Best cooking Oil : వంట నూనె లేకుండా వంట చేయలేం. చేసినా టేస్ట్ ఉండదు. పైగా నూనె అనేది కూడా మనం తప్పక వాడుతున్న ఐటెం. ఐతే... ఏది మంచి నూనె అన్నది ఓ సమస్య. ఇందుకు సంబంధించి ఇంటర్నెట్‌లో మీరు చాలాసార్లు సెర్చ్ చేసే ఉంటారు. రకరకాల వీడియోలు చూసే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై డిబేట్ జరుగుతూనే ఉంది. కంపెనీలు తమ ప్రతీ బ్రాండ్ నూనే మంచిదేనని అంటున్నాయి. మార్కెట్‌లో మనం ఎంచుకోవడానికి పదుల సంఖ్యలో బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఏది? దీనిపై ఢిల్లీలో డాక్టర్ హెచ్ కే చోప్రా, న్యూట్రీషనిస్ట్ నీలంజన సింఘ్ వంటి వారు ఒకే వేదికపైకి వచ్చి చర్చించారు. గుండెకు మేలు చేసేలా ఏ నూనె వాడాలి, ఎలా వాడాలో కనిపెట్టారు. అదేంటో తెలుసుకుందాం.
మంచి వంట నూనె ఏది : న్యూట్రీషనిస్ట్ నీలంజన ప్రకారం... మంచి వంట నూనె అనేదే లేదు. ఏ నూనే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పలేం. ఒక్కో ప్రాంతం వారు ఒక్కో నూనె వాడుతున్నారు. ఉత్తరాదిన ఆవాల నూనె వాడుతున్నారు. సౌత్‌లో కొబ్బరి నూనె వాడతారు. ఇదే బెస్ట్ నూనె అనుకోవడం కరెక్టు కాదు. ప్రతీ నూనెలో ప్రత్యేక కొవ్వు, ప్రత్యేక లక్షణాలూ ఉంటాయి. ఇది మంచి నూనె, ఇది చెడ్డ నూనె అని అనుకోవడానికి వీల్లేదు.
రెండు రకాల నూనెల్ని కలిపి వాడటం ఎప్పుడైనా మంచిదేనని నీలంజన తెలిపారు. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (MUFA) ఉండే నూనెల్ని వాడాలి. ఎందుకంటే MUFA అనేది మంచి కొవ్వు. అలాగే... పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ - PUFA అనేవి ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కలిగివుంటాయి. ఇవి మన బాడీకి చాలా అవసరం. ఎందుకంటే మన శరీరం వాటిని స్వయంగా తయారుచేసుకోలేదు. అందువల్ల వేర్వేరు నూనెల్ని కలిపివాడితే మేలు జరుగుతందని నీలంజన అభిప్రాయపడ్డారు.
ఏయే నూనెల్ని కలపాలి : సపోజ్ కొబ్బరి నూనెను వంటకు వాడేవారు... అన్నింటికీ కొబ్బరి నూనెనే వాడటం కరెక్టు కాదు. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఫ్యాట్ ఎక్కువ. కొన్ని ఆహార పదార్థాల్ని వేరే నూనెతో వండటం మేలు. కొబ్బరి నూనెతో వంట చేసేవాళ్లు... రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె వాడొచ్చు. ఎందుకంటే PUFA అనేది కొబ్బరి నూనెలో ఉండదు.
ప్రస్తుతం మార్కెట్లలో మిక్స్‌డ్ ఆయిల్స్ కూడా లభిస్తున్నాయి. ఆ ప్యాకెట్లను కొనుక్కొని డైరెక్టుగా వాడుకోవచ్చు. లేదంటే... వేర్వేరు ఆయిల్స్ కొనుక్కొని దేనికదే వాడుకోవచ్చు. ఎలా వాడినా... రెండు మూడు రకాల ఆయిల్స్‌ను వాడి వంటలు వండుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, HOME REMEDIES, Tips For Women