Home /News /life-style /

Night food: అరటి పండు రాత్రిళ్లు తినకూడదా? రాత్రి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?

Night food: అరటి పండు రాత్రిళ్లు తినకూడదా? రాత్రి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏ టైంలో ఏం తినాలో, ఎలాంటి ఆహారం తింటే త్వరగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయం (Night time)లో సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. చాలామందికి రాత్రిళ్లు (night) అరటి పండు (banana) తినడం మంచిదేనా అని అనుమానం ఉంది. రాత్రి ఎలాంటి ఆహారాలు బెటర్​ అనేది తెలుసుకుందాం...

ఇంకా చదవండి ...
    ఉరుకుల పరుగుల జీవితం. పని, ఆందోళన, కష్టాలు మన తిండి సమయాలనూ మార్చేస్తాయి. ఏ పూట తింటారో తెలియదు. ఏ సమయాల్లో తింటారో తెలియదు. అందుకే చాలామందికి జీర్ణ సమస్యలు (digestive problems) వస్తాయి. ఎన్నో అనారోగ్యాల పాలవుతారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి జేబులు గుల్ల చేసుకుంటారు. మళ్లీ అదే జీవితంలోకి అడుగుపెడుతారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు (digestive problems) తెచ్చుకోకూడదు. పోషకాలు బాగా ఉండే ఆహారం(food) తినండి. పుష్కలంగా నీరు తాగండి (drink). అయితే జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి కావలసిన కొన్ని ఆహార పదార్థాలు విరివిగానే లభిస్తాయి. అవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతాయి. అంతేకాకుండా ఏ టైంలో ఏం తినాలో, ఎలాంటి ఆహారం తింటే త్వరగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయం (Night time)లో సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. చాలామందికి రాత్రిళ్లు (night) అరటి పండు (banana) తినడం మంచిదేనా అని అనుమానం ఉంది. రాత్రి ఎలాంటి ఆహారాలు బెటర్​ అనేది తెలుసుకుందాం...

    ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను..

    జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల,  వ్యాయామాలు వంటివి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. రాత్రి సమయం (night time)లో సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే స్నాక్స్, వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంది.

    రెండు, మూడు గంటల ముందు..

    రాత్రి నిద్రపోయే ముందు తేలికగా జీర్ణమయ్యే పండ్లు (Fruits)ను తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి కూడా  చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా తిన్న ఆహారం (food) త్వరగా జీర్ణమవుతుంది. రాత్రి సమయంలో అరటి పండు (banana) తినడం ద్వారా ఆరోగ్యం (health) బాగుంటుందట. అయితే తిన్న తర్వాత వెంటనే కాకుండా నిద్రపోయే రెండు, మూడు గంటల ముందు (two hours before sleep) తింటే బాగుంటుంది. ఇక రాత్రి కీరదోస కాయను తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియ  సక్రమంగా జరగడానికి సహాయపడతాయి.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    రాత్రిళ్లు ద్రాక్ష, స్ట్రాబెరీ, ఆపిల్ (apple) వంటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ పండ్లలో నేరుగా తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా భోజనానికి ముందు వీటిని తీసుకోవడం వల్ల ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది.  రాత్రి సమయంలో పీనట్ బటర్ ను తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు అధికంగా వుంటాయి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Health Tips, Healthy, Healthy food, Night curfew, Sleep

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు