Home /News /life-style /

WHEN COVAXIN VACCINE WOULD BE GIVEN TO KIDS IN INDIA AND INSTRUCTIONS OF USAGE RNK

Covaxin approval for use in children: పిల్లలకు కొవిడ్‌ టీకా ఎప్పటిలోగా ఇస్తారు.. ఎమర్జెన్సీ యూజ్‌ అథరైజేషన్‌ అంటే ?

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covaxin use in children: కోవాగ్జిన్‌ పూర్తిగా స్వదేశీ టీకా మాత్రమే కాదు, ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినందుకు పిల్లల ఇమ్యూనైజేషన్‌ డ్రైవ్‌ ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభమవుతుందని చాలా మంది భావిస్తున్నారు.

మన దేశంలో కోవాగ్జిన్‌ (Covaxin ) పిల్లలకు కూడా అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే! అయితే, ఇది కేవలం అత్యవసర ఆమోదం మేరకే అని చెప్పారు. ఇది థర్డ్‌వేవ్‌ ముప్పు నుంచి పిల్లలను కాపాడుతుంది. ఎస్‌ఈసీ (Subject expert committee) నివేదికల ప్రకారం 2–18 ఏళ్ల పిల్లలు టీకా ఉపయోగించడాన్ని సిఫార్సు చేశారు. ఇది డీజీసీఐ ద్వారా మరింత సమీక్షించనున్నారు.
అయితే, భారత్‌లో కొవిడ్‌–19 వ్యాక్సిన్‌ పిల్లలకు ఎప్పుడ ఇస్తారు? దానికి పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం.

ఇది పండగ సీజన్‌ తర్వాత ఎప్పుడైనా థర్డ్‌వేవ్‌  (Third wave) రావచ్చని భావిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈసారి కరోనా కేసులు పెరిగితే.. పిడియాట్రిక్‌ కేసులు కూడా పెరగవచ్చు. అందుకే అక్టోబర్‌ 12న భారత్‌లో పిల్లలకు వ్యాక్సిన్‌ ఉపయోగానికి అధికారికంగా ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు కానీ, త్వరలో వ్యాక్సిన్‌ ప్రక్రియ సులభతరం అయింది. ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు కానీ, ఒకటి రెండు వారాల్లో పిల్లల వ్యాక్సిన్‌పై ఆమోదం ఆశించవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి.

ఇది కూడా చదవండి: మీకు తెలుసా? ఈ పండు తింటే.. బట్టతల రాదు!

కోవాగ్జిన్‌ వినియోగానికి ప్రస్తుతం భారత్‌లో అత్యవసర వినియోగం అధికారికంగా మంజూరు చేశారు. కానీ, ఇది పూర్తి యాక్సెస్‌ కాదు. క్లీనికల్‌ ట్రయల్స్, ల్యాబ్‌ ఆధారిత డేటాను సమీక్షించి తర్వాత ప్రాణాంతక అత్యవసర పరిస్థితి (కొవిడ్‌ వంటివి)లో మాత్రమే ఈ ఔషధ వినియోగాన్ని అనుమతించే యంత్రాంగాన్ని ఈయూఏ సూచిస్తుంది. కోవాగ్జిన్‌ ఇంకా క్లిష్టమైన చివరి దశ అధ్యయనంలో ఉండగా.. ఈయూఏ రిస్క్‌ వర్సెస్‌ బెనిఫిట్‌ మూల్యాంకనంపై మంజూరు చేశారు. కోవాగ్జిన్‌ ఇంకా ట్రయల్స్‌లో ఉండగా.. పెద్దల మాదిరి పిల్లల్లో మంచి సమర్థవంతంగా యాంటీబాడీస్‌ రక్షణను గుర్తించారు.

అందువల్ల ప్రపంచ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగడానికి అనుమతించారు. క్లీనికల్‌ డేటా బాగా సమీక్షించారు. ఏదేమైనా.. ఇది ఇప్పటికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కాబట్టి అన్ని దశలు పూర్తి కాకుండానే ఆమోదం పొందింది. కానీ కొవాగ్జిన్‌ తయారీదారులు ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని అంశాలను అనుసరించమని కోరారు.

ఇది కూడా చదవండి: ఈ సినిమా చూస్తే.. భార్యాభర్తలు విడాకులు అస్సలు తీసుకోరట!

ఎస్‌ఈసీ సిఫార్సు ప్రకారం కోవాగ్జిన్‌ భారత్‌ బయోటెట్‌ డెవలపర్స్‌ తమ టీకాను పిల్లలకు వాడాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలు, షరతులు పాటించాల్సి ఉంటుంది. భారత్‌ బయోటిక్‌ కరోనా వైరస్‌ క్రియారహిత జాతి (వ్యాక్సిన్‌లో ఉపయోగించేది) ఆధారంగా అధ్యయనం కొనసాగించడమే కాకుండా, మొదటి రెండు నెలలకు ప్రతి 15 రోజులకు ఏఈఎఫ్‌ఐ, ఏఈఎస్‌ఐలోని ఫ్యాక్ట్‌షీట్‌ ఉత్పత్తి, లక్షణాల డేటాను కూడా అందించాలి. ఇది టీకా సురక్షితంగా, దీర్ఘకాలికంగా ప్రభావవంతంగా ఉందో లేదో పర్యవేక్షించడానికి అధికారులకు సహయపడుతుంది.

అయితే, కొవాగ్జిన్‌ భారత్‌లో పిల్లలకు ఆమోదించిన మొదటి టీకా.కానీ, బలహీనమైన పిల్లలకు టీకాలు వేయడానికి ఇతర అనేక టీకాలు కూడా ప్రణాళింగా తయారు చేస్తున్నారు. జైడస్‌ కాడిలా Zydus cadila's సూది లేని డీఎన్‌ఏ వ్యాక్సిన్, జైకొవ్‌–డీ Zycov-D వ్యాక్సిన్‌లు 12 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నవారికి ఎంపిక చేసి, ఆమోదించారు. అయితే, ట్రయల్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి.

పీడియాట్రిక్‌ ఉపయోగం కోసం ఆమోదించిన ఇతర టీకాలు కార్బొవెక్స్, కోవోవాక్స్‌. రెండు టీకాలు 7–14 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు మిడ్‌–స్టేజ్‌ ట్రయల్స్‌కు అనుమతినిచ్చారు.
ఇలా వ్యాక్సిన్‌ ప్రకటించడం వల్ల తల్లిదండ్రులు, విద్యాసంస్థలకు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. ఏదేమైనా ఇంకా ఎంత సమయం వేచి ఉండాలో తెలీదుకానీ, ఒకవేళ పెద్దల కంటే పిల్లలు వేర్వేరు మోతాదు షెడ్యూల్, నమూనాలు అవసరమవుతాయి. ఎమర్జెన్సీ యూజ్‌ అథరైజేషన్‌ పొందిన ఫార్మా కంపెనీలు పిల్లలకు టీకా వేయడం,సైడ్‌ఎఫెక్ట్‌లపై అవగాహన కల్పించడం, అందుబాటులో ఉండే మొత్తం డోస్‌ల గురించిన తదుపరి ఆదేశాలకు ఎదురు చూస్తున్నారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Covaxin

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు