Home /News /life-style /

WHAT KIND OF EXERCISES DO PEOPLE WITH KNEE PAIN RISK FULL DETAILS HERE PRV

Health care: మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఎలాంటి ఎక్సర్​సైజులు చేయకూడదో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మోకాలి నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మోకాళ్ల నొప్పులను సకాలంలో గుర్తించి.. కొన్ని నివారణ చర్యలను తీసుకుంటే ఆపరేషన్ వరకూ దానిని తీసుకుని పోయే అవసరం రాదంటున్నారు నిపుణులు.

    చాలామందికి రాత్రి కాగానే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. కొందరికి పగటి పూట అలసిపోయేంత పని చేస్తే ఆ రోజు రాత్రి నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొందరు రోజు రాత్రి నొప్పులతో ఇబ్బందిపడుతుంటారు. చాలామంది వీటిని తగ్గించేందుకు పెయిన్ కిల్లర్స్ తీసుకొని నిద్రపోతుంటారు. కానీ ఇది అనుకున్నంత చిన్న విషయమే కాదు.. ఎక్కువగా పెద్ద వయసువారికి ఈ సమస్య చాలా సాధారణంగా మోకాళ్ల నొప్పులు (knee pains) వస్తాయి. కానీ, ఇటీవల కాలంలో మోకాలి నొప్పితో బాధపడుతున్న యువకుల సంఖ్య పెరుగుతోంది. సుదీర్ఘ నిర్లక్ష్యం కారణంగా, ఈ సమస్య మోకాళ్ళకు ఆపరేషన్ చేసే (operation) దశకు చేరుకుంటోంది. మోకాళ్ల నొప్పులను సకాలంలో గుర్తించి.. కొన్ని నివారణ చర్యలను తీసుకుంటే ఆపరేషన్ వరకూ దానిని తీసుకుని పోయే అవసరం రాదంటున్నారు నిపుణులు.

    నొప్పులకు ఇంటి వద్దనే నివారణా చర్యలు చేపట్టవచ్చు.  అయితే మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు వ్యాయామాలు (Exercise) చేసేముందు జాగ్రత్త తీసుకోవాలి. నొప్పిని పెంచే పనులు తగ్గించి, కీళ్లను బలపరిచే వ్యాయామాలు సాధన చేయాలి. మోకాళ్ల సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కడం, ఏటవాలు ప్రదేశాల్లో నడవడం వంటి పనులు చేయకూడదు. ఏరోబిక్‌ (Aerobic), జుంబా వ్యాయామాల్లో భాగంగా స్టెప్పర్‌ను వాడడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ పనులు మానుకోవాలి.

    పద్మాసనం, వజ్రాసనం..

    మోకాళ్లు వంచి చేసే పద్మాసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు వేయకూడదు. నేల మీద బాసిం పట్టా వేసి అస్సలు కూర్చోకూడదు. ఇక రోజుకి వీలైనన్ని సార్లు నీళ్లు(Water) తాగడం చాలా మంచిది. అలాగే మోకాళ్ల ఎముకలు గట్టి పడటానికి నాన్​వెజ్ (Non veg) ఎక్కువగా తినాలి. దీని వలన మోకాళ్ల కండరాలు చాలా గట్టిపడతాయి.

    మోకాళ్లు నొప్పులతో బాధ పడుతూ ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మందులు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. చాలా మంది మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధ పడుతూ వుంటారు. ఎన్ని మందులు వాడిన మోకాళ్ళ నొప్పుల సమస్యలు అస్సలు తగ్గవు. అయితే ఈ న్యాచురల్ టిప్స్ తో చాలా ఈజీగా నొప్పుల సమస్యని తగ్గించుకోవచ్చు.  ఈ మోకాళ్ల నొప్పులు తగ్గడానికి ఈ రెసిపీ తయారు చేసుకోండి.. ముందుగా మిక్సీలో మెంతి గింజలను తీసుకుని రుబ్బుకోవాలి.

    అలాగే బరువు తగ్గడం, నొప్పి ఉన్న ప్రాంతాల్లో వేడి లేదా చల్లటి కాపడం పెట్టుకోవడం, ఆక్యుపంక్ఛర్, మెడిటేషన్, మసాజ్ వంటివి ఇది తగ్గించడానికి చక్కటి పద్ధతులుగా చెప్పుకోవచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు