హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే ఏం చేయాలి ? ఎలాంటి పద్దతులు నివారణగా పనిచేస్తాయి?

Health tips: గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే ఏం చేయాలి ? ఎలాంటి పద్దతులు నివారణగా పనిచేస్తాయి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాతావరణం కూడా కలుషితం అవుతోంది. కనీసం స్వచ్ఛమైన గాలి (Fresh Air) కూడా అందడం లేదు మనిషికి. అయితే గొంతు నొప్పి (Sore throat) కూడా ఒకటి సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి బాధిస్తుంటుంది.

శారీరక శ్రమ తగ్గించినప్పటి నుంచి మనిషికి అనారోగ్య (Unhealthy) సమస్యలు ఎక్కువవుతున్నాయి. సరైన ఆహారం (good food) కూడా తీసుకోకపోవడం దీనికి మరో కారణం. కల్తీ ఆహారం కూడా కారణమే. మీరు తీసుకునే ఆహారమే మీ ఆరోగ్యం (health) ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది. అందుకే ఎలాంటి ఆహారాలు దేనికి మంచివి అనేవి తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న ప్రపంచంలో వాతావరణం కూడా కలుషితం అవుతోంది. కనీసం స్వచ్ఛమైన గాలి (Fresh Air) కూడా అందడం లేదు మనిషికి. అయితే గొంతు నొప్పి (Sore throat) కూడా ఒకటి సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో ఇన్ఫెక్షన్, మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల జ్వరం, జలుబు. తలనొప్పి (Headache) వంటివి కూడా వస్తాయి. గొంతు నొప్పి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి తగ్గడానికి పాటించవలసిన చిట్కాలు తెలుసుకుందాం...

టీ తయారు చేసుకొని తాగడం..

గొంతు నొప్పి (Sore throat) ఎక్కువగా బాధిస్తుంటే లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం అన్నింటినీ కలిపి టీ తయారు చేసుకొని తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు చల్లని నీటి (cool water)ని తాగ కూడదు గోరువెచ్చని నీళ్ళు (Lukewarm water) తాగడం మంచిది. గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి పుక్కలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుందు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.

అల్లం (ginger) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతు ఇన్ఫెక్షన్ మరియు నొప్పి (Sore throat )ని తగ్గిస్తుంది. ఒక కప్పు నీటిలో అల్లం (Ginger) ఉడకబెట్టండి. అనంతరం ఆ నీటిని రెండు మూడు సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి (Sore throat) నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం మరియు ఒక టీస్పూన్ తేనె (honey) కలుపుకుని తాగాలి. దీంతో మనకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?


ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం (lemon juice), కొంచెం తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే దీనిలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. వీటివల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఉప్పు (salt)లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇది దగ్గు, ఇన్ఫెక్షన్ నుంచి బయట పడేస్తుంది. 1 గ్లాసు గోరు వెచ్చని నీటిలో 1 టీ స్పూన్ ఉప్పు (salt)ను కలిపి రోజుకు 2 నుంచి 3 సార్లు పుక్కిలిస్తే ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు లవంగాలు, తులసి, అల్లం (Ginger), మిరియాలతో తయారు చేసిన టీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

గొంతునొప్పి (Sore throat), గొంతు ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం పొందడానికి ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులు, కొన్ని మిరియాలు వేసి కషాయం చేసుకోవాలి. ఈ కషాయాన్నినిద్రపోయే ముందు తాగడం వల్ల గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి తాగడం వల్ల గొంతు గరగర తగ్గుతుంది. అంతేకాకుండా గొంతు నొప్పి తగ్గుతుంది. పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆకులు తీసేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని తాగితే కొంచెం నొప్పి మాయం.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Ginger, Health Tips, Life Style

ఉత్తమ కథలు