Sexual Wellness: కన్నెపొర అంటే ఏంటి...తొలిసారి సెక్స్ చేసినప్పుడు రక్తస్రావం కాకపోతే కన్యత్వం లేనట్లేనా..

ప్రతీకాత్మకచిత్రం

చాలా మంది అవగాహన లేమితో అలా కన్నెపొర లేకపోతే ఆ యువతి కన్యత్వం పెళ్లికి ముందే కోల్పోయి ఉంటుందనే అపవాదులను సైతం ప్రచారం చేస్తుంటారు. అయితే ఈ కన్నెపొర చుట్టూ ఉన్న అపోహల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  • Share this:
పెళ్లి అయిన మొదటి రాత్రి సెక్స్ చేసే సమయంలో అమ్మాయి యోనిలో కన్నెపొర లేదా హైమన్ ఉంటుందని, అది సెక్స్ చేసినప్పుడు చిరుగుతుందని, తద్వారా కాస్త రక్త స్త్రావం అవుతుందని పెద్దలు చెబుతుంటారు. చాలా మంది అవగాహన లేమితో అలా కన్నెపొర లేకపోతే ఆ యువతి కన్యత్వం పెళ్లికి ముందే కోల్పోయి ఉంటుందనే అపవాదులను సైతం ప్రచారం చేస్తుంటారు. అయితే ఈ కన్నెపొర చుట్టూ ఉన్న అపోహల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి అమ్మాయిల్లో హైమన్ పొర అనేది వెజినాను పాక్షికంగా కప్పి ఉంచుతుంది. అయితే వయస్సు పెరిగే కొద్ది శారీరక శ్రమ చేసేవారిలోనూ, అలాగే ఇతర వ్యాయామాలు చేసినప్పుడు గానీ, లేదా సెక్స్ చేసే సమయంలో అది తెగిపోతుంది. కన్యత్వం గురించి చాలా మంది మాట్లాడే విషయాలు అతిశయోక్తి కలిగిస్తాయి. మొదటి లైంగిక సంపర్కం సందర్భంగా చాలా మంది పురుషులు ఇలాంటి వాటిని నమ్ముతారు. అంతేకాదు హైమన్ పొర లేకపోతే భార్య కన్యత్వం కోల్పోయిందిగా భావిస్తారు.

అయితే యుక్తవయస్సులో వచ్చిన అమ్మాయిలు శారీరక వ్యాయామాలు చేయడం, చెట్లు ఎక్కడం, డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, ఓరల్ సెక్స్ లేదా యోనిలో వేలును కదిలించడం వంటి సమయాల్లో కొన్నిసార్లు కన్నెపొర విచ్ఛిన్నమవుతుంది. కొన్ని సందర్భాల్లో హైమెన్ విచ్ఛిన్నం అవకుండా కూడా సెక్స్ జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి . మొదటి లైంగిక సంపర్కంలో కన్నె పొర విచ్ఛిన్నం కావడం వల్ల ప్రతి అమ్మాయి యోనిలో రక్తస్రావం అవుతుందనేది ఒక పెద్ద అపోహ.

హైమెన్ లేదా కన్నెపొరి ఒక రకమైన చర్మం కాదు. ఇది చాలా సన్నని కణ త్వచం, ఇది యోని వెలుపల పాక్షికంగా లేదా పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఇది పోరస్ పొర, దీని ద్వారా రుతుస్రావం సమయంలో రక్తం బయటకు వస్తుంది. ఆసక్తికరంగా, చాలా మంది మహిళల్లో, లైంగిక సంపర్కం మొదటి అనుభవానికి ముందే విచ్ఛిన్నమవుతుంది.

సంభోగం సమయంలో, స్త్రీ శరీరం పురుషుడి శరీరం కన్నా పూర్తిగా భిన్నమైన రీతిలో పనిచేస్తుంది. లైంగిక సంపర్కానికి ముందు మీరు ఫోర్ ప్లే చేయడం చాలా ముఖ్యం, తద్వారా యోని లోపలి భాగం ద్రవాలు ఊరుతాయి.

ఫోర్ ప్లే లేకుండా సెక్స్ చేస్తే జననేంద్రియాలను దెబ్బతీస్తుంది. లైంగిక సంపర్క సమయంలో యోని తగినంతగా తడిగా ఉండాలి. మొదటి లైంగిక సంపర్కంలో కొంతమందికి కన్నెపొర చీలిక వలన కలిగే నొప్పి గురించి మీరు ఆందోళన చెందుతుంటే, లైంగిక సంపర్కానికి హస్త ప్రయోగం చేయమని పార్ట్ నర్ ను అడగండి, ఎందుకంటే ఇది హైమెన్ చీలిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడండి. సంభోగం సమయంలో నెమ్మదిగా, తేలికగా చేయమని పార్ట్ నర్ ను కోరండి. లైంగిక సంపర్కం సమయంలో కన్నెపొర చిరిగి నొప్పి లేస్తే ఐస్ ముక్కలను శుభ్రమైన గుడ్డలో చుట్టి, యోని ప్రారంభంలో ఉంచండి లేదా వెచ్చని నీళ్లతో స్నానం చేయండి. నొప్పి పోయే వరకుసెక్స్ చేయకండి. అధిక రక్తం లేదా నొప్పి ఉంటే, స్త్రీ జననేంద్రియ నిపుణుడిని సంప్రదించండి.
Published by:Krishna Adithya
First published: