్పుకునే విధంగా తయారు అవ్వడం

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)  ఇవి కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

  గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

  శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి

  Published by:Prabhakar Vaddi
  First published: