ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో లాభాలేంటీ? ఎలా వాడుకోవాలి?

ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు... మీకు ఎలాంటి కవర్ కావాలో విశ్లేషించుకొని తీసుకోవడం మంచిది. ఉదాహరణకు మీరు అడ్వెంచరస్ ట్రిప్ వెళ్తున్నట్టైతే... మీరు తీసుకోవాలనుకునే ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో అడ్వెంచరస్ యాక్టివిటీస్‌కు బీమా ఉందో లేదో తెలుసుకోవాలి. ఏదో ఓ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకొని, ఆ తర్వాత మీకు జరిగిన నష్టానికి బీమా వర్తించకపోతే ఇబ్బంది పడేది మీరే.

news18-telugu
Updated: January 8, 2019, 9:06 PM IST
ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో లాభాలేంటీ? ఎలా వాడుకోవాలి?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం భారతదేశానికి చెందిన పర్యాటకులు ప్రతీ ఏటా 2.5 కోట్ల మంది విదేశాలకు వెళ్తుంటారు. 2020 నాటికి 5 కోట్ల మంది టూర్ వెళ్లేందుకు ఫారిన్ ఫ్లైట్ ఎక్కుతారని అంచనా. విదేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగినట్టే ట్రావల్ ఇన్సూరెన్స్ పాలసీలు పెరిగే అవకాశముంది. 2015-16 మధ్య రూ.536 కోట్ల ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముడుపోయాయి. ఆ లెక్క 2017లో రూ.580 కోట్లు. అంటే... విదేశాలకు టూర్ వెళ్తున్నవాళ్లు ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి. అయితే భారతీయ పర్యాటకులకు ట్రావెల్ ఇన్సూరెన్స్‌పై ఉన్న అవగాహన చాలా తక్కువ. అసలు తమ టూర్‌ బడ్జెట్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని ఓ అంశంగా పరిగణించని వారే ఎక్కువ. అసలు ప్రయాణ బీమా అంటే ఏంటీ? దాని వల్ల లాభాలేంటీ? అన్న వివరాలు కూడా చాలామందికి తెలియవు. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటో... తీసుకుంటే వచ్చే లాభాలేంటో... ప్రయాణ బీమా రిస్క్‌ను ఎలా తగ్గిస్తుందో తెలుసుకోండి.

బేసిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ: ఇందులో అత్యవసర వైద్య సంరక్షణ, మీ వస్తువులు కోల్పోవడం లాంటివి కవర్ అవుతాయి. మీరు ఎక్కడైనా లగేజీ పోగొట్టుకున్నా, లేక ఎవరైనా దొంగిలించినా బీమా వర్తిస్తుంది. ఒకవేళ ఫ్లైట్ 12 గంటల కన్నా ఎక్కువ ఆలస్యంగా బయల్దేరితే రీఇంబర్స్ చేసుకోవచ్చు. మీ హోటల్, ఫ్లైట్ టికెట్ రద్దైనా పరిహారం పొందొచ్చు. ట్రిప్‌లో ఉండగా ప్రమాదంలో చనిపోయినా, గాయాలపాలైనా, అనారోగ్యం బారినపడ్డా ఇన్సూరెన్స్ లభిస్తుంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో లాభాలేంటీ? ఎలా వాడుకోవాలి?, What is Travel Insurance? Benefits of Travel Insurance Policy
ప్రతీకాత్మక చిత్రం


డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్: ప్రయాణంలో ఏవైనా దుర్ఘటనలు జరిగితే డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. మీరు ట్రిప్‌లో ఉండగా ఆస్పత్రిపాలైతే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి విమాన ప్రయాణ ఖర్చులు, హోటల్ గదికి అయ్యే ఖర్చుల్ని రీఇంబర్స్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కడైనా యాక్సిడెంటల్ మెడికల్ ఎమర్జెన్సీ, అవసరమైన సాయం అందుతుంది. దాంతోపాటు ప్రయాణం, చికిత్స, వైద్యానికి కావాల్సిన మందులకు అయిన ఖర్చుల్ని ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పొందొచ్చు. బోర్డింగ్ సమయంలో, ఫ్లైట్‌లో ఉన్నప్పుడు అనారోగ్యంపాలైనా, చనిపోయినా పరిహారం లభిస్తుంది.ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో లాభాలేంటీ? ఎలా వాడుకోవాలి?, What is Travel Insurance? Benefits of Travel Insurance Policy
ప్రతీకాత్మక చిత్రం


విదేశీ ప్రయాణ బీమా: విదేశాలకు వెళ్లేవారికోసం ఇచ్చే పాలసీ ఇది. పైన వివరించినవన్నీ ఇందులో వర్తిస్తాయి. దాంతో పాటు పాస్‌పోర్ట్, డాక్యుమెంట్స్, లగేజీ పోగొట్టుకున్నా బీమా పొందొచ్చు. ప్రమాదంలో చనిపోయినా, అవయవాలు కోల్పోయినా, అత్యవసరంగా వైద్యానికి తరలించాల్సిన పరిస్థితి వచ్చినా ఈ బీమా ఆదుకుంటుంది. దాంతోపాటు మీ క్రెడిట్, డెబిట్ కార్డులపై ఏవైనా మోసపూరిత లావాదేవీలు జరిగితే బీమా వర్తిస్తుంది. మీరు విదేశాల్లో డబ్బులు కోల్పోయినా వెంటనే సాయం లభిస్తుంది. పర్యాటకులకు మాత్రమే కాదు... విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులూ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. చదువు మధ్యలో ఆపెయ్యాల్సిన పరిస్థితి వచ్చినా, అనారోగ్యం పాలైనా, మానసిక, నరాల సంబంధిత వ్యాధులు, డ్రగ్, అల్కహాల్ అడిక్షన్ బారినపడ్డా బీమా వర్తిస్తుంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో లాభాలేంటీ? ఎలా వాడుకోవాలి?, What is Travel Insurance? Benefits of Travel Insurance Policy
ప్రతీకాత్మక చిత్రం
ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు... మీకు ఎలాంటి కవర్ కావాలో విశ్లేషించుకొని తీసుకోవడం మంచిది. ఉదాహరణకు మీరు అడ్వెంచరస్ ట్రిప్ వెళ్తున్నట్టైతే... మీరు తీసుకోవాలనుకునే ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో అడ్వెంచరస్ యాక్టివిటీస్‌కు బీమా ఉందో లేదో తెలుసుకోవాలి. ఏదో ఓ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకొని, ఆ తర్వాత మీకు జరిగిన నష్టానికి బీమా వర్తించకపోతే ఇబ్బంది పడేది మీరే. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునేముందు అన్ని డాక్యుమెంట్స్ చదువుకోవాలి.

ఇవి కూడా చదవండి:

మీరు ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో తెలుసా?

ష్యూరిటీ సంతకం పెడుతున్నారా? అయితే జాగ్రత్త...

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ గురించి ఈ విషయాలు తెలుసా?

ఇక ఆన్‌లైన్‌లో అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల బుకింగ్

#HumanStory: ఒక్క రూపాయికే సంగీతం నేర్పించే 'గిటార్ రావు'
First published: January 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు