మీ పిల్లలు పోర్న్ సైట్లు చూస్తున్నారా? ఇలా కంట్రోల్ చేయండి

స్నేహితులు, స్కూల్లో సీనియర్ల ఒత్తిడితోనో, లేదా ఆన్‌లైన్‌లోని బ్రౌజ్ చేస్తుండగా వచ్చే యాడ్స్‌పై క్లిక్ చేయడం ద్వారానో పోర్న్ సైట్లోకి వెళ్తారు. ఆ తర్వాత అది అలవాటుగా మారిపోతుంది.

news18-telugu
Updated: February 12, 2019, 5:58 PM IST
మీ పిల్లలు పోర్న్ సైట్లు చూస్తున్నారా? ఇలా కంట్రోల్ చేయండి
మీ పిల్లలు పోర్న్ సైట్లు చూస్తున్నారా? ఇలా కంట్రోల్ చేయండి
news18-telugu
Updated: February 12, 2019, 5:58 PM IST
స్మార్ట్‌ఫోన్... ఈ రోజుల్లో ప్రతీ దగ్గర మామూలైపోయింది. ఇంట్లో నలుగురు పెద్దవాళ్లుంటే నాలుగు స్మార్ట్‌ఫోన్లు ఉంటాయి. ఇంట్లో నాలుగు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయంటే ఇక పిల్లలు ఊరుకుంటారా? కాస్త సమయం దొరికితే చాలు స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారో పెద్దగా పట్టించుకోరు. కానీ... 11 నుంచి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ సైట్లు చూస్తున్నారని అనేక అధ్యయనాలు బయటపెడుతున్నాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించేసరికి పరిస్థితి చేయిదాటిపోతోంది. పిల్లల్ని కొట్టడం, తిట్టడం, భయపెట్టడం ద్వారా కంట్రోల్ చేయాలని చూస్తారు. కానీ... ఇలాంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడంలో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Read this: LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

మీ పిల్లలు పోర్న్ చూస్తున్నట్టు మీకు తెలిస్తే వెంటనే తిట్టొద్దు. భయపెట్టొద్దు. రచ్చరచ్చ చేయొద్దు. పిల్లలకు ఏది మంచో, ఏది చెడో తెలియదు. ఈ వయస్సులోనే తల్లిదండ్రులు అన్నీ జాగ్రత్తగా నేర్పించాలి. అలాంటి వెబ్‌సైట్స్ ఎందుకు చూడకూడదో చెప్పాలి. చాలామంది పిల్లలు మొదటిసారి పొరపాటుగా అలాంటి వీడియోలు చూస్తుంటారు. స్నేహితులు, స్కూల్లో సీనియర్ల ఒత్తిడితోనో, లేదా ఆన్‌లైన్‌లోని బ్రౌజ్ చేస్తుండగా వచ్చే యాడ్స్‌పై క్లిక్ చేయడం ద్వారానో పోర్న్ సైట్లోకి వెళ్తారు. ఆ తర్వాత అది అలవాటుగా మారిపోతుంది. అయితే పిల్లల్ని భయపెట్టకుండా జాగ్రత్తగా నచ్చజెప్పాలి. మీ మాట వినరనుకుంటే... ఎవరి మాట అయితే పిల్లలు వింటారో వాళ్లతో చెప్పించాలి.

Read this: TRAI rules: ఛానెళ్లు సెలెక్ట్ చేసుకున్నారా? మీ కేబుల్ బిల్ ఇలా మారుతుందిపిల్లలతో ఇలాంటి విషయాలు ఎలా చర్చిస్తామని మీరు అనుకుంటే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది. ఒక్కసారిగా ఫోన్ ఇవ్వడం ఆపేస్తేనో, ఇంటర్నెట్ బ్లాక్ చేస్తేనే సమస్య పరిష్కారం కాదు. అప్పుడు పిల్లలు మరిన్ని తప్పులు చేస్తారు. ఇంకా రెబెల్‌గా తయారవుతారు. మీరు చేయొద్దన్న ప్రతీ పనిని ఖచ్చితంగా చేయాల్సిందే అన్న మనస్తత్వం పిల్లల్లో ఏర్పడుతుంది. అందుకే ఈ పరిస్థితిని జాగ్రత్తగా డీల్ చేయాలి. తల్లిదండ్రుల్లా కాకుండా స్నేహితుల్లా ప్రవర్తించాలి.

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు

ఇవి కూడా చదవండి:

కామర్స్‌లో పీజీ... జొమాటోలో డెలివరీ బాయ్... నిరుద్యోగ సమస్యకు సాక్ష్యం

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

IRCTC Ticket Booking: రిజర్వేషన్ సమయంలో ఈ 8 విషయాలు గుర్తుంచుకోండి
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...