హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Monsoon: వర్షాకాలంలో ఎలాంటి టీ తాగితే బెటర్​..? ఏ ఫుడ్​కి దూరంగా ఉండాలి? వివరాలివే..

Monsoon: వర్షాకాలంలో ఎలాంటి టీ తాగితే బెటర్​..? ఏ ఫుడ్​కి దూరంగా ఉండాలి? వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మామూలు పరిస్థితుల్లో ఏమో కానీ, వర్షాకాలంలో అయితే టీలు తాగేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ విషయంలో కూడా కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది.

  వర్షాకాలం (Rainy Season) వచ్చిందంటే చాలు చలికి దారులు తెరుచుకున్నట్లే. ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోతుంది. అదే మాదిరిగా శరీరం కూడా చల్ల (cool)గా అయిపోతుంది. ఇక ఏం చేస్తాం. వేడివేడిగా తినాలని ఉత్సుకత పుడుతుంది. వేడివేడిగా ఏదైనా తాగాలనీ అనిపిస్తుంటుంది. అది సహజం. దానికోసం చాలమంది పాలు, చాయ్ (tea)​ల వెంట పడుతారు. ఇక ఫ్రెండ్స్​ ఉంటే మాత్రం అక్కడ టీలు లేవాల్సిందే. అయితే మామూలు పరిస్థితుల్లో ఏమో కానీ, వర్షాకాలంలో (Monsoon) అయితే టీలు తాగేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మన బాడీకి సరిపడే, లేదా ఆరోగ్యాన్ని ఇచ్చే టీ (tea)లు అయితే కొంచెం బాగుంటుందట.

  కాగా, ఆహారం (food) విషయానికొస్తే ఈ వర్షాకాలంలో మనం సలాడ్స్ కన్నా .. ఉడకబెట్టిన సలాడ్స్ (Salads) తినడం(eat) చాలా మంచిది. ఈ వర్షాకాలంలో మీరు తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా మసాలాలు ఉండేలా చూసుకోండి. అయితే వర్షాకాలంలో ఎలాంటి టీలు తాగితే ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి చాయ్​లు తాగకూడదు. మన ఆహారపు అలవాట్లపై.. ఓ సారి తెలుసుకుందాం.. వర్షాకాలంలో మన శరీరంలో ఆటోమెటిక్ గా తేమ తగ్గిపోతుంది. దీని వల్ల రెగ్యులర్ గా వాష్ రూమ్ కి వెళ్లాల్సిన పరిస్థతి కూడా రావొచ్చు. అందుకే ఈ కాలంలో మన బాడీకి ఎక్కువగా ఫ్లూయిడ్స్ (fluids) అందించాలి. అలాగే వర్షాకాలంలో నీటిని ఎక్కువగా తీసుకోలేం. కాబట్టి .. దీనికి బదులు మీరు రెగ్యులర్ గా అల్లం టీ (Ginger tea), తులసి టీ, హెర్బల్ (herbal) టీ, మసాలా (masala) టీ వంటివి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికికు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట.

  Makeup precautions | Monsoon: వర్షాకాలంలో మేకప్​ ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలి?

  వర్షాకాలంలో వీలైనంత స్థాయిలో నిల్వ చేసిన పదార్థాలను (Food) తినడం మానుకోండి. సాధ్యమైనంత స్థాయిలో వేడి వేడిగా వండుకుని తినడం చేయండి. రాత్రి పూట మిగిలిన ఆహారాన్ని ఉదయం తినడం వంటివి చేయకండి. అలాగే ఈ వర్షాకాలంలో సలాడ్స్ కన్నా .. ఉడకబెట్టిన సలాడ్స్ తినడం చాలా మంచిది. పసుపు, మిరియాలు, లవంగం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉత్తమంగా పనిచేస్తాయంటే.

  Banana: నల్ల మచ్చలున్న అరటిపండు తినొచ్చా? తింటే ఏమవుతుంది? వివరాలివే..

  వర్షాకాలంలో వాతావరణం చల్లబడటంతో ప్రతి ఒక్కరూ వేడి వేడి సమోసా, చికెన్ పకోడి, మిర్చి వంటి నూనె పదార్థాలను తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే వర్షాకాలంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో మన బాడీనికి సరైన పద్ధతిలో న్యూట్రిసెన్స్​ అందాలంటే .. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Food, Herbal tea, Monsoon, Tea

  ఉత్తమ కథలు