పాము కనిపిస్తే అది విషపూరితమైనదో కాదో గుర్తించడం ఎలా?

Snake Tips: మన దేశంలో రకరకాల పాములు. చిన్నవీ, పెద్దవీ అన్నీ ఉన్నాయి. మరి పాము కనిపించినప్పుడు అది విషపూరితమైనదో కాదో ఎలా గుర్తించాలి? తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 23, 2020, 3:14 AM IST
పాము కనిపిస్తే అది విషపూరితమైనదో కాదో గుర్తించడం ఎలా?
పాము కనిపిస్తే అది విషపూరితమైనదో కాదో గుర్తించడం ఎలా?
  • Share this:
Snake Tips : పాము అనేది కనిపించినప్పుడు కాటు వేయకుండా ఉండే సందర్భాలు తక్కువ. ఎందుకంటే... తనను ఏం చేస్తారోననే భయంలో అది అలా ప్రవర్తిస్తుంది. దాని రక్షణ కోసం ఈ ప్రకృతి తనకు విషం అనేది ఇచ్చింది. ఐతే... కనిపించిన అన్ని పాములూ విషపూరితమైనవి కావు. కొన్ని పాములు అత్యంత డేంజరస్. వాటిలోని ఒక్క చుక్క విషమైనా చాలు... ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కొన్ని పాములు కాటు వేసినా ఏమీ కాదు. కానీ... భయం కొద్దీ మనం వాటిని చంపేసే సందర్భాలుంటాయి. కానీ ఈ భూమిపై మనం ఎలా జీవించాలో, పాములు, ప్రాణులు కూడా అలాగే జీవించాలి. అప్పుడే జీవ పరిణామక్రమం సక్రమంగా ఉంటుంది. అందువల్ల పాము కనిపించినప్పుడు అది విషపూరితమైనదో కాదో గుర్తించేందుకు ఉన్న కొన్ని లక్షణాల్ని తెలుసుకుందాం. ఇవి హెర్పెంటాలజిస్టులు (Herpetologists) ప్రపంచవ్యాప్తంగా పాముల్ని బాగా గమనించి గుర్తించిన లక్షణాలు.

1. Eyes : విషం లేని పాముల కళ్లలోని నల్లగుడ్డు (pupil) గుండ్రంగా ఉంటుంది. విషం ఉండే పాముల్లో నల్లగుడ్డు సన్నటి గీతలా ఉంటుంది. ఐతే... కొన్ని పాముల్లో విషం ఉన్నవాటికి కూడా నల్లగుడ్డు గుండ్రంగానే ఉంటుంది. అవి బ్లాక్ మాంబా (ఆఫ్రికా), కోబ్రా (ఆఫ్రికా, పశ్చిమాసియా), తైపాన్ (ఆస్ట్రేలియా). షాకింగ్ విషయమేంటంటే... విషం లేని కొన్ని పాములు... డేంజర్ సమయాల్లో తమ నల్ల గుడ్డును గుండ్రంగా కాకుండా... సన్నటి గీతలా మార్చేసుకోగలవు. ఉదాహరణకు మాక్ వైపర్.

2. Heat-sensitive pit : విషపూరితమైన పాముల కళ్లూ, ముక్కు మధ్య వేడిని గ్రహించే చిన్న గొయ్యిలాంటి కన్నం ఉంటుంది. ఈ కన్నం ద్వారా అవి వేడి రక్తం ఉండే జీవులు ఎక్కడున్నాయో గుర్తిస్తాయి.

3. Head Shape : చాలా విషపూరిత పాములకు తల త్రిభుజాకారంలో ఉంటుంది. పైగా... మెడ కంటే తల చాలా పెద్దగా ఉంటుంది. విషం లేని పాముల తల గుండ్రంగా ఉంటుంది.

4. Scales : విషపూరితమైన పాములకు వాటి తోకపై సింగిల్ రో స్కేల్స్ (చారలు) ఉంటాయి. ఒక రౌండ్ గీత తర్వాత మరో రౌండ్ గీత ఉంటుంది. ఇలా ఒక గీతకూ, మరో గీతకూ లింక్ అన్నది ఉండదు. అదే విషం లేని పాములకు రెండేసి గీతలు ఒకదానికొకటి కలుస్తూ ఉంటాయి.

5. Bright Colors : విషం ఉన్న పాములు మెరిసే రంగులు, ముదురు రంగుల్లో ఉంటాయి. బుస కూడా కొడతాయి. తిరగబడతాయి.

6. Yellow Colour : వైపర్స్, గడ్డి పాములూ చూడటానికి ఒకేలా ఉంటాయి. కానీ గడ్డి పాముల మెడ చుట్టూ పసుపు రంగు ఉంటుంది. వైపర్స్ (విషం లేనివి) తోకపై ముదురైన జిగ్‌జాగ్ లైన్స్ ఉంటాయి.7. Diamond Shapes : ఏదైనా పాము బాడీపై వజ్రం ఆకారంలోని డిజైన్ ఉండి లేదా మూడు రకాల రంగులు ఉంటే... అది విషపూరితమైన పాము అనుకోవచ్చు.

8. Swimming : విషపూరితమైన నీటి పాములు... తమ మొత్తం బాడీ నీటిపై కనిపించేలా చేస్తూ ఈదుతాయి. విషం లేని పాములు తల మాత్రమే పైకి పెట్టి... మిగతా బాడీని నీటిలోపల ఉంచుతూ ఈదుతాయి.
Published by: Krishna Kumar N
First published: September 23, 2020, 3:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading