కాస్మిక్ క్రిస్ప్ యాపిల్... ఏడాదైనా పాడవ్వదు...

Cosmic Crisp Apple : ఎప్పుడూ తినే తిండే తింటే బోర్ గ్యారెంటీ. అందుకే కొత్త యాపిల్ తయారు చేశారు. ఇందుకు 20 ఏళ్లు పట్టింది.

news18-telugu
Updated: January 11, 2020, 2:58 PM IST
కాస్మిక్ క్రిస్ప్ యాపిల్... ఏడాదైనా పాడవ్వదు...
కాస్మిక్ క్రిస్ప్ యాపిల్ (credit - twitter - Mātōnya and Ardem Patapoutian)
  • Share this:
Cosmic Crisp Apple : సాధారణంగా యాపిల్స్... బయట ఉంచితే... ఓ వారం... మాగ్జిమం 10 రోజులు తాజాగా ఉంటాయి. సైంటిస్టులు కొత్తగా తయారుచేసిన కాస్మిక్ క్రిస్ప్ యాపిల్... ఫ్రిజ్‌లో ఉంచితే... ఏకంగా సంవత్సరంపాటూ పాడవకుండా తాజాగా ఉంటుందట. అంతేకాదు... సంప్రదాయ యాపిల్స్ కంటే ఇది ఎక్కువ రుచికరంగా, ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని ఎలా తయారుచేశారంటే... ఎంతో ఫ్లేవర్ ఉండే హనీక్రిస్ప్ యాపిల్, ఎక్కువ కాలం నిల్వ ఉండే ఎంటర్‌ప్రైజ్ ఏపిల్ రకాలను కలగలిపి... క్రాస్ బ్రీడ్ విధానంలో తయారుచేశారు. 1997లో... వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో ఈ పరిశోధన మొదలైంది. ఇప్పటికి పూర్తైంది. ఇంతకాలం పెరిగిన ప్రత్యేక యాపిల్ ట్రీస్... ఇప్పుడు సరికొత్త యాపిల్స్ ఇస్తున్నా్యి. తద్వారా వాషింగ్టన్ నుంచీ ఈ యాపిల్స్ ప్రపంచ మార్కెట్లకు బయల్దేరాయి. మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచంలో 20 శాతం యాపిల్స్ ఉత్పత్తి అవుతున్నది చైనాలోనే. చైనీయులు... యాపిల్స్‌ని అదృష్టంగా భావిస్తారు. కొత్త యాపిల్స్ ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని అక్కడి మార్కెట్ నిపుణులు లెక్కలేసుకుంటున్నారు.

కొత్త యాపిల్స్ వల్ల... ఫుడ్ వేస్టేజ్ కూడా తగ్గుతుందని అంటున్నారు. ఎందుకంటే... అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి... వేస్టేజ్ కావు. ఈ కొత్త యాపిల్స్ తియ్యగా, క్రిస్పీగా (కరకరలాడుతూ) చాలా రుచికరంగా ఉన్నాయని తింటున్నవాళ్లు అంటున్నారు.


చిత్రమేంటంటే... వీటిని డైరెక్టుగా తినొచ్చు అలాగే... రోస్ట్ చేసుకొని, బేకింగ్ చేసుకొని కూడా తినవచ్చట. రెసిపీల్లో షుగర్ వేసుకునే బదులు... ఈ యాపిల్ జ్యూస్ వేసుకోవడం బెటరంటున్నారు. ఈ యాపిల్ చాలా బరువుగా, అంత ఎక్కువ తడి లేకుండా ఉంటుంది.


సాధారణ యాపిల్స్ కట్ చేసినప్పుడు త్వరగా పసుపు, బ్రౌన్ కలర్‌లోకి మారినట్లు... ఈ కొత్త యాపిల్స్... త్వరగా రంగు మారవు. రోజుకో యాపిల్ తింటే... డాక్టర్‌తో పని ఉండదనేందుకు ఈ యాపిల్స్ కరెక్టుగా సెట్ అవుతాయంటున్నారు అమెరికా ఆరోగ్య నిపుణులు.
First published: January 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు