హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hair Problem: అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ అంటే ఏంటి..? ఇది ఎందుకు వస్తుంది..?

Hair Problem: అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ అంటే ఏంటి..? ఇది ఎందుకు వస్తుంది..?

Hair Problem: అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ అంటే ఏంటి..? ఇది ఎందుకు వస్తుంది..?

Hair Problem: అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ అంటే ఏంటి..? ఇది ఎందుకు వస్తుంది..?

Hair Problem: కొంతమంది పిల్లలకు జట్టు దువ్వి, చక్కగా క్రాఫ్ తీయాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఈ పరిస్థితిని మెడికల్ పరిభాషలో అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ (UHS) అని పిలుస్తారు. ఈ సిండ్రోమ్ గల పిల్లల జుట్టు పొడిగా, చిట్లినట్లు, నిక్కబొడిచినట్లు ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సాధారణంగా మన తలపై కాస్త జుట్టు (Hair) పైకి లేచినా లేదా చెదిరినా వెంటనే సరి చేసుకుంటాం. స్కూల్ లేదా ఆఫీస్‌కి వెళ్లినప్పుడు కూడా జుట్టు చక్కగా ఉందో లేదో పదే పదే దువ్వుకుంటాం. జుట్టు దువ్వెనతో దూవ్వుకోగానే అది చక్కగా పాపిట రాకపోతే చాలా చిరాకేస్తుంది. అయితే కొంతమంది పిల్లలకు ఇలాంటి సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ పిల్లలకు జట్టు దువ్వి, చక్కగా క్రాఫ్ తీయాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఈ పరిస్థితిని మెడికల్ పరిభాషలో అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ (UHS) అని పిలుస్తారు. ఈ సిండ్రోమ్ గల పిల్లల జుట్టు పొడిగా, చిట్లినట్లు, నిక్కబొడిచినట్లు ఉంటుంది. గంటల కొద్దీ వారి జుట్టును దువ్వినా ఆ హెయిర్ అనేది నిక్కబొడిచినట్లే ఉంటుంది.

* అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్‌కి కారణమేమిటి?

అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్‌ జెనటిక్ ముటేషన్ల వల్ల వస్తుంది. ఈ సిండ్రోమ్‌ గల పిల్లలు సాధారణంగా ఆటోసోమల్ రిసెసివ్ ఇన్‌హెరిటెన్స్‌ ద్వారా జన్యువులను వారసత్వంగా పొందుతారు.

ఇందులో జెనటిక్ మ్యుటేషన్‌ తల్లిదండ్రులిద్దరిలో ఉంటుంది. అయినా కూడా వారికి UHS పరిస్థితి ఉండకపోవచ్చు. ఆటోసోమల్ డామినెంట్ ఇన్‌హెరిటెన్స్‌ ద్వారా కూడా పిల్లలకు ఈ సమస్య రావచ్చు. ఈ సందర్భంలో తల్లిదండ్రులలోని ఒకరి మ్యుటేటెడ్ జీన్ పిల్లలకు పాస్ అవుతుంది. అలా జన్యువులో వచ్చిన మార్పు అనేది పిల్లల్లో జన్యుపరమైన డిజార్డర్‌కి దారి తీస్తుంది.

* ఈ సిండ్రోమ్‌ ఎందుకు వస్తుంది?

ఒక అధ్యయనం ప్రకారం, మూడు జన్యువుల ముటేషన్ల కారణంగా అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్‌ వస్తుంది. ఈ హెయిర్ గ్రోత్ సిండ్రోమ్ వల్ల తలపై అన్ని వైపులా జుట్టు పైకి లేస్తుంది. UHS ఉన్న పిల్లల జుట్టు వెండి, గడ్డి రంగులో ఉంటుంది. ఈ హెయిర్ చిక్కులు కడుతూ ఉంటుంది. జుట్టు షాఫ్ట్‌లో నిర్మాణపరమైన తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. మెలనిన్ లేకపోవడంతో దువ్వడం చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. ఈ రుగ్మత 2-11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో కనిపిస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి మెరుగుపడుతుంది.

* దీనికి చికిత్స ఉందా?

UHSకి అధికారిక చికిత్స లేదు. ఈ సమస్య ఉన్న చాలా మందికి యుక్తవయస్సులోకి రాగానే ఈ కండిషన్ దానంతటదే పరిష్కారం అవుతుంది. తద్వారా జుట్టును ఎలా కావాలంటే అలా దువ్వుకోవచ్చు. UHS ఉన్న పిల్లలకు ఇది ప్రమాదకరం కాదు. కాకపోతే ఈ జుట్టును స్టైల్‌గా దువ్వుకోవడం, సంరక్షించుకోవడం కష్టంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి :  పెళ్లికి ముందు వెంటనే బరువు తగ్గాలా.. అయితే, ఈ చిట్కాలు మీ కోసమే..!

* తీసుకోవాల్సిన జాగ్రత్తలు

UHS ఉన్న పిల్లల్లో జుట్టు సాధారణ జుట్టుతో పోలిస్తే అంత పెళుసుగా ఏం ఉండదు. వారి జుట్టు హెల్దీగానే ఉంటుంది. అలానే పెరుగుతూనే ఉంటుంది కాకపోతే కాస్త నెమ్మదిగా పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, బయోటిన్ సప్లిమెంట్ వాడటం వల్ల ఈ కండిషన్ ఉన్నవారిలో జుట్టు వేగంగా పెరిగింది. అలాగే ఆ కుదుళ్లు బలంగా తయారయ్యాయి. వీటిని దువ్వడం కూడా సాధ్యమయిందట. UHS ఉన్న రోగుల జుట్టును చాలా సున్నితంగా బ్రష్ చేయాలి. బలవంత ఉపయోగించి దువ్వకూడదు. విరిగిపోకుండా ఉండటానికి, జుట్టును వేడి చేయకూడదు. బ్లో డ్రైయింగ్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. హాని చేసే కెమికల్స్ కూడా వాడకూడదు.

First published:

Tags: Hair Loss, Hair problem tips, Life Style