Tea Facts: టీ గురించి మీకు తెలియని... ఆశ్చర్యపరిచే నిజాలు

National Chai Day : టీని జాతీయ పానీయంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం... సెప్టెంబర్ 21ని జాతీయ తేనీరు దినోత్సవంగా జరుపుతోంది. మరి చాయ్‌కి సంబంధించిన ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2020, 3:40 AM IST
Tea Facts: టీ గురించి మీకు తెలియని... ఆశ్చర్యపరిచే నిజాలు
టీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
  • Share this:
World Tea Facts: మంచినీటి తర్వాత... ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగుతున్నది టీనే. ముఖ్యంగా మన దేశంలో టీ లవర్స్ కోట్లలో ఉన్నారు. పైగా... మన దేశం నుంచీ చాలా దేశాలకు టీ ఎగుమతి అవుతోంది. అసోం, డార్జిలింగ్ టీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఐరోపా దేశాల్లో టీ కంపెనీలు తమ ప్రతినిధులను ఇండియాకి పంపి... టీ ఎస్టేట్ ఓనర్లతో డీల్స్ కుదుర్చుకుంటాయి. అంతలా మన దేశపు టీ కోసం ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తాయి. ఇక ఇండియాలో అత్యంత సంపన్నుల నుంచీ అంత్యంత పేదల వరకూ అందరూ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఒకప్పుడు టీ, కాఫీ మాత్రమే ఉండేవి. మరి ఇప్పుడో ఒక్క టీలోనే ఎన్నో రకాలు వచ్చేశాయి. లెక్కలేనన్ని ఫ్లేవర్లు ఉన్నాయి. టీకి సంబంధించి ఆసక్తికర అంశాల్ని చకచకా తెలుసుకుందాం.

Tea Facts : టీకి సంబంధించిన కొన్ని నిజాలు -

- టీని మొదటిసారిగా క్రీస్తుపూరం 2737లో చైనా చక్రవర్తి షెన్ నంగ్ కనిపెట్టారు. ఆయన తాగే వేడి నీటి గిన్నెలో ఓ తేయాకు అనుకోకుండా పడింది. దాని నుంచీ వచ్చిన టేస్ట్ ఆయనకు నచ్చడంతో... టీ పుట్టుకొచ్చింది.

- శతాబ్దాలుగా టీని ఔషధంగా వాడేవారు. టీని రెగ్యులర్‌గా రోజువారీ తాగేందుకు 3వేల సంవత్సరాలు పట్టింది.

- ప్రస్తుతం ప్రపంచంలో ప్రధానంగా నాలుగు రకాల టీలు ఉన్నాయి. బ్లాక్, గ్రీన్, వైట్, ఊలాంగ్ టీలు. ఈ టీలన్నీ తయారయ్యేది ఒకటే మొక్కతో. ఆ మొక్కే కామెల్లియా సినెన్సిస్ (Camellia sinensis). ఆకుల్ని ఏ సమయంలో కోశారు, ఎలా కోశారు, ఎలా ఎండబెట్టారు, ఎలా ప్రాసెస్ చేశారన్నదాన్నిబట్టీ... రకరకాల టీలు పుట్టుకొచ్చాయి.

- ఏప్రిల్ - మే మధ్యలో పెరిగిన తేయాకులతో తయారుచేసిన గ్రీన్ టీ... ప్రపంచంలో ది బెస్ట్ గ్రీన్ టీ.

- ఇండియాలో టీని పాలు, తేనె, వెనీలా, అల్లం, లంవంగాలు, యాలకులు ఇలా రకరకాల పదార్థాలు, సుగంధ ద్రవ్యాలతో తయారుచేస్తున్నారు.- 1908లో టీ బ్యాగుల వాడకం అమెరికాలో మొదలైంది. థామస్ సల్లివాన్... తన కంపెనీ టీ పొడిని టేస్ట్ చూడమని ప్రజలకు చిన్న బ్యాగుల్లో ఇచ్చాడు. ప్రజలు వాటిని వేడి నీటిలో ముంచి తాగారు. అలా టీ బ్యాగ్స్ పుట్టుకొచ్చాయి.

- టీ బ్యాగ్స్ ఆరు నెలల వరకే ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా టేస్ట్ తగ్గిపోతుంది.

- 18వ శతాబ్దం నుంచీ రెండో ప్రపంచ యుద్ధం వరకూ అమెరికాలో గ్రీన్ టీ ఫేమస్. యుద్ధం తర్వాత ఇండియా నుంచీ టీని దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అప్పుటి నుంచీ అమెరికాలో బ్లాక్ టీ పాపులర్ అయ్యింది.

- ఐస్ టీని 1904లో వర్జీనియాలో కనిపెట్టారు. ఓ రోజు ఐస్ ముక్కలపై టీని పోసి తాగారు. అప్పటి నుంచీ ఐస్ టీ ఫేమస్ అయిపోయింది.

- టీ ఆకుల్ని అధ్యయనం చెయ్యడాన్ని టస్సియోగ్రఫీ (tasseography) అంటారు.

- ఒకప్పుడు అతిథులకు టీ ఇవ్వాలంటే... టీ పాట్, చక్కెర గిన్నె, పాలు, కాఫీ పాట్, వేడి నీటి పాట్, స్లోప్ బౌల్, టీ కప్, సాసర్, ట్రే అన్నీ ఇచ్చేవారు.

- ఫ్రూటీ, హెర్బల్ టీ కోసం... రాస్‌బెర్రీ మొక్కల ఆకుల్ని ఉడగబెట్టే అలవాటు చాలా మందికి ఉంది.

- కొరియా, చైనాలో క్రిసాంతెమమ్ అనే హెర్బల్ టీని బాగా తాగుతారు. అది జ్వరం, తలనొప్పిని తగ్గిస్తుంది.

- తైవాన్‌లో 1980 నుంచీ బబుల్ టీ (బుడగల టీ) వాడకంలో ఉంది. చిక్కటి టీని బాగా గిలక్కొట్టి ఇస్తారు. అందువల్ల అన్నీ బుడగలే ఉంటాయి.

- ఇటలీలో ఆలివ్ చెట్ల ఆకుల నుంచీ కూడా టీని తయారు చేస్తారు. దాన్ని ఆలివ్ లీఫ్ టీ అంటారు.

- టిబెట్‌లో వెన్న టీ (బటర్ టీ) కామన్ డ్రింక్. దీన్ని బ్లాక్ టీ, యాక్ బటర్, ఉప్పు కలిపి తయారుచేస్తారు.

- జెన్‌మైచా అనేది జపాన్‌లో ప్రత్యేకమైన టీ. దీన్ని గ్రీన్ టీ, వేపిన దంపుడు బియ్యంతో తయారుచేస్తారు.
Published by: Krishna Kumar N
First published: September 24, 2020, 3:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading