హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

నార్మల్ బీపీ అంటే ఏంటి? వ్యక్తుల వయసు ప్రకారం నార్మల్ బీపీ ఎంత ఉండాలి?

నార్మల్ బీపీ అంటే ఏంటి? వ్యక్తుల వయసు ప్రకారం నార్మల్ బీపీ ఎంత ఉండాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా బీపీ రీడింగ్‌లో రెండు నంబర్లు నిష్పత్తిగా ఉంటాయి. మొదటి నంబర్ వ్యక్తుల సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను సూచిస్తుంది. రెండో నంబర్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను సూచిస్తుంది. సిస్టోలిక్ అంటే.. లాటిన్ భాషలో సంకోచం అని అర్థం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam | Guntur

రక్తపోటు (Blood Pressure/BP) అంటే రక్త ప్రసరణ సమయంలో ధమని గోడలపై పడే ఒత్తిడి. వ్యక్తుల రక్తపోటు రోజంతా ఒకేలా ఉండదు. సమయం, పనులు చేయడం, ఇతర ఫ్యాక్టర్స్‌ ఆధారంగా బీపీ రేటు కొద్దిగా మారుతుంది. అంటే విశ్రాంతి తీసుకున్నప్పుడు వ్యక్తుల రక్తపోటు తగ్గుతుంది. బయట తిరిగినప్పుడు లేదా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు రక్తపోటు పెరుగుతుంది. కానీ దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు (High BP) ఉంటే.. గుండె, మెదడు, కళ్లు దెబ్బతినడంతో పాటు తీవ్రమైన అనారోగ్యాలు ఎదురుకావచ్చు. అలాగే ఎక్కువ రోజులు తక్కువ రక్తపోటు లేదా లో-బీపీతో (Low BP) బాధపడినా, అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇలాంటి హై బీపీ, లో బీపీని నియంత్రించడానికి వైద్యపరమైన చికిత్స మార్గాలు ఉన్నాయి.

బ్లడ్ ప్రెజర్‌ కొలతలు ఎలా ఉంటాయి? 

సాధారణంగా బీపీ రీడింగ్‌లో రెండు నంబర్లు నిష్పత్తిగా ఉంటాయి. మొదటి నంబర్ వ్యక్తుల సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను సూచిస్తుంది. రెండో నంబర్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను సూచిస్తుంది. సిస్టోలిక్ అంటే.. లాటిన్ భాషలో సంకోచం అని అర్థం. సిస్టోలిక్ రక్తపోటు అనేది.. ఒకరి గుండె కొట్టుకున్నప్పుడు (సంకోచించినప్పుడు) రక్త నాళాలపై పడే ప్రెజర్‌ను సూచిస్తుంది. డయాస్టోలిక్ అనేది "డైలేట్" అనే లాటిన్ పదానికి సంబంధించినది. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ అంటే.. హార్ట్ బీట్స్ మధ్యలో గుండె వ్యాకోచించినప్పుడు రక్త నాళాలపై పడే ప్రెజర్. 

Cancer Types: క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ ఎన్ని రకాలుగా వ్యాపిస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే, సిస్టోలిక్ ప్రెజర్ అనేది గుండె కొట్టుకున్నప్పుడు ధమనులలో ఒత్తిడిని కొలుస్తుంది. డయాస్టోలిక్ ప్రెజర్.. ప్రతి హార్ట్ బీట్ మధ్య ధమనులలో ఒత్తిడిని కొలుస్తుంది. ఈ కొలత ప్రామాణిక యూనిట్ mm Hg. ఇది ‘మిల్లీమీటర్ల పాదరసం’ను సూచిస్తుంది. గతంలో మెర్క్యురీ ప్రెజర్ గేజ్‌లతో బీపీని కొలిచేవారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ప్రెజర్ గేజ్‌లతో బీపీని కొలుస్తున్నారు. సిస్టోలిక్, డయాస్టోలిక్ ప్రెజర్‌లను కలిపి నిష్పత్తిగా బీపీని పేర్కొంటారు. రక్తపోటు కొలతలు సిస్టోలిక్/డయాస్టోలిక్ (mm Hgలో) ప్రెజర్‌గా రికార్డ్ అవుతాయి. ఉదాహరణకు.. 120/80 mm Hg.

Heart Attack Symptoms: అసలు హార్ట్ ఎటాక్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏంటి?పెద్దవాళ్లలో నార్మల్ బీపీ

ప్రస్తుత ప్రమాణాల ప్రకారం నార్మల్ బీపీ అంటే 120/80 mm Hgగా పరిగణిస్తున్నారు. అంటే 120 అనేది సిస్టోలిక్ రీడింగ్, 80 డయాస్టోలిక్ రీడింగ్. బీపీ రీడింగ్ ఇంతకు మించితే హై బీపి (High BP) అని, తగ్గితే లో-బీపీ (Low BP) అని వ్యవహరిస్తున్నారు. అయితే కొందరిలో బీపీ దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటుంది. ఇది అనారోగ్యాలకు దారి తీయవచ్చు.

What is cholesterol : కొలెస్ట్రాల్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు పెరుగుతుంది? దీన్ని ఎలా తగ్గించాలి?అధిక రక్తపోటుతో ఎదురయ్యే సమస్యలు 

గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కంటి సమస్యలు, కిడ్నీ వైఫల్యం, డెమెన్షియా, అంగస్తంభన లోపం వంటివి.

అధిక రక్తపోటు లక్షణాలు

అధిక రక్తపోటు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు. ఈ హైపర్ టెన్షన్‌ను ‘సైలెంట్ కిల్లర్’గా చెబుతుంటారు. దీర్ఘకాలికంగా హై బీపీకి చికిత్స తీసుకోకపోతే గుండెపోటు, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్‌ సహా అనేక సమస్యలకు దారి తీస్తుంది. కొందరు వ్యక్తుల్లో హై బీపీ లక్షణాలు బయటపడవచ్చు. తలనొప్పి, తలతిరగడం, శ్వాస ఆడకపోవడం, చూపు మసకబారడం, మెడ లేదా తలలో పల్సేషన్స్, వికారంగా అనిపించడం.. వంటివి దీని లక్షణాలు. 

Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యకు తమలపాకులో మందు! కడుపు ఇన్ని సమస్యలకు చెక్..


పురుషుల సగటు BP పరిధి వయసును బట్టి మారుతూ ఉంటుంది. ఏజ్ గ్రూప్‌ల వారీగా చూస్తే.. 31-35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి అత్యల్ప సాధారణ రక్తపోటు (Lowest Normal BP) ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్ వారి లోయెస్ట్ నార్మల్ బీపీ 114.5/75.5 వరకు ఉంటుంది. అయితే 61-65 సంవత్సరాల వయసు గల పురుషులకు 143.5/76.5 వరకు అత్యధిక సాధారణ రక్తపోటు (Highest Normal BP) రీడింగ్ ఉంటుంది. పురుషుల మాదిరిగానే మహిళల సగటు BP రేంజ్ కూడా వయసును బట్టి మారుతూ ఉంటుంది. 31-35 సంవత్సరాల మధ్య వయసు ఉండే మహిళలకు లోయెస్ట్ నార్మల్ బీపీ రీడింగ్ (110.5/72.5) ఉంటుంది. 56-60 సంవత్సరాల మధ్య వయసు ఉండే మహిళలకు హయ్యెస్ట్ నార్మల్ బీపీ రీడింగ్ (132.5/78.5) ఉంటుంది. 

నార్మల్ బ్లడ్ ప్రెజర్ చార్ట్

ఆడ, మగవాళ్లకు ఏజ్ గ్రూప్ వారీగా నార్మల్ బ్లడ్ ప్రెజర్ ఎలా ఉండాలో చూద్దాం. ఇందులో సిస్టోలిక్, డయాస్టోలిక్ రేంజ్‌ను వేర్వేరుగా పరిశీలిద్దాం.

                             వయసు ప్రకారం నార్మల్ బీపీ (Normal BP By Age) 

వయసుసిస్టోలిక్ బీపీ (mm Hg)డయాస్టోలిక్ బీపీ (mm Hg)
పురుషులు21-25120.578.5
26-30119.576.5
31-35114.575.5
36-40120.575.5
41-45115.578.5
46-50119.580.5
51-55125.580.5
56-60129.579.5
61-65143.576.5
స్త్రీలు
21-25115.570.5
26-30113.571.5
31-35110.572.5
36-40112.574.5
41-45116.573.5
46-5012478.5
51-55122.5574.5
56-60132.578.5
61-65130.577.5


పిల్లల్లో నార్మల్ బీపీ (Normal BP for Children)

పిల్లలలో నార్మల్ బీపీ అనేది, వారు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు మారుతూ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ అయోవా స్టెడ్ ఫ్యామిలీ చిల్డ్రన్స్ హాస్పిటల్ పిల్లల నార్మల్ బీపీ స్థాయిని గుర్తించింది. ఆ వివరాలు టేబుల్‌లో చూద్దాం. అయితే పిల్లల్లో కూడా వివిధ కారణాలతో బీపీ హెచ్చుతగ్గులకు గురికావచ్చు. పిల్లల ఎత్తు, వయసు, లింగాన్ని బట్టి వారి రక్తపోటు మారుతుంది.  

                                                          పిల్లల్లో నార్మల్ బీపీ

కేటగిరీసిస్టోలిక్డయాస్టోలిక్
ఒక నెల వరకు వయసు ఉన్నవారు60-90 mm Hg20-60 mm Hg
శిశువులు87-105 mm Hg53-66 mm Hg
నిలబడేంత వయసు వచ్చిన పిల్లలు95-105 mm Hg53-66 mm Hg
స్కూల్‌కు వెళ్లే వయసుకు ముందు వరకు (ప్రీ-స్కూల్ ఏజ్)95-110 mm Hg56-70 mm Hg
పాఠశాలకు వెళ్లే వయసు వచ్చినవారు97-112 mm Hg57-71 mm Hg
పెరిగి పెద్దయిన పిల్లలు112-128 mm Hg66-80 mm Hg

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Blood pressure, Health Tips

ఉత్తమ కథలు