Health Tips : డయాబెటీస్‌కి మేలు చేసే బీన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ఆహారం కేవలం కడుపు నింపేందుకే కాదు.. మనం తినే ఒక్కో ఆహార పదార్థంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీన్స్‌ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • Share this:
షుగర్ పేషెంట్స్‌ రెగ్యులర్‌గా బీన్స్ తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఇందులోని విటమిన్స్, మినరల్స్, న్యూట్రియెంట్స్, మెగ్నీషియం పొటాషియంలు అన్నీ కూడా షుగర్ లెవల్స్‌ని సరిగ్గా ఉంచుతాయి. అదే విధంగా ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా.. ప్రోటీన్ ఆల్టర్‌నేటీవ్‌గా ఉండే ఈ బీన్స్ శాఖాహారులకు చక్కని బలవర్ధకమైన ఆహారం. ఇందులోని ఫైబర్, ప్రోటీన్స్ బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బీన్స్‌ని మన డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల షుగర్ పేషెంట్లకి చాలా మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇతర కూరగాయలతో వీటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో రుచికి రుచే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. అయితే, వీటిని వండినప్పుడు ఉప్పుశాతం తగ్గించడం మరిచిపోవద్దని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ తమ డైట్‌లో బీన్స్‌ని భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. బీన్స్‌తో పాటు తాజా కూరగాయలు తీసుకోవడం మరవద్దని చెబుతున్నారు.

ఈ వీడియో కూడా చూడండి..
First published: