Home /News /life-style /

WHAT KIND OF FOOD SHOULD PREGNANT WOMEN EAT AND SHE HOW TO BE CAREFUL PRV

Food after Pregnancy : గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటే బెటర్​? ఎలా జాగ్రత్త పడాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గర్భిణులు (Pregnant) చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటే (food after pregnancy) గర్భిణులకు సుఖ ప్రసవం కలుగుతుంది. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఒక్కసారి తెలుసుకుందాం.

    ప్రపంచం అంతా కరోనా మహమ్మారి మారణహోమం సృష్టించింది. ఇప్పటికే చాలా మంది కరోనా బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు. ఎవరైనా కరోనా బారిన పడే అవకాశం ఉంది. అయితే మహిళల కంటే గర్భిణులు కరోనా వేళల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో గర్భిణులు (Pregnant) చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటే (food after pregnancy) గర్భిణులకు సుఖ ప్రసవం కలుగుతుంది. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఒక్కసారి తెలుసుకుందా. ఆకుకూరల్లో (Greens)ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం, ఐరన్(Iron) పుష్కలంగా ఉంటుంది. తల్లి నుంచి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని(blood) ఉత్పత్తి చేస్తుంది. బాదంలో విటమిన్ ఇ, ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా బాగా సహాయపడి గర్భిణీ మరికొన్ని అదనపు ప్రోటీనులను మూడు నెలల్లో పొందుతుంది. వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకుంటే బెటర్​.

    ఐరన్​ ఉన్న ఆహారం..

    ఉదయం కడుపులో తిప్పడం, నీరసంగా ఉండటం, వాంతి వచ్చేట్లు ఉన్నట్లైతే చికెన్ (chicken) తింటే బెటరంట. ఇందులో అధిక శాతంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఆస్పరాగస్ లో డి విటమిన్ పుష్కలంగా ఉండి. ఇందులో ఉండే ఆరోమాటిక్ ఫ్లేవర్ మార్నింగ్ సిక్ నెస్ ను పోగొడుతుంది.

    ఆల్కాహాల్​ వద్దు..

    ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆల్కహాల్ (Alcohlol), కెఫిన్ కి దూరంగా ఉండటం మంచిది ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు వీలైనంతవరకు మానేయడం మంచిది. కెఫీన్ విషయానికి వస్తే రోజుకి 200 మిల్లీ గ్రాముల వరకు పర్వాలేదు. అంతకు మించి తీసుకోవద్దు. అయితే బెండకాయ(lady finger) అరుదుగా తింటారు. అయితే ఇందులో ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. బెండకాయలోని ఫోలిక్ యాసిడ్స్ పుట్టుకతో లోపాలను నిరోధిస్తుంది. ఇది గర్భధారణ సమయంలో మధుమేహానికి గురైయ్యే మహిళలకు(women) చాలా మంచి చేస్తుంది థ ఫోలిక్ యాసిడ్. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని(Immunity system) పెంపొంధిస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

    బ్రొకోలీ గ్రీన్ సూపర్ ఫుడ్. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు(health benefits) కలుగుతాయి. దీన్ని తీసుకోవడం చాలా మంచిది. దీని తినడం వల్ల తల్లికి కావల్సిన ఐరన్ అంధించడమే కాకుండా అధిక రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. అత్యధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగినటువంటి గుడ్లలో విటమిన్ డి, విటమిన్ బి12 ప్రోటీనులు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంతో తీసుకోవడం చాలా ముఖ్యం.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Health benefits, Life Style, Pregnancy, Pregnant, Pregnant women, Vegetables

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు