WHICH MILK IS GOOD FOR HEALTH COW MILK OR BUFFALO MILK WHAT THE SPECIALTY IN GOAT MILK PRV
healthy milk: ఆవు, గేదె పాలలో ఏ పాలు ఆరోగ్యానికి శ్రేయస్కరం.. మేక పాల ప్రత్యేకత ఏంటి..
ప్రతీకాత్మక చిత్రం
గ్రామాలలో పాడి జంతువులను బట్టి కొందరు ఆవు పాలు తాగితే మరికొందరు గేదె పాలు తీసుకుంటారు. కానీ ఆవు పాలు లేదా గేదె పాలలో దేనివల్ల ఎక్కువ ప్రయోజనమనే విషయాన్ని తెలుసుకుందాం
పాలు(Milk) తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలలో చాలా పోషకాలు ఉన్నాయి, కొందరు పాలలో వారికి తోచిన పదార్థాలు వేసుకుని అల్పాహారం సైతం చేస్తుంటారు. గ్రామాలలో పాడి జంతువులను బట్టి కొందరు ఆవు పాలు తాగితే మరికొందరు గేదె పాలు తీసుకుంటారు. కానీ ఆవు పాలు లేదా గేదె పాలలో దేనివల్ల ఎక్కువ ప్రయోజనమనే విషయాన్ని తెలుసుకుందాం. కొందరు మేక పాలు కూడా తాగినప్పటికీ పోషకాల విషయానికొస్తే ఆవు, గేదె పాలపై ఆసక్తి చూపుతారు. గేదె పాలు కంటే ఆవు పాలలో తక్కువ కొవ్వు ఉంటుంది. ఆవు(cow) పాలను తేలికైన పాలు అని కూడా అంటారు. ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయి. అందుచేత ఆవు పాలను పిల్లలకు కూడా ఇస్తారు. ఆవు పాలను ఒకటి రెండు రోజుల్లోనే తాగాలి. గేదె(buffalo) పాల విషయానికొస్తే వీటిని మరికొంత కాలం నిల్వ చేసుకోవచ్చు. ఆవు(cow) పాలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. మరోవైపు, గేదె(buffalo) పాలలో అయితే భాస్వరం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు అధికంగా లభిస్తాయి.
ఆవు పాలు కంటే గేదె పాలలో ప్రోటీన్లు(proteins) ఓ పది శాతం ఎక్కువగా లభిస్తాయి. ఆవు పాలలో కొవ్వు కాస్త తక్కువగా లభిస్తుంది. ఆవు పాలలో కొవ్వు మూడు నుంచి నాలుగు శాతం ఉండగా, గేదె పాలలో 7-8 శాతంతో అధికంగా కొవ్వు ఉంటుంది. తక్కువ కొవ్వు ఉండే గేదె పాటు తాగడం ద్వారా మీకు రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం లాంటి సమస్యలు తగ్గుతాయి. గేదె పాలు తాగడం ద్వారా ఇలాంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శరీర తత్వానికి ఏ పాలు కావాలో మీరు నిర్ణయించుకోండి. గేదె పాలలో ఆవు పాలు కంటే కేలరీలు అధికంగా లభిస్తాయి. ఒక లీటర్ కప్పు గేదె పాలలో 237 కేలరీలు లభించగా, అదే ఆవు పాల విషయానికొస్తే 148 కేలరీలు అందుతాయి. జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారు గేదె పాలు తాగవచ్చు. మరీ బలహీనంగా ఉన్నవారు కొవ్వులు, ప్రోటీన్ల కోసం గేదె పాలు తీసుకోవచ్చు. రక్తపోటు, గుండె(heart problems) సంబంధింత సమస్యలున్న వారు మాత్రం ఆవు పాలు తాగడం ఆరోగ్యకరం(Healthy).
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.