Bangles: అప్పుడే పుట్టిన పిల్లలకు ఎలాంటి రంగు గాజులు వేస్తే మంచిదంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు. కాబట్టి .. చేతినిండా గాజులేసుకుంటే ఇంట్లో లక్ష్మీ దేవి ఉన్నట్లే అని .. మురిసిపోతారు పెద్దలు. అందుకే పుట్టినప్పటి నుంచే ఆడపిల్లలకు గాజులు అలవాటు చేస్తారు. గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం. అయితే పుట్టిన పిల్లలకు కొన్ని ప్రత్యేకమైన గాజులనే వేస్తారంట. ఎందుకంటే అలా కొన్నిరకాల గాజులే వారికి దిష్టి తగలకుండా కాపాడుతాయట.

  • Share this:
    హిందూ సంప్రదాయం ప్రకారం గాజులు అతివల సౌభాగ్యానికి చిహ్నం. బంగారు గాజులు(bangles) ఎన్ని వేసుకున్నా రెండు మట్టిగాజులైనా(clay bangles) ధరించాలి. అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులతో పూజిస్తారు. కాబట్టి .. మట్టిగాజులు వేసుకోవడం .. ముత్తైదుటనను సూచిస్తుంది. గాజులు పగలడాన్ని అమంగళం, అశుభంగా భావిస్తారు భారతీయులు(Indians). ఆడపిల్లలు(girls) లక్ష్మీదేవి స్వరూపులు. కాబట్టి .. చేతినిండా గాజులేసుకుంటే ఇంట్లో లక్ష్మీ దేవి ఉన్నట్లే అని .. మురిసిపోతారు పెద్దలు. అందుకే పుట్టినప్పటి నుంచే ఆడపిల్లలకు గాజులు అలవాటు చేస్తారు. గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం. అయితే పుట్టిన పిల్లల(newborn child)కు కొన్ని ప్రత్యేకమైన గాజులనే వేస్తారంట. ఎందుకంటే అలా కొన్నిరకాల గాజులే వారికి దిష్టి తగలకుండా కాపాడుతాయట(save). ఇంతకీ ఏంటా గాజులు..  ఏ రంగులో ఉంటాయి తెలుసుకుందాం..

    నల్ల రంగు అయితేనే..

    గాజులు వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని.. హిందూ సంప్రదాయం చెబుతోంది. అప్పుడే పుట్టిన పిల్లల(newborn child)కు నల్లగాజులు(black bangles) వేయడం వల్ల దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి. అంతేకాదు.. పిల్లలకు గాజుల శబ్ధం ఆనందంతో.. సంతోషాన్ని కలిగిస్తాయట. ఇప్పటి తరం అమ్మాయిలు మట్టి గాజులు వేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడటం లేదు. లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ ప్లాస్టిక్ గాజులు(plastic bangles) ఇతర రకాల గాజులను వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని అది లాగే అవసరమైన శాస్త్రాలు చెబుతున్నాయి.

    పూర్వకాలంలో..

    మహిళలు గాజులు వేసుకోవడం వెనుక కూడా ఓ రహస్యం ఉంది. పూర్వకాలంలో మగవారు మాత్రమే రోజూ బయటకు వెళ్లి బాగా కష్టపడి పని చేసేవారు. మహిళలు ఇంటికే పరిమితమయ్యేవారు. అందుకే వారి కోసం గాజులు చేశారని చెబుతారు. ఆడవారు గాజులను ధరించడం వల్ల అవి ఎపుడూ చేతి నరాలను తాకుతూ ఉండటం వల్ల బీపీ కంట్రోల్‌గా ఉంటుందట. అనారోగ్య సమస్యలు దరిచేరవని నమ్ముతారు. ముఖ్యంగా ఆడవారి నుంచి నెగెటివ్ ఎనర్జీపుట్టకుండా చేస్తాయట. ఆడవారు మెట్టెలు ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ చేయడం మంచిగా జరుగుతుందట. . దానివల్ల ఆడవారిలో రుతుక్రమం సరిగా అవుతుందని పూర్వకాలంలో అభిప్రాయపడేవాళ్లు. ఆడవాళ్లు వెండి మెట్టెలు ధరించడం వల్ల ప్రకృతిలో ఉండే పాజిటివ్ శక్తి వారి శరీరంలోకి వస్తుందని నమ్మకం.
    Published by:Prabhakar Vaddi
    First published: