హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Type 1 Diabetes: టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎవరికి వస్తుంది? రాకుండా ఏం చేయాలి?

Type 1 Diabetes: టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎవరికి వస్తుంది? రాకుండా ఏం చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మానవ శరీరంలోని క్లోమ గ్రంధిలో (Pancreas) ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను (బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

ఇంకా చదవండి ...
 • Trending Desk
 • Last Updated :
 • Andhra Pradesh | Telangana | Karnataka | Maharashtra

మధుమేహం లేదా డయాబెటిస్‌ను ప్రాథమికంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. అవే టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది.. శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడం వల్ల ఎదురవుతుంది. దీని బారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని గతంలో ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్’ (IDDM) లేదా ‘జువెనైల్ డయాబెటిస్’ అని పిలిచేవారు. ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపాలు, దీని పనితీరు దెబ్బతినడం కారణంగా టైప్ 2 డయాబెటిస్ ఎదురవుతుంది. ఈ సందర్భంలో శరీర కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేవు. దీన్ని గతంలో నాన్ ఇన్సులిన్-డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్ (NIDDM) లేదా ‘అడల్ట్ ఆన్సెట్ డయాబెటిస్’ అని పిలిచేవారు.

టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి?

మనం తినే ఆహారం రక్తంలోని చక్కెరగా మారి శరీర కణాల్లోకి ప్రవేశిస్తేనే, మన శరీరానికి శక్తి అందుతుంది. కణాల్లోకి బ్లడ్ షుగర్ వెళ్లేలా చేయడంలో ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ లేకుండా రక్తంలో చక్కెర మన శరీర కణాలలోకి ప్రవేశించదు. దీంతో ఇది రక్తప్రవాహంలో పేరుకుపోతుంది. ఇలా రక్తంలో పేరుకుపోయే చక్కెర శరీరానికి హాని చేస్తుంది.

Heart attack : హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే వీటిని తినండి!మానవ శరీరంలోని క్లోమ గ్రంధిలో (Pancreas) ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను (బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్ 1 మధుమేహం అంటారు. సాధారణంగా పిల్లలు, యువకులలో ఈ పరిస్థితి నిర్ధారణ అవుతుంది. కాబట్టి దీన్ని జువెనైల్ డయాబెటిస్ అని పిలుస్తారు. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగనిరోధక వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా, క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు.. బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీన్ని వైద్య పరిభాషలో సెకండరీ డయాబెటిస్ అంటారు. ఇవి రెండూ టైప్ 2 డయాబెటిస్‌కు భిన్నంగా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్‌లో.. వ్యక్తుల శరీరం ఇన్సులిన్‌కు తగిన విధంగా స్పందించదు. మధుమేహం ఉన్నవారిలో దాదాపు 5-10% మందికి మాత్రమే టైప్ 1 డయాబెటిస్ ఉంటుంది.  

Health Insurance: సీనియర్ సిటిజన్స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా..? బెస్ట్ పాలసీకి మంచి ఆప్షన్స్ ఇవే..!టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు (Symptoms)

టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. కొంతమందిలో కొన్ని వారాల్లోనే లక్షణాలను గుర్తించవచ్చు. ఒక్కసారి లక్షణాలు కనిపించిన తర్వాత, అవి తీవ్రంగా మారుతాయి. సాధారణంగా టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. కానీ ఇవి క్రమంగా తీవ్రంగా మారవచ్చు. ఈ లక్షణాలు ఏవంటే.. 


 • విపరీతమైన దాహం

 • తిన్న తర్వాత కూడా బాగా ఆకలి వేయడం

 • నోరు తడి ఆరిపోవడం

 • కడుపు నొప్పి, వాంతులు

 • ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం

 • ఆకలి ఎక్కువగా ఉంటూ, బాగా తింటున్నా కూడా ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం

 • అలసట

 • కంటిచూపు తగ్గిపోవడం

 • శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం.. దీన్ని కుస్మాల్ రెస్పిరేషన్ అంటారు

 • తరచుగా చర్మ, మూత్ర నాళ, యోని ఇన్ఫెక్షన్లు ఎదురవ్వడం

 • క్రాంకినెస్ (Crankiness) లేదా మూడ్ మారిపోవడం

 • నిద్రలోనే మూత్రవిసర్జన చేయడం


టైప్ 1 డయాబెటిస్‌తో సంబంధం ఉన్న అత్యవసర లక్షణాలు (Signs of an emergency)

టైప్ 1 డయాబెటిస్‌ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు గుర్తిస్తే అత్యవసరంగా స్పందించాల్సి ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ లక్షణాలు ఏవంటే..


 1. వణుకు, గందరగోళం

 2. వేగవంతమైన శ్వాస

 3. శ్వాస సమయంలో పండ్ల వాసన రావడం

 4. పొత్తికడుపు నొప్పి

 5. అరుదుగా స్పృహ కోల్పోవడం  


టైప్ 1 డయాబెటిస్‌ రావడానికి కారణం ఏంటి? 

టైప్ 1 డయాబెటిస్ ఆటో ఇమ్యూన్ రియాక్షన్ వల్ల వస్తుందని ప్రాథమికంగా భావిస్తారు. మనుషుల రోగనిరోధక వ్యవస్థ క్లోమగ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలను నాశనం చేస్తుంది. ఏవైనా లక్షణాలు కనిపించడానికి ముందు ఈ ప్రక్రియ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. కొంతమందికి జన్యుపరంగా కూడా టైప్ 1 డయాబెటిస్‌ రావచ్చు. వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. కానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్ 1 డయాబెటిస్‌కు కారణం కావు.

ఈ లక్షణాలు హఠాత్తుగా కనిపిస్తాయా? 

టైప్ 2 డయాబెటిస్‌ బాధితుల్లో లక్షణాలు హఠాత్తుగా కాకుండా క్రమంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ టైప్ 1 డయాబెటిస్ బారిన పడిన వారిలో లక్షణాలు ఆకస్మికంగా కనిపిస్తాయి. ఏదైనా వైరల్ వ్యాధుల బారిన పడిన తర్వాత లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తికి టైప్ 1 నిర్ధారణ కాకముందే.. వారిలో షుగర్ డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (DKA) స్థాయికి చేరుకోవచ్చు. ఇన్సులిన్ లేకపోవడం వల్ల వ్యక్తుల రక్తంలో గ్లూకోజ్ ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పుడు..  శరీరం కణాల నుంచి పోషకాలను సంగ్రహించలేదు. ఈ స్థితిని DKA పాయింట్ అంటారు. ఇలాంటప్పుడు శక్తి కోసం శరీరం మనుషుల కండరాలు, కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల రక్తం, మూత్రంలో కీటోన్లు పేరుకుపోతాయి. శ్వాసలో పండ్ల వాసన, భారీగా శ్వాసతీసుకోవడం, వాంతులు వంటివి DKA లక్షణాలు. చికిత్స చేయకుండా వదిలేస్తే DKA తర్వాతి దశలో మూర్ఛ, అపస్మారక స్థితికి చేరుకోవడంతో పాటు మరణానికి కూడా దారితీస్తుంది.

Types of Blood Pressure: అసలు బీపీ ఎందుకు వస్తుంది? ఎన్ని రకాలు? ఎలా కొలుస్తారు?టైప్ 1 డయాబెటిస్ లేదా DKA లక్షణాలు ఉన్న వ్యక్తులు కచ్చితమైన రోగ నిర్ధారణ కోసం వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఇతర సమస్యలను కూడా సూచిస్తాయి కాబట్టి, సాధ్యమైనంత త్వరగా టెస్టులు చేయించుకోవాలి. టైప్ 1 డయాబెటిస్ ఉన్న కొంతమంది వ్యక్తుల్లో ఇన్సులిన్ కొంతమేరకు స్రవిస్తున్నప్పుడు లక్షణాలు తగ్గిపోవచ్చు. దీన్ని హనీమూన్ పీరియడ్‌ అంటారు. సాధారణంగా ఎవరైనా ఇన్సులిన్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాత హనీమూన్ పీరియడ్ ఏర్పడుతుంది. ఈ దశ ఒక వారం లేదా ఒక సంవత్సరం వరకు కూడా ఉంటుంది. కానీ లక్షణాలు లేకుంటే మధుమేహం పోయిందని అర్థం కాదు. బాధితుల్లో క్లోమగ్రంధి అసలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. అందువల్ల చికిత్స తీసుకోకపోతే లక్షణాలు తిరిగి వస్తాయి.

First published:

Tags: Diabetes, Diabetic

ఉత్తమ కథలు